కాంగ్రెస్ పార్టీ  లీగల్ సెల్ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు పోస్టర్ ఆవిష్కరణ..

కాంగ్రెస్ పార్టీ  లీగల్ సెల్ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు పోస్టర్ ఆవిష్కరణ:-

పాల్గొన్న వరంగల్ మరియు హన్మకొండ లీగల్ సెల్ సభ్యులు:-

హన్మకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్):-

బుధవారం రోజున  తెలంగాణ లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ పిలుపు మేరకు హన్మకొండ మరియు వరంగల్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఒక గర్వకారణమైన మరియు ప్రాముఖ్యతగల ఘట్టంగా, “సాంవిధానిక సవాళ్లు: దృక్కోణాలు & దారులు” అనే శీర్షికతో జరగనున్న జాతీయ సదస్సు పోస్టర్‌ను హన్మకొండ ఉమ్మడి జిల్లా కోర్ట్ లోనీ డాక్టర్ బి . ఆర్ అంబేద్కర్ హాల్లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ సామంతుల శ్రీనివాస ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆగస్టు 2న న్యూఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ ఏ ఐ సి సి లీగల్ సెల్ చైర్మన్ అభిషేక్ సింఘ్వి ఆధ్వర్యంలో జరగనున్న రాజ్యాంగ సవాళ్లు పై జాతీయ సదస్సు ను విజయవంతం చేయాలని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతితులుగా జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గ,తో పాటు అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమం లో జిల్లా కన్వీనర్ కోకొండ రమేష్, రాష్ట్ర కన్వీనర్లు ముదసిర్ అహ్మద్ కయ్యుమ్,పోషిని రవీందర్, రాజోజు వేణుగోపాల్,కునూరు రంజిత్ గౌడ్, రాష్ట్ర వైస్ చైర్మన్లు నల్ల మహాత్మా, , నిమ్మని శేఖర్ రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి వేముల రమేష్,తో పాటు సీనియర్ నాయకులు తోట రాజ్ కుమార్, పసుల యాక స్వామి,, గునిగంటి శ్రీనివాస్, రఘుపతి, హరి హర కుమార్, అరుణ్ ప్రసాద్, సూరం నరసింహ స్వామి, దయాన్ శ్రీనివాసన్, శ్రీనాథ్, గంప వినోద్ కుమార్, మహేందర్, రాజు, శ్రీరామ్ నాయక్, బిక్షపతి, సదానందం,  రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

జాతీయ కవి సమ్మేళనంలో సిరిసిల్ల కవులకు సత్కారం..

జాతీయ కవి సమ్మేళనంలో సిరిసిల్ల కవులకు సత్కారం

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-28T120808.812.wav?_=1

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ,తెలంగాణ పోలీస్ శాఖ, మరియు జ్యోతి జాతీయ తెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో పోలీసులు_ సామాజిక బాధ్యత అనే అంశం పై కవి సమ్మేళనం హైదరాబాద్ లో జరిగినందున ఈ సమావేశానికి ముఖ్య అధ్యక్షులు రాంప్రసాద్ కేశి రాజు, ముఖ్య అతిథి ఐపీఎస్ ,ఎం రమేష్ డి.ఐ.జి ,వెంకట సాయి నాంపల్లి సీ.ఈ.ఓ జ్యోతి, విశ్వనాథ రాజు అధ్యక్షులు తెలంగాణ సారస్వత పరిషత్ తెలంగాణ శాఖ. తెలంగాణ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగినది. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కవులు, రచయితలు డాక్టర్ జనపాల శంకరయ్య రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితి సమితి అధ్యక్షులు,సర్వజన సంరక్షకుడు రక్షక భటుడు అనే అంశంపై తన కవితను ధారాళంగా ఆలాపించారు. బాలసాహితీవేత్త డాక్టర్ .వాసర వేణి పరుశురాం రక్షకభటులు కవిత చదివారు. సిరిసిల్ల సాహితీ సమితి కార్యదర్శి ముడారి సాయి మహేశ్ ,రక్షణ విలువ అనే అంశంపై తన కవితను విన్నవించారు. తర్వాత ముఖ్య అతిథులు ఘనంగా కవులను సత్కరించారు.

విద్యను కషాయంగా మార్చుతున్న కేంద్ర పాలకులు

విద్యను కషాయంగా మార్చుతున్న కేంద్ర పాలకులు రాదండి. దేవేందర్

భూపాలపల్లి నేటిధాత్రి

జాతీయ విద్యావిధానం 2020ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు “కాషాయ విష గరళం”గా మార్చుతున్నారని తెలంగాణవిద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాదండి దేవేందర్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020ని విద్యావేత్తలు సామాజికవేత్తలు విద్యార్థి సంఘాలు మేధావులు స్పష్టంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం తన తిరోగమన విధానాన్ని భారతీయ సమాజంపై రుద్దేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ఏలుతున్న బిజెపి తన గొయ్యి తానే తీసుకోవడం తప్ప మరొకటి కాదనేది నిజం
కాషాయం “కషాయం”గా మారి “విషం” గా మారితే ప్రజలు సహించరనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఏలుతున్న బిజెపి పెద్దలు గ్రహించాలి. విద్యా కాషాయ విధానాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలి. విద్యా కాషాయంతో “బహుజన దేశం” గా ఉన్న భారతదేశాన్ని “బ్రాహ్మణ దేశం”గా మార్చాలని ప్రయత్నిస్తూన్న బిజెపి అంతర్గత కుట్రపూరిత ఎజెండాను ప్రజలు అర్థం చేసుకొని తిప్పి కొట్టడానికి ఎంతో కాలం పట్టదు అని వారు అన్నారు

జాతీయ సదస్సుకు తిరుపతి మేయర్‌ను.!

*జాతీయ సదస్సుకు తిరుపతి మేయర్‌ను ఆహ్వానించకపోవడం అన్యాయం..

-కేంద్ర మంత్రికి ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు..

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 01:

 

 

 

హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ నెల‌ 3, 4 తేదీల్లో రాజ్యాంగం ప్రజాస్వామ్యం, జాతి నిర్మాణంలో పట్టణ స్థానిక సంస్థల పాత్ర” అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి తిరుపతి మేయర్ డాక్ట‌ర్ శిరీష‌ను ఆహ్వానించకుండా, డిప్యూటీ మేయర్‌ను నామినేట్ చేస్తూ ప్రభుత్వం జిఓ జారీ చేయడంపై తిరుపతి పార్లమెంటు సభ్యులు డా.మద్దిల గురుమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రోటోకాల్ ఉల్లంఘనపై కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వశాఖా మంత్రి మనోహర్ లాల్ కి ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదులోని అంశాలు పరిశీలిస్తే …

ఈ సమావేశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన శాఖ విడుదల చేసిన

జీవో ప్రకారం, తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ను ఈ సదస్సుకు పంపనున్నట్లు పేర్కొనడం, ప్రజా ప్రాతినిధ్య నిబంధనలను ఉల్లంఘించడమేనని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.

మేయర్‌గా ప్రజలచే నేరుగా ఎన్నికయ్యే వ్యక్తి, నగరానికి పూర్తి ప్రతినిధిగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందన్నారు. అలాంటి అధికారిక హోదా కలిగిన వ్యక్తిని పక్కన పెట్టి డిప్యూటీ మేయర్‌ను ఎంపిక చేయడం సబబు కాదని పేర్కొన్నారు.

ఇది కేవలం ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ నిబంధనలను ఉల్లంగించడమేనని ఎంపీ స్పష్టం చేశారు.

తిరుపతి మేయర్ డాక్టర్ శిరీషా తిరుపతి నగరపాలక సంస్థకు మొట్టమొదటగా ఎన్నికైన మహిళా మేయర్, ప్రముఖ వైద్యురాలు, బీసీ యాదవ కమ్యూనిటీకి చెందినవారు కావడం విశేషం అని ఆయన తెలిపారు.

ఆమె ఎన్నిక, సామాజిక న్యాయం, అలాగే పురుషుల‌తో స‌మానంగా రాజ‌కీయాల్లో మ‌హిళ‌లు రాణిస్తున్నార‌నేందుకు నిదర్శనమని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు.

ఈ ఘటనపై కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వశాఖ తక్షణమే జోక్యం చేసుకొని, తిరుపతి మేయర్‌కు సదస్సుకు తగిన ఆహ్వానం అందేలా చూడాలని, అలాగే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఎంపీ డిమాండ్ చేశారు.

తవక్కల్ విద్యార్థులకు సెమ్స్ ఒలంపియాడ్.

తవక్కల్ విద్యార్థులకు సెమ్స్ ఒలంపియాడ్ జాతీయ ర్యాంకులు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

 

తవక్కల్ విద్యాసంస్థల్లో విద్యనభ్యసించే విద్యార్థులు ప్రతీ సంవత్సరం ప్రతిభ కనబరుస్తూ జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించడం గర్వంగా ఉందని విద్యాసంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ అన్నారు. గత విద్యా సంవత్సరం జాతీయ స్థాయిలో నిర్వహించిన సెమ్స్ ఒలంపియాడ్ టాలెంట్ టెస్ట్ లో పలువురు విద్యార్థులకు జాతీయ స్థాయిలో ర్యాంకులు వచ్చాయని ఆయన అన్నారు. మందమర్రిలోని ఫోర్త్ క్లాస్ తన్విశ్రీ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్, రామకృష్ణాపూర్ లోని తొమ్మిదవ తరగతి అబూ హురైరా జాతీయ స్థాయిలో మూడవ ర్యాంక్, నాల్గవ తరగతి విధిషా రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్, ఐదవ తరగతి సాయి సృజన్ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ లు సాధించారని అబ్దుల్ అజీజ్ తెలిపారు. హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మొదటి అవార్డ్ గ్రహీత అనూప్ కుమార్ చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలు, గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రం నగదు పురస్కారాలతో విద్యార్థులను సన్మానించారు.విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు.

డాక్టర్ నర్సన్,మారుపాక కృష్ణకు విశ్వపుత్రిక జాతీయ పురస్కారాలు.

డాక్టర్ నర్సన్,మారుపాక కృష్ణకు విశ్వపుత్రిక జాతీయ పురస్కారాలు

సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి):

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ కవులకు విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్,భారతీయ అనువాద ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో,ప్రముఖ గజల్ కవయిత్రి డాక్టర్ పి.విజయలక్మి పండిట్ సారాధ్యములో విశ్వపుత్రిక జాతీయ పురస్కారాలు ప్రధానాలు.. అందించడం జరిగినది.
జాతీయపురస్కారాలకు, వేములవాడనుండి తెలంగాణ అవార్డు గ్రహీత,డాక్టర్ నర్సన్,
గిడుగు రామమూర్తి జాతీయ పురస్కారగ్రహీత,
మారుపాక కృష్ణకు విశ్వ పుత్రిక జాతీయ పురస్కారం అందించడం జరిగినది. అందుకుగాను కమిటీ సభ అధ్యక్షులు సామ్రాట్ కళారత్న డాక్టర్
బిక్కికృష్ణ, ఆధ్వర్యంలో పురస్కారలు అందించడం జరిగినది. ఐ.ఆర్. యస్ ప్రిన్సిపాల్ చీఫ్ సెక్రటరీ నరసింహప్ప, ఇన్కమ్ టాక్స్ అధికారి కంఠం నేని రవిశంకర్, సినిమా ప్రొడ్యూసర్ శ్రీమతి కాంతి కృష్ణ,శ్రీమతి యేలవర్తి ధనలక్ష్మి తదితరులు పాల్గొని వారికి అభినందనలు తెలపడం జరిగినది.

నేషనల్ ఫ్యామిలీ హెల్త్ స్కీ మ్ నుప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలి.

నేషనల్ ఫ్యామిలీ హెల్త్ స్కీ మ్ నుప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలి.

తహసిల్దార్ ఇమాం బాబా షేక్.

చిట్యాల నేటిధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండల తహశీల్దార్ ఇమామ్ బాబా షేకు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ స్కీ మ్ కింద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినటువంటి స్కీం లో మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కుటుంబంలో ఎవరైనా పెద్ద ఏదైనా కారణం చేత మరణించిన చో అతని వయసు 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ఉండవలెను మరియు మరణ ధ్రువీకరణ పత్రము ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకువచ్చి రెవెన్యూ కార్యాలయంలో ఇవ్వగలరు దీని ద్వారా 20వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందని చిట్యాల తహసిల్దారు తెలియజేశారు అవకాశాన్ని చిట్యాల మండల ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

జాతీయ రహదారిపై నాసిరకం పనులు.

జాతీయ రహదారిపై నాసిరకం పనులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

నారాయణఖేడ్ మీదుగా బీదర్, జహీరాబాద్ వైపు వెళ్తున్న జాతీయ రహదారి పనులను కాంట్రాక్టర్ నాసిరకంగా చేపట్టడంతో వాహదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని పిప్రి వద్ద రహదారిపై నాణ్యమైన మట్టి కాకుండా నల్లమట్టి వేయడం వల్ల బుధవారం రాత్రి కురిసిన చిరుజల్లులకే బురదమయంగా మారడంతో వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా వెళ్తున్న రోడ్డుపై వాహనం జారి పడిపోతున్నారు. భారీ వర్షాలు కురిస్తే ఇక అంతే సంగతి అని వాపోతున్నారు.

బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి .

బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

జాతీయ హక్కుల పోరాట సమితి డిమాండ్

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

shine junior college

మంచిర్యాల జిల్లా సీసీసీ కార్నర్ లో బీసీ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం లో భాగంగా కామారెడ్డి లో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో మేము అధికారం లోకి వస్తే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని,5 ఏళ్లలో బీసీ ల సంక్షేమాన్ని లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని,స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ లు 42% పెంచుతామని,ఎంబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని,అన్నీ జిల్లా కేంద్రాల్లో బీసీ భావనాలు నిర్మిస్తామని,అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం నర అవుతున్నా ఏ ఒక్క హామీని అమలు చేయక పోవడం అంటే ఇది బీసీ సమాజాన్ని మభ్య పెట్టడమే అవుతుంది అని అన్నారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలనీ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి గా డిమాండ్ చేస్తూన్నాం.లేకపోతే ఈ అంశాన్ని బీసీ సమాజం దృష్టికి తీసుకెళ్లి బీసీ సమాజం ముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడుతామని హెచ్చరిస్తున్నాం.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ములశ్రీనివాస్, గొల్లకుర్మ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మదనబోయిన రాజన్న యాదవ్,నాయకులు శాఖపురి భీంసేన్,సీపతి రాములు, అంకం సతీష్,చెలిమెల అంజన్న తదితరులు పాల్గొన్నారు.

నేడు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం.

నేడు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి)

 

 

 

 

 

సిరిసిల్ల జిల్లాలోని ఈరోజున జిల్లా కోర్టు ప్రాంగణంలో నేడు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ను నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి
చైర్మన్, డీఎల్ఎస్ఏ రాజన్న సిరిసిల్ల .P. నీరజ మాట్లాడుతూ రాజీమార్గమే రాజా మార్గమని కోర్టులలో పెండింగ్ లో ఉన్న అన్ని సివిల్ కేసులను ఈ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోగలరని సూచించారు.

జీవితం చాలా చిన్నదని మీరందరూ ఎలాంటి గొడవలకు తావివ్వకుండా జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరారు, జాతీయ లోక్ అదాలత్ విజయానికి సహకరించడంలో పోలీసులు, న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, మీడియా పనితీరును ప్రశంసించారు.

 

National Lok Adalat program.

 

ఈ కార్యక్రమం లో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి శ బి.పుష్పలత, అదనపు ఎస్.పి.శ్రీ.డి.చంద్రయ్య, డిఎల్ఎస్ఎ కార్యదర్శి రాధిక జైస్వాల్, సీనియర్ సివిల్ జడ్జి శ్రీ.పి.లక్ష్మణాచారి, మేజిస్ట్రేట్లు శ్రీ.ఎ.ప్రవీణ్, శ్రీమతి కె.సృజన, మిస్.జి.మేఘన, సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ.జె.శ్రీనివాస్ రావు, లోక్ అదాలత్ సభ్యులు శ్రీ.సిహెచ్.భాస్కర్, శ్రీ.ఎ.వేణు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ.పి.శ్రీనివాస్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్, ఇతర న్యాయవాదులు, పోలీసులు, న్యాయవాదులు మరియు కక్షిదారులు పాల్గొన్నారు.

ఈ నెల 14న శనివారం జాతీయ లోక్ అదాలత్.

ఈ నెల 14న శనివారం జాతీయ లోక్ అదాలత్

జిల్లా ప్రధాన న్యాయమూర్తి పీ.నీరజ

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జరగబోయే
ఈ నెల 14వ తేదీన శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పీ.నీరజ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలు, కక్షిదార్లు జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకొని, ప్రజలకు సంబంధించిన సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించు కోవాలని ఈ కార్యక్రమం ద్వారా న్యాయ సంబంధిత సమస్యలు తెలుపవచ్చునని జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.

జాతీయ విద్యా దినోత్సవాన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా జరపాల్సిన రోజుగా గుర్తించాలి.

జాతీయ విద్యా దినోత్సవాన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా జరపాల్సిన రోజుగా గుర్తించాలి

◆ అకడమిక్ క్యాలెండర్‌లో వెంటనే చర్చించాలి.

◆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి.

◆ ఏఐఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ డిమాండ్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షులు షైక్ రబ్బానీ మాట్లాడుతు నవంబర్ 11న మన దేశ తొలి కేంద్ర విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకొని, భారత ప్రభుత్వం 2008 నుండే జాతీయ విద్యా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. విద్యా రంగాన్ని ఆధునికీకరించడంలో, ఐఐటీల స్థాపనలో, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వంటి ప్రముఖ సంస్థల ఏర్పాటులో ఆయన అపారమైన కృషి చేశారు. ఆయన సేవలను స్మరించుకుంటూ, విద్యకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం.

ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశాలు:

విద్య ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడం

సమాన విద్యావకాశాలపై చర్చ జరగడం

విద్యా రంగ పురోగతిపై చైతన్యం కలిగించడం

ప్రతి సంవత్సరం ఈ రోజున పాఠశాలలు, కళాశాలలల్లో:

వ్యాసరచన పోటీలు

చర్చా వేదికలు, సదస్సులు

విద్య ప్రదర్శనలు

విద్యా అభివృద్ధిపై చర్చలు

వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి.
అలాంటి ముఖ్యమైన, విద్యావ్యవస్థకు మూలస్తంభంగా నిలిచే రోజు 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి తెలంగాణ విద్యాశాఖ జారీ చేసిన అకడమిక్ క్యాలెండర్‌లో ప్రస్తావించకపోవడం ఆశ్చర్యకరం, బాధాకరం కూడా.విద్యార్థుల ఎదుగుదలలో అలాంటి స్ఫూర్తిదాయకమైన దినోత్సవాలను ప్రోత్సహించాలి గానీ విస్మరించకూడదు.అందుకే, జాతీయ విద్యా దినోత్సవాన్ని నవంబర్ 11 తేదీకి తగిన ప్రాధాన్యంతో తిరిగి అకడమిక్ క్యాలెండర్‌లో చేర్చాలి అనే డిమాండ్‌ను విద్యాభిమానులందరం గళమెత్తి కోరుతున్నామన్నారు.

75 ఏళ్లుగా దేశాన్ని తప్పుదోవ పట్టించడంతో తృప్తి చెందనట్లుగా, జాతీయవాద పార్టీలు అని పిలవబడే పార్టీలు మరియు వారి అనుయాయులు స్వతంత్ర భారతదేశపు మొదటి విద్యా మంత్రి అబ్దుల్ కలాం ఆజాద్ వంటి వారికి ఈరోజు కూడ జేజేలు పలుకుతున్నారు. నిస్సందేహంగా అతను జన్మత భారతీయుడు కాదు. అతను ఏ పాఠశాలకు వెళ్లలేదు! హిందూ ముస్లిం ఐక్యత’ యొక్క చిహ్నాలలో ఒకరైన, గాంధీతో సమానంగా కీర్తించబడిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్య్రం తర్వాత దేశానికి మొదటి విద్యా మంత్రి అయ్యాడు.భారతదేశంలో విద్యకు పునాదులు వేసిన మహనీయుడు, దృఢమైన జాతీయవాది, గంగా జమునీ తహజీబ్ యొక్క ప్రతీకగా నివాళులర్పించుకున్నాడు. ఇది ఎంతవరకు సమర్థనీయం?…అందు గురించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి
అకడమిక్ క్యాలెండర్‌లో వెంటనే చేర్చాలని
ఏఐఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ
డిమాండ్ చేశారు.

బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులుగా పూరెల్ల నితీష్…

జాతీయ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులుగా పూరెల్ల నితీష్…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

జాతీయ బీసీ విద్యార్థి సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన పూరెల్ల నితీష్ నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ గౌడ్ నియామక పత్రం అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నితీష్ మాట్లాడారు. విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని, విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తానని, బీసీ విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తానని అన్నారు. జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్, విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు విక్రమ్ గౌడ్, బీసీ సంక్షేమ రాష్ట్ర ఉపాధ్యక్షులు నీలకంఠేశ్వర్, గౌరవ అధ్యక్షులు రాపోలు విష్ణువర్ధన్, జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ లకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.

మారుపాక కృష్ణకు గిడుగు జాతీయ కవిత పురస్కారము.

మారుపాక కృష్ణకు గిడుగు జాతీయ కవిత పురస్కారము

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం 2025 గాను గిడుగు రామమూర్తి జాతీయ పురస్కారం హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన భవనంలో గౌరవ అతిథిగా విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తిడాక్టర్ రాధా రాణి, తెలంగాణ కళా రత్న బిక్కి కృష్ణ, గిడుగురామా మూర్తి సంస్థ ఫౌండేషన్ దివాకర్ బాబు,కాంతి కృష్ణ అధ్యక్షుడు, సినిమా రచయిత డాక్టర్ సరళ సినిమా రచయిత విశ్వపుత్రిక గజల్ డాక్టర్ విజయలక్ష్మి పండిత్, వారి చేతుల మీదుగా మారుపాక కృష్ణ కు అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కవులు రచయితలు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండా.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండా ఆవిష్కరించిన…ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చెప్పినట్టు చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి సోపానాలు

సోనియా గాంధీ చోరువుతో తెలంగాణ రాష్ట్రం సాకారమైంది

జోహార్లు తెలంగాణ విద్యార్థి అమరవీరులకు

ఎఏం సి చైర్మన్ నరుకుడు వెంకటయ్య

( నేటిధాత్రి )వర్ధన్నపేట:

మండలం, ఇల్లందలోని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ప్రాంగణం నందు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య గారు జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం జాతీయ జెండాకు వందనం చేసి జాతీయ గీతాన్ని మరియు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించడం జరిగింది.ఈ సందర్భంగా ఏఏంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య గారు మాట్లాడుతూ…సబ్బండ వర్గాల పోరాటాల ఫలితం, సకల జనుల ఉద్యమాల ఫలితం వెరసి సోనియా గాంధీ గారి సాహసోపేతమైన నిర్ణయ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని తెలిపారు.సోనియా గాంధీ గారి ప్రత్యేక చొరువతోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది.కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఇచ్చిన సోనియమ్మకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్ననన్నారు.
చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి సోపానాలు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజ్యాంగం లోని ఆర్టికల్-3 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావడం జరిగిందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.అమ్మ సోనియమ్మ ఇచ్చిన మాటకు కట్టుబడి ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చచ్చిపోయి నష్టపోయినప్పటికిని మరి తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ బలిదానాలు ఉండదని చెప్పి పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పార్లమెంట్ తలుపులు మూయించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ బిల్లు పాస్ చేయించిన ఘనత అమ్మ సోనియమ్మకు దక్కుతుంది. అందుకే తెలంగాణ రాష్ట్రానికి సోనియా గాంధీ గారు తెలంగాణ తల్లి అయిందన్నారు.ఈ కార్యక్రమములో వైస్ చైర్మన్ సిరికొండ కృష్ణా రెడ్డి,డైరెక్టర్లు బచ్చు గంగాధర్ రావు,ఎద్దు శ్రీనివాస్,ఎండి ఖజామియా,బండి సంపత్ గౌడ్, కటబోయిన సంపత్,ఎండి మహమూద్, పుల్లూరు దామోదర్, మార్కేట్ కార్యదర్శి శ్రీనివాస్ రాజు గారు లు పాల్గొన్నారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ.

ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ

నిజాంపేట నేటి ధాత్రి:

జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజాంపేట మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పలు పార్టీల కార్యాలయాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తాహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో శ్రీనివాసులు, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజేష్, రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రాజీరెడ్డి, పార్టీ కార్యాలయాల్లో కాంగ్రేస్ మండల అధ్యక్షుడు వెంకట్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు మవురం రాజు, గ్రామాలలో నూతన గ్రామ అధ్యక్షులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 11 వసంతాలతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నస్కల్ గ్రామ కమిటీ అధ్యక్షుడు మద్దికుంట శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొమ్మాట బాబు, దేశెట్టి సిద్ధ రాములు, గుమ్ముల అజయ్, శ్రీనివాస్,లక్ష్మా గౌడ్ ,బక్కనగారి లింగం గౌడ్, దేవరాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

జాతీయ డెంగ్యూ దినోత్సవం.

జాతీయ డెంగ్యూ దినోత్సవం

– డెంగ్యూ డే సందర్భంగా

– ప్రజల కు అవగాహన కల్పించేందుకు ర్యాలీ.

– దోమల వ్యాప్తిని అరికడుదాం.

డాక్టర్ గుగులోతు రవి

మరిపెడ నేటి ధాత్రి:

దోమల వ్యాప్తిని అరికట్టి డెంగ్యూ వ్యాధిని సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల వైద్యాధికారి డాక్టర్ గూగులోతు రవి పేర్కొన్నారు,డెంగ్యూ డే సందర్భంగా మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి మరిపెడ పట్టణం కార్గిల్ సెంటర్ మరియు బస్టాండ్ సర్కిల్‌ వరకు అవగాహన ర్యాలీ మరియు మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ ఆర్ధోవైరస్‌ తరగతికి చెందిన నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌ల వల్ల ఈ వ్యాధి సోకుతుందన్నారు.ఇది మనిషి నుండి మనిషికి ఏడిస్‌ ఈజిప్టై దోమలద్వారా సంక్రమిస్తుందన్నారు.ఈ జాతి దోమ పైన నల్లని, తెల్లని చారలు ఉండుటవలన దీనిని టైగర్‌ దోమ అనికూడా పిలుస్తారన్నారు. ఈ దోమలు ఇంటిలోపల, ఆవరణలో ఉండి,పగటిపూట మాత్రమే కుడతాయన్నారు.ఇవి ఎక్కువ దూరం (400 మీటర్లు) ఎగరలేవని, అన్ని రకాల దోమలకంటే ఈ దోమ చాలా బరువైనదగా ఉంటుందన్నారు.డెంగ్యూ వైరస్‌ తో ప్రభావం అయిన దోమలోనే కాకుండా దోమ గుడ్లలో కూడా ఈ వైరస్‌ ఉంటుందన్నారు.కాబట్టి త్వరితగతిన ఎక్కువ మందికి వ్యాధి వ్యాపించే అవకాశం ఉంటుందన్నారు. ఈ దోమ మంచినీటి నిల్వలలో మాత్రమే గుడ్లు పెడుతుందని,ఈ వైరస్‌ వలన ఒకటి కంటే ఎక్కువసార్లు కూడా డెంగీ రావచ్చన్నారు,వ్యాధి లక్షణాలు ముఖ్యం గా
ఆకస్మికంగా తీవ్రమైన జ్వరం, తలనొప్పి,విపరీతమైన కండరాలు,కీళ్ళ నొప్పులు
కళ్ళు నొప్పులు, కంటి కదలిక తగ్గటం,నొప్పి,ఒక్కొక్కసారి శరీరంలో ఎర్రటి దద్దుర్లు ఏర్పడుతాయన్నారు
చిగుళ్ళ నుండి రక్తస్రావం
అధిక దాహం, నోరు ఎండిపోవడం వంటి లక్షణాలు ఉంటాయన్నారు.
డెంగీ వ్యాధి మూడు రకాలుగా బయటపడవచ్చు..
డెంగీ జ్వరం,డెంగీ హెమరేజ్‌ జ్వరం,డెంగీ షాక్‌ సిండ్రోమ్‌ గా వెల్లడి అవుతుందన్నారు.
నివారణ చర్యలు ముఖ్యం గా ఇంటిలోపల, ఇంటి ఆవరణలో ఎక్కడా మూతలేకుండా కొద్దిగా నీళ్ళుకూడా నిల్వ ఉండకూడదన్నారు
ఉదాహరణకు పూలకుండీల క్రింద, పెంకులు, కొబ్బరిబోండాలు, రుబ్బురోళ్ళు, పనికిరాని వస్తువులు, పాతటైర్లు, తాగి పడేసిన టీ కప్పులు, సీసాలు, , నీటి ట్యాంకులు, సంప్‌ లు, కూలర్లు, నీటి గుంటలుల్లో ఈ దోమ ఉత్పత్తి అవుతుందన్నారు.
దోమలు కుట్టకుండా దోమతెరలు వాడుకోవాలని వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమం లో డాక్టర్ స్వామి, పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ మంగమ్మ, సూపెర్వైసోర్స్ కృష్ణ, ఆచార్యులు, సుదర్శన్, లక్ష్మి కుమారి, మాధవి, పల్లె దవాఖాన సిబ్బంది సాయి శ్రీ, సిరి, సతీష్, ఝాన్సీ, తరణి, హెల్త్ అసిస్టెంట్ వీరయ్య, నర్సయ్య, ఆశ ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

వేతనాన్ని విరాళంగా అందజేసిన ఎమ్మెల్యే .!

దేశ రక్షణ నిధికి ఒక నెల వేతనాన్ని విరాళంగా అందజేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునందుకొని తాను సైతం దేశ రక్షణ నిధికి ఒక నెల వేతనాన్ని అందజేసి తన గొప్ప మనసును చాటుకున్నారు చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం

సరిహద్దులో పాకిస్తాన్ ముష్కరులను తరిమి కొడుతున్న భారత ఆర్మీ వీరులకు నా సెల్యూట్

గంగాధర నేటిధాత్రి :

 

 

నేను భారతీయుడను- నేను భారత సైన్యానికి మద్దతుగా నిలబడతానని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి భారతీయుడు ఇండియన్ ఆర్మీకి మద్దతుగా నిలబడవలసిన సమయం వచ్చిందన్నారు. సరిహద్దులో పాకిస్తాన్ ముష్కరులను తరిమి కొడుతున్న భారత ఆర్మీ వీరులకు నా సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నారు. దేశ ప్రజలు గర్వించే విజయాలను అందిస్తున్న భారత సైన్యానికి పూర్తి సంఘీభావం తెలుపుతూ, తమ కర్తవ్యం గా దేశ రక్షణ నిధికి ప్రజా ప్రతినిధులు ఒక నెల వేతనాన్ని విరాళంగా అందజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపుమేరకు విరాళం అందజేసినట్లు తెలిపారు.పహాల్గంలో అమాయక ప్రజల ఉసురు తీసి విర్రవీగుతున్న ఉగ్రముకలు, వారిని భారతదేశం పైకి ఉసిగలిపిన పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియన్ ఆర్మీ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియన్ ఆర్మీకి భారతదేశ పౌరులు మద్దతుగా నిలబడే సమయం వచ్చిందన్నారు. నేను భారతీయుడిని, దేశ సరిహద్దుల్లో విరోచితంగా పోరాడుతున్న భారత వీర జవాన్లకు సంఘీభావం తెలియజేస్తున్నట్లు తెలిపారు. చొప్పదండి నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తమకు తోచిన విధంగా దేశ రక్షణ నిధికి విరాళం అందజేయాలని సూచించారు.

నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం.

నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

మండలంలో రోడ్డు విస్తరణలో భాగంగా వరంగల్ నుండి మంచిర్యాల వరకు. నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు మార్గం కొత్తగా నిర్మాణం చేయడం జరుగుతున్న నేపథ్యంలో. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాలతో మొగుళ్లపల్లి మండల తాహసిల్దార్ జాలి సునీత బుధవారం రోజున మొగుళ్లపల్లి గ్రామ శివారు ( భారత్ గ్యాస్ సమీపంలోని) వ్యవసాయ భూముల మీదుగా హైవే రోడ్డు నిర్మాణం చేపడుతున్న ప్రదేశానికి తాహసిల్దార్ చేరుకొని అక్కడున్న వ్యవసాయ భూములను పరిశీలించిన తాసిల్దార్. ప్రభుత్వం రైతుల వద్దనుండి స్వీకరించిన వ్యవసాయ భూములకు రోడ్డుకు అనుగుణంగా రెండు వైపులా హద్దులను వేయించారు. ఇరువైపులా. రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించి వివిధ వాహనాలతో వ్యవసాయ భూమిని చదును చేయించి రోడ్డు విస్తరణ పనులను తాహసిల్దార్ మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో. ఎస్సై బొరగల అశోక్, గిరిధవార్. శివరామకృష్ణ, రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

జూన్ 14 న జాతీయ లోక్ అదాలత్ సీనియర్ సివిల్.!

జూన్ 14 న జాతీయ లోక్ అదాలత్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి జి. కవిత దేవి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జూన్ 14 న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ను పునస్కరించుకొని స్థానిక కోర్టు ఆవరణలో మీడియా ప్రతినిధులతో సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జి. కవిత దేవి సమావేశమై తగు సూచనలు చేశారు. న్యాయమూర్తి మాట్లాడుతూ రాజి మార్గం ద్వారా రాజీ పడదగ్గ కేసులను పరిష్కారం చేసుకోవాలని సూచించారు. మీడియా ప్రతినిధులందరు లోక్ ఆదాలత్ పై విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. లోక్ ఆదాలత్ ద్వారా కేసు రాజీ చేసుకోవడం ద్వారా సమయాన్ని, డబ్బును ఆదాచేసుకున్నవారావుతారని సూచించారు. బాధితులు, కాక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని సూచించారు. లోక్ ఆదాలత్ పై ఏ సమాచారం గురించి తెలుసుకోవాలనుకున్న స్థానిక తహసీల్దార్ కార్యాలయాలను గాని, న్యాయ వాదులను గాని, పోలీస్ ఉన్నతధికారులను గాని, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయంను గాని సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రింట్ మరియు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version