టీపీసీసీ లీగల్ సెల్ కోరుట్ల నియోజకవర్గ కన్వీనర్ గా ఎం.డి.రజాక్…

టీపీసీసీ లీగల్ సెల్ కోరుట్ల నియోజకవర్గ కన్వీనర్ గా ఎం.డి.రజాక్
మెట్ పల్లి సెప్టెంబర్ 23 నేటి దాత్రి

 

మెట్ పల్లి పట్టణం: పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా నియమితులైన కోరుట్ల అసెంబ్లీ నియిజకవర్గ లీగల్ సెల్ కమిటీ సభ్యులకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు నియామక ఉత్తర్వులను అందించారు. కన్వీనర్ గా సీనియర్ న్యాయవాది ఎం.డి.రజాక్, కో కన్వీనర్లుగా కస్తూరి రమేష్, మన్నే గంగాధర్, జాయింట్ కన్వీనర్లుగా వంగవేణు, నేరెళ్ల శ్రీధర్, జనరల్ సెక్రటరీ గా నల్ల రాజేందర్, జాయింట్ సెక్రెటరీలుగా గజ్జి గంగారాం, మద్దుల రోజా లకు నియామక ఉత్తర్వులు అందించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నర్సింగరావు మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, కొమిరెడ్డి కరం ల సూచన మేరకు టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ నియామక ఉత్తర్వులు పంపినట్లు టీపీసీసీ లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్, సీనియర్ న్యాయవాది కోటగిరి వెంకటస్వామి తెలిపారు. ఈ సందర్బంగా నియామక ఉత్తర్వులు అందుకున్న న్యాయవాదులు వారి నియామకానికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది, ఏజిపి అబ్దుల్ హఫీజ్, టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెట్టి లింగం, కార్యదర్శి రాంప్రసాద్, న్యాయవాదులు తెడ్డు ఆనంద్, సురక్ష, కోటగిరి చైతన్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఢిల్లీకి తరలి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు..

ఢిల్లీకి తరలి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు:-

వరంగల్/హన్మకొండ, నేటిధాత్రి  (లీగల్):-

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ చైర్మన్ అభిషేక్ మను సింగ్వి ఆగస్టు 2 న రాజ్యాంగ  సవాళ్లపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు సీనియర్ న్యాయవాది వర్ధన్నపేట పిసిసి అధికార ప్రతినిధి టిపిసిసి రాష్ట్ర లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మని శేఖర్ రావు, రాష్ట్ర కన్వీనర్లు మూదాసిర్ అహ్మద్ ఖయ్యూం, పోషిని రవీందర్, కొక్కొండ రమేష్, వెంకటరమణ, మహమ్మద్ జావేద్, గడ్డం విష్ణువర్ధన్  గార్లు శుక్రవారం రోజు సాయంత్రం ఢిల్లీకి జిల్లా కోర్టు ఆవరణం నుండి బయలు దేరి వెళ్ళారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version