“కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా”…

“కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా”

ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ గా రెండవసారి ఎస్. వినోద్ కుమార్ నియామకం.

మహబూబ్ నగర్/నేటి ధాత్రి

 

 

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం కు చెందిన కాంగ్రెస్ పార్టీ టి.పిసిసి ప్రధాన కార్యదర్శి ఎస్. వినోద్ కుమార్ ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ అబ్జర్వర్ గా రెండవసారి బుధవారం నియామకమయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తిగా చాలా సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఓ నిజమైన నాయకుడిగా ఆయన ఎన్నో పదవులు పొందినారు .ఖైరతాబాద్ నుంచి మరోసారి కాంగ్రెస్ పార్టీ తరఫున అబ్జర్వ్ గా ఆయనను నియమించడం జరిగింది.ఈ మేరకు టి.పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంకితభావంతో పని చేసినందుకు తనకు కాంగ్రెస్ పార్టీ రెండవసారి ఖైరతాబాద్ అబ్జర్వర్ గా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుపేదల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version