సెంటిమెంట్ రగిల్చి లబ్ధిపొందే యత్నం.. బీఆర్‌ఎస్‌పై పీసీసీ చీఫ్ ఫైర్
బీఆర్‌ఎస్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటిమెంట్ రగిల్చి బీఆర్ఎస్ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక ప్రాంతానికి చెందిన వారు కాదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) అన్నారు. నగరంలోని రవీంద్ర భారతిలో ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 4వ వర్ధంతి సభలో మహేష్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో పెడితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. సెంటిమెంట్ రగల్చి బీఆర్ఎస్ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దేవుళ్ల విషయంలో సీఎం ఒక సామెతగా చెప్పారని.. దాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. బీఆర్ఎస్ కోసమే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపించారు.
