నాయకుడి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం

తన అభిమాన నాయకుడి పుట్టినరోజులు.. రక్తదానం

బాలానగర్ /నేటి ధాత్రి

మాజీ మంత్రి లక్ష్మారెడ్డి జన్మదిన సందర్భంగా మంగళవారం జడ్చర్ల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రక్తదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలానగర్ మండలం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సభావత్ రమేష్ నాయక్ లక్ష్మారెడ్డి జన్మదిన సందర్భంగా రక్తదానం చేసి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ నాయకులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలను కాపాడాలన్నారు. తన అభిమాన నాయకుడి పుట్టినరోజున ఒక ప్రాణాన్ని కాపాడే రక్తదాన కార్యక్రమంలో పాల్గొనడం పట్ల పార్టీ శ్రేణులు ఆయనను అభినందించాయి.

ఘనంగా.. శ్రీ దత్త ఆసుపత్రి మొదటి వార్షికోత్సవం…

ఘనంగా.. శ్రీ దత్త ఆసుపత్రి మొదటి వార్షికోత్సవం

బాలానగర్ /నేటి ధాత్రి

 

బాలానగర్ మండల కేంద్రంలోని స్థానిక రైల్వే స్టేషన్ కు వెళ్లే దారిలో ఉన్న శ్రీ దత్త హాస్పిటల్ ప్రథమ వార్షికోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వహకురాలు.. డాక్టర్ మౌనిక (ఎండి) మాట్లాడుతూ.. ఈనెల ఏడో తేదీ వరకు ఓపి, ల్యాబ్ టెస్టులకు 30 శాతం ఫీజు తగ్గింపు ఉంటుందని అన్నారు. మండలంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తక్కువ ఫీజులతోనే మండలంలోని రోగులకు ఆపరేషన్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందమోని దత్తాత్రేయ, మాజీ సర్పంచ్ సాటి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కుర్వ శ్రీను, డాక్టర్ మారుతి, ప్రసన్నకుమార్, సచిన్, భాస్కర్ రెడ్డి, శ్రీకాంత్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

క్రిమిసంహారిక మందు తాగి.. యువకుడు మృతి…

క్రిమిసంహారిక మందు తాగి.. యువకుడు మృతి

బాలానగర్ /నేటి ధాత్రి

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని జీడిగుడ్డ తండా గ్రామపంచాయతీ పరిధిలోని పంచాంగుల గడ్డ తండాలో వారం రోజుల క్రితం కేతావత్ విష్ణు (23) సెంట్రింగ్ పనులు చేస్తూ జీవిస్తూ ఉండేవాడు. ఇటీవల ఇంట్లో ఆర్థిక భూ తగాదాలు జరిగాయని తాండావాసులు అన్నారు. క్షీణికావేశంలో గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంబటే స్పందించి హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం షాద్ నగర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. శనివారం ఉదయం మరణించాడు. చిన్న వయస్సులోనే మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. విష్ణు అంత్యక్రియలకు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

ఆర్టీవో అధికారుల విస్తృత తనిఖీలు…

ఆర్టీవో అధికారుల విస్తృత తనిఖీలు

పలు వాహనాలకు భారీ జరిమానా.

బాలానగర్ /నేటి ధాత్రి

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో నారాయణపేట, మహబూబ్ నగర్ సంయుక్తంగా విస్తృతంగా వాహనాలను తనిఖీ చేపట్టారు. అనుమతి పత్రాలు లేని వాహనాలకు భారీ జరిమానా విధించారు. గురువారం ఉదయం కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు దహనం ఘటన చోటు చేసుకోవడంతో అధికారులు వాహనాల తనిఖీ నిర్వహించారు. అధిక లోడుతో వెళ్తున్న వాహనాదారులను అధికారులు హెచ్చరించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు.

“మా పొట్ట కొట్టొద్దు… సారు…

“మా పొట్ట కొట్టొద్దు… సారు “

“ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మిస్తే.. చచ్చిపోతాం”

 

బాలానగర్ /నేటి ధాత్రి

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని గుండేడు, వనమోని గూడ, గౌతాపూర్, చిన్న రేవల్లి, పెద్ద రేవల్లి గ్రామాల మీదుగా.. ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి అధికారులు ఇటీవలే ప్రతిపాదనలు పంపారు. ఈనెల 15 రైతుల అభిప్రాయాలను అధికారులు సేకరించేందుకు గడువు పెట్టారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల భూ నిర్వాసితులు తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మాట్లాడుతూ.. వ్యవసాయం చేసుకొని జీవిస్తున్న తమకు.. పిడుగు లాంటి వార్త మా జీవితాల్లో నాశనం చేస్తుందని కన్నీటి పర్యంతమయ్యారు. ఉన్న పొలం రోడ్డుకు పోతే తాము జీవనోపాధి కోల్పోతామన్నారు. ఒకవేళ రోడ్డును నిర్మిస్తే క్రిమిసంహారిక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ ప్రతిపాదనలు ఉపసంహరించుకుని, తమకు న్యాయం చేయాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version