ఇంటిస్థలాన్ని విరాళంగా ఇచ్చిన పొల్యూషన్ బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణ రెడ్డి
శంకర్ పల్లి, నేటిధాత్రి: చేవెళ్ల మున్సిపాలిటీ పరిధి దేవుని ఎర్రవల్లి వార్డులోని కార్మికురాలు తూర్పాటి అండాలకు రాష్ట్ర పొల్యూషన్ బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణ రెడ్డి 60 గజాల ఇంటి స్థలాన్ని ఉచితంగా విరాళంగా ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైనప్పటికీ, స్థలం లేకపోవడంతో అండాలకు ఇల్లు నిర్మించేందుకు సత్యనారాయణ రెడ్డి తమ స్వంత భూమిని దాతగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. గురువారం స్థలం రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, మున్సిపాలిటీ కమిషనర్ వెంకటేశం సమక్షంలో పట్టా డాక్యుమెంట్లను కార్మికురాలు అండాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవుని ఎర్రవల్లి మాజీ ఎంపీటీసీ చంద్రయ్య, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సామాజిక బాధ్యతతో ముందుకొచ్చిన సత్యనారాయణ రెడ్డిని అందరూ ప్రశంసించారు.
తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పోలేపాక జనార్ధన్
ములుగు జిల్లా, నేటిధాత్రి
ములుగు జిల్లా పత్తిపల్లి గ్రామస్తుడైన పోలేపాక జనార్దన్ చిన్నప్పటినుండి గురుకులంలో చదువుకుంటూ కబడ్డీలో రాణిస్తూ చాలా రోజులుగా ములుగు జిల్లా కబడ్డీ అసోసియేషన్ లో సెక్రెటరీ గ ఉంటూ అదనంగా జనార్ధన్ కు తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గ ఎన్నిక కావడం జరిగింది. పోలెపాక జనార్దన్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకు బాధ్యతలు అప్పగించినందుకు అదేవిధంగా దీనికి ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాసాని వీరేశం అదేవిధంగా రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ సెక్రెటరీ మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇండియన్ కబడ్డీ ప్లేయర్ కబడ్డీ రథసారథి మహేందర్ కి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ను గెలిపించండి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్
రామడుగు నేటిధాత్రి:
భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ వెంకట్రావుపల్లి శక్తి కేంద్రం ఇంఛార్జి బద్ధం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో లక్ష్మీపూర్ గ్రామంలో వికసిత భారత్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్, మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ లు హాజరై మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్రమోదీ బీజేపీ ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విఫలం అయిందని, రెండున్నర సంవత్సరాలు పూర్తి కాకముందే కాంగ్రెస్ పాలనను ప్రజలు చీకొడుతున్నారన్నారు. తెలంగాణలో త్వరలో జరుగబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు. తెలంగాణ వచ్చే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమేనని వారు జోస్యం చెప్పారు. బీజేపీ పాలనలో ప్రజలు సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, బూత్ కమిటీ అధ్యక్షులు గుర్రం శ్రీనివాస్ గౌడ్, దైవల తిరుపతి గౌడ్, మడికంటి శేఖర్, యువ మోర్చా మండల అధికార ప్రతినిధి వంచ మనోజ్, మల్లయ్య, గోపు అనంత రెడ్డి, నాయకులు, ప్రజలు, తదితరులు హాజరయ్యారు.
పేదింటి అడబిడ్డలకు కళ్యాణలక్మి షాదీముభారక్ పథకాలు ఒక వరం లాంటివి .
◆ -పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కార్
◆ – ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
పట్టణం లోని గౌరి ప్యాలెస్ లో కళ్యాణలక్మి/షాదీముభారక్ సంబంధిత నియోజకవర్గ లోని 925 మంది లబ్దిదారులకు గాను ₹.92,607,300 /- విలువ గల చెక్కులను పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కార్ గారితో కలిసి పంపిణీ చేసిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పథకాలు పేదింటి అడబిడ్డలకు వరప్రదాయినిలని .దేశంలో ఏ రాష్రంలో కూడా కళ్యాణలక్మి, షాదీముభారక్ లాంటి పథకాలు లేవని, పేదింటి అడబిడ్డలను కన్న తల్లిదండ్రులు పడే బాధలు తెలిసి సీఎం కేసీఆర్. ఈ పథకాలు ప్రవేశపెట్టారని, వారికి ఎప్పటికి రుణపడి ఉంటామని తెలిపారు.అలాగే ఇటీవలే ముఖ్య మంత్రి గారి జహీరాబాద్ పర్యటనలో భాగంగా నియోజకవర్గ అభివృద్ధి పనుల కొరకు నిధులను కేటాయిస్తారేమో అని ఆశాభావం వ్యక్తం చేశాం అని, కానీ ముఖ్యమంత్రి గారు ఎలాంటి నిధులను వరాలను ఇవ్వలేదు అని పువ్వు ఇవ్వక పోయినా కనీసం పత్రి అయినా ఇవ్వలేదు అని అన్నారు మోసపూరిత హామీలతో గద్దెను ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేస్తూ కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక పథకం లో 1,00,116 తో పాటుగా తులం బంగారం ఇస్తాం హామీ ఇచ్చారని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండలల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,సంజీవ్ రెడ్డి,వెంకటేశం,పాక్స్ చైర్మన్ మాచెందర్, సీనియర్ నాయకులు నామ రవికిరణ్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహియుద్దీన్,మాజి సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సిపిఐ హనుమకొండ జిల్లా కౌన్సిల్ సభ్యులుగా లంక దాసరి అశోక్
పరకాల నేటిధాత్రి:
ఈ నెల 26,27 న హసన్ పర్తిలో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ హనుమకొండ జిల్లా మహాసభలలో భాగంగా సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులుగా లంక దాసరి అశోక్ ను ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ తక్కలపల్లి శ్రీనివాసరావుకి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కర్ర బిక్షపతికి అశోక్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ సహకరించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ,పరకాల కార్మికులకు పక్షాన నియోజకవర్గంలో ఉన్న చర్లపల్లి,పోచారం తదితరుల గ్రామాలలో కార్మికులు సంఘాలకు నాయకత్వం వహించి అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని మున్సిపాలిటీ భవన నిర్మాణం,హమాలీ బజార్,అమాలి ఐకెపిఆర్ లకోసం నా వంతు పనిచేస్తానని నాపై నమ్మకంతో ఈ పదవిని నాకు అప్పగించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని తెలిపారు.
ఆక్రమ పాకిస్థానీ లను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి పోషిస్తుంది- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో అక్రమంగా నివసిస్తున్న నిషేధిత పాకిస్తానీలను వెంటనే దేశం విడిచి పంపేల చర్యలు తీసుకోవాలని మండల తహశీల్దార్ కి వినతిపత్రం అందచేయడం జరిగింది. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ హాజరై మాట్లాడుతూ నిర్ణిత సమయం ఇచ్చిన కూడా పాకిస్థానీ దేశస్తులు భారత దేశంలో అక్రమంగా ఉంటున్నారని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి పోషిస్తుందని అన్నారు, వెంటనే వారిని గుర్తించి దేశం విడిచి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దేశ భద్రతని దృష్టిలో పెట్టుకొని వారి జాబితా తయారు చేసి బహిష్కరించాలని కోరారు. లేని పక్షంలో బీజేపీ నాయకులే గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, మండల ప్రధాన కార్యదర్శి పోచంపెల్లి నరేష్, మండల ఉపాధ్యక్షులు కారుపాకాల అంజిబాబు, అంబటి నర్సింగరావు, కళ్లెం శివ, బద్ధం లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు జిట్టవేని అంజిబాబు, కట్ట రవీందర్, జిల్లా యువ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, మండల ఓబిసి మోర్చా అధ్యక్షులు బొమ్మకంటి భాస్కర్ చారి, మండల యువ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మణ్, మండల కార్యదర్శి సిరిమల్ల మదన్ మోహన్, బూత్ కమిటీ అధ్యక్షులు రాగం కనకయ్య, ఉత్తేమ్ కనుకరాజ్, వేముల శ్రీనివాస్, నాగి లచ్చయ్య, మంద రాజశేఖర్, కత్తి సాయి, వడ్లూరి రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకారుల జీవనోపాధి కోసం వారిని పాకాల సరస్సులో చేపలు పట్టుకునేందుకు అవకాశాలు కల్పించాలని కోరుతూ టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ మత్స్యకార్మికులతో కలిసి జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా ఖానాపూర్ మండలానికి చెందిన పాకాల సరస్సులో 12 గ్రామాలకు సంబంధించిన దాదాపు 200 మత్స్యకారుల కుటుంబాలు తమ కులవృత్తిగా చేపలను పట్టుకొని జీవన ఉపాధి పొందుతున్నారని అన్నారు.గత 10 రోజుల క్రితం పాకాల సరస్సులో చేపలను పడుతున్న మత్స్యకారుల వలలను జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ ఆదేశాల మేరకు వలలను స్థానిక ఫారెస్ట్ అధికారులు పట్టుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు మత్స్యకారులకు కుటుంబాల సమస్యలు పరిష్కారం కోసం డిఎఫ్ఓ వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. అనాది కాలం నుంచి చేపలను పట్టే వలలను పట్టుకపోవడం వలన మత్స్యకారులు వారి ఉపాధిని కోల్పోవడం జరుగుతున్నదని కాగా విషయాన్ని వివరించడం జరిగిందన్నారు. గతంలో వారికి కేటాయించిన హద్దుల ప్రకారం వలలు వేసి చేపలు పట్టుకొని అవకాశాన్ని కల్పించాలని కోరగా సానుకూలంగా స్పందించిన డీఎఫ్ఓ గతంలాగే చేపలను పట్టుకొనే అవకాశాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు పెండెం రామానంద్ తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీను, ఎస్.అల్లోరు, లక్ష్మినారాయణ,జి. రమేష్, రాజేందర్,పి. వెంకన్న,రమేష్, ఎస్.రాజు, యాకన్న,రవి, మల్సుర్,జి. శ్యాంరాజ్, శేఖర్,వెంకటేష్, జితేందర్, వెంకన్న, రాజయ్య,కార్తీక్,బిక్షపతి, సారంగం,సారంగం,కుమార్, తదితరులు పాల్గొన్నారు.
చికాగో వీధుల్లో కార్మిక వర్గం చిందించిన నెత్తుటి చారికలు నేటికీ స్ఫూర్తిదాయకమని, పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఎనిమిది గంటల పని దినం వంటి హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి కార్మికులపై ఉందని సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు ఉద్ఘాటించారు. మే డే సందర్భంగా కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామంలో కాల్వ నర్సయ్య యాదవ్ చిత్రపటం వద్ద జరిగిన మే డే వేడుకలో అరుణపతాక ఆవిష్కరణ చేశారు. ఈసందర్భంగా పైడిపల్లి రాజు మాట్లాడుతూ, అప్పటి దుర్మార్గపు ప్రభుత్వం కార్మికుల గొంతు నొక్కాలని ప్రయత్నించినా, వారి ఐక్య పోరాటం ముందు తలవంచక తప్పలేదని గుర్తు చేశారు. న్యాయమైన వేతనాలు, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు, జీతంతో కూడిన సెలవులు, మహిళా కార్మికులకు ప్రసూతి సెలవులు, కార్మిక సంక్షేమ చట్టాలు వంటి ఎన్నో విజయాలు ఆపోరాటాల ఫలితమేనని ఆయన అన్నారు. నేడు పరిస్థితులు మళ్లీ మారుతున్నాయని, పాలకుల కార్మిక వ్యతిరేక విధానాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో కార్మిక వర్గం మరింత ఐక్యంగా, సమైక్యంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన నొక్కి చెప్పారు. సమానత్వం కోసం జరిగే ఈపోరాటంలో ప్రతి ఒక్క కార్మికుడు భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జి పురమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో మతోన్మాద బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ, కార్మికుల హక్కులను హరిస్తోందని తీవ్రంగా విమర్శించారు. ఆటోరిక్షా, హమాలి కార్మికుల నుండి మొదలుకొని అడ్డా కూలీల వరకు ప్రతి ఒక్క కార్మికుడు “ప్రపంచ కార్మికులారా ఏకంకండి” అనే చారిత్రాత్మక నినాదంతో స్ఫూర్తి పొంది, సమానత్వం కోసం, తమ హక్కుల కోసం ఐక్య పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రప్రభుత్వ ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని అన్నారు. కార్మిక శక్తికి తిరుగులేదని నిరూపించే సమయం ఆసన్నమైందని పురమళ్ళ శ్రీనివాస్ అన్నారు. ఈజెండా ఆవిష్కరణ కార్యక్రమంలో బొమ్మకల్ సిపిఐ గ్రామ కార్యదర్శి కాల్వ శ్రీనివాస్ యాదవ్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు న్యాలపట్ల రాజు, పిఎసిఎస్ మాజీ వైస్ చైర్మన్ బీరం ఆంజనేయులు, హమాలి నాయకులు మేకల చంద్రయ్య, రాయమల్లు,పాశం మోహన్, గాలిపెల్లి సుధాకర్, మాదరవేణి సంపత్, పెంటమీద ఐలయ్య, పుట్టపాక శంకర్, తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలో వీ ఐ పీ బ్రేక్ దర్శనం టీటీడీ బోర్డుమెంబర్ కు కృతజ్ఞతలు
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణానికి చెందిన జర్నలిస్ట్ పోలిశెట్టి సురేష్ న్యాయవాది దార వెంకటేష్ శ్రీకృష్ణ ప్రింటర్స్ యజమాని ఎం వెంకటరమణ లగిశెట్టి శ్రీకాంత్ బసవరాజ్ రాకేష్ తిరుమలలో శ్రీవారిని గురువారం ఉదయం దర్శనము చేసుకున్నారు వీ ఐ పీ బ్రేక్ దర్శనం కల్పించినందుకు టీ టీ డీ బోర్డు మెంబర్ తెలుగుదేశం నన్నారి నర్సిరెడ్డికి టీ టీ డీ అధికారులకు వారు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు
అనారోగ్యంతో మృతి చెందిన మాజీ కోఆప్షన్ సభ్యురాలి భర్త
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి మునిసిపాలిటీ మాజీ కోఆప్షన్ సభ్యురాలు రజియా భర్త ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో శనివారం మృతి చెందారు. బిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ కోఆప్షన్ సభ్యురాలు రజియా భర్త మరణం పార్టీకి తీరని లోటని బిఆర్ఎస్ పార్టీ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజా రమేష్ బాబు అన్నారు. కుటుంబాన్ని పరామర్శించి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. రజియా కుటుంబానికి మనోధైర్యాన్ని అందించారు. కుటుంబానికి ఎల్లవేళలా పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్, మాజీ కౌన్సిలర్ పోగుల మల్లయ్య, గడ్డం సంపత్, నాయకులు జక్కన బోయిన కుమార్, గడ్డం రాజు, చంద్రమౌళి, సదానందం, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
బోడంగిపర్తి గ్రామానికి చిట్యాలనుండి దేవరకొండ వరకు బస్సు సౌకర్యం కల్పించాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : బోడంగిపర్తి గ్రామానికి చిట్యాల నుండి దేవరకొండ వరకు బస్సు సౌకర్యం కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుబండ శ్రీశైలం అన్నారు.మంగళవారంచండూరు మండల పరిధిలోనిబోడంగి పర్తి గ్రామంలో సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ, దేవరకొండ నుండి , ఉదయం 5 గంటలకు బయలుదేరి వయా చండూరు మీదుగా బోడంగపర్తి గ్రామానికి ఏడు గంటలకు చేరుకుని చిట్యాలకు పోయే విధంగా మళ్లీ సాయంత్రం చిట్యాల నుండి బయలుదేరి బోడంగి పర్తి గ్రామానికి మూడు గంటలకు చేరుకుని మళ్లీ దేవరకొండ పోయే విధంగా బస్సు సౌకర్యం కల్పించాలని ఆయన అన్నారు. . ఈ గ్రామంలో రేషన్ కార్డుల కోసం 500 పైగా దరఖాస్తు చేసుకున్నారని, ఇందిరమ్మ ఇండ్ల కోసం సుమారు 600 మంది, కొత్త పింఛన్ల కోసం 200 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుందనిఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తప్ప మిగతావి ఏవి అమలు చేయలేదని ఆయన అన్నారు. వేసవి వస్తుండడంతో గ్రామంలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండాఅధికారులు చూడాలని, ఇంకా అనేకమంది పేదలు రేషన్ కార్డుల కోసం, ఇందిరమ్మ ఇండ్ల కోసం, పింఛన్ల కోసం ఎప్పుడు వస్తాయని ఆశతో ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. రైతాంగానికి నేటికీ సక్రమంగా రుణమాఫీ కాక, రైతు భరోసా రాక, సన్నధాన్యానికి బోనస్ ఇవ్వక రైతులు ఇబ్బందులు పడుతున్నారనిఆయనఅన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చిట్యాల నుండి వయా మునుగోడు,బోడంగిపర్తి చండూరు, నాంపల్లిదేవరకొండకు పోయే విధంగామళ్లీ సాయంత్రం ఇదే విధంగాఈ గ్రామాల మీదుగా దేవరకొండ నుండి చిట్యాలకు బస్సు సౌకర్యం కల్పించాలనిఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరుబాట కార్యక్రమంలోప్రజలు బాధలు పంచుకుంటున్నారని,ప్రజా సమస్యలను పరిష్కరించని యెడల ప్రజలను సమీకరించి ప్రజా ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోసిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ, సిపిఎం సీనియర్ నాయకులుచిట్టి మల్ల లింగయ్య,వెంకటేశం,రైతు సంఘం మండల కార్యదర్శిఈరటి వెంకటయ్య, బోడంగిపర్తి గ్రామ శాఖ కార్యదర్శిగౌసియా బేగం, యాదయ్య,నరసింహ, గ్రామ ప్రజలుముత్తయ్య,శంకర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
*శ్రీవారి భక్తుల సేవలో తరిస్తున్న నాయి బ్రాహ్మణులు..
*టిటిడి బోర్డు మెంబర్ ను ఉద్యోగులు నిందించడం తగదు…
*ఉద్యోగుల సంక్షేమం కోసమే పరితప్పిస్తున్న బోర్డు మెంబర్ నరేష్ కుమార్..
*వంకిపురం పవన్ ను తమ కులం నుండి ఎప్పుడో వెలివేశాం..
*నాయి బ్రాహ్మణ కుల సంఘ నేతలు…
తిరుపతి(నేటి ధాత్రి)ఫిబ్రవరి 21:
తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం నాయి బ్రాహ్మణులుగా భక్తి భావంతో ఈ రోజు వరకు ఎటువంటి మచ్చ లేకుండా తమ వంతు సేవ చేస్తున్నట్లు జనసేన పార్టీ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు ఆవుల పార్టీ బుజ్జిబాబు పేర్కొన్నారు. ఈ క్రమంలో బుధవారం తిరుమల ముఖద్వారం వద్ద జరిగిన ఘటనపై టిటిడి ఉద్యోగులు తమ కులానికి చెందిన టిటిడి బోర్డు సభ్యుడు నరేష్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ నిరసనలకు పాల్పడటం బాధాకరంగా ఉన్నదని విచారణ వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన తమ సంఘ నాయకులతో కలిసి మాట్లాడారు. టీటీడీ దేవస్థానంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వగానే ఆయన ఇచ్చిన హామీ మేరకు బీసీ నాయి బ్రాహ్మణ కులానికి చెందిన కుప్పం నివాసి అయిన వైద్యం శాంతారావుకి, అలాగే కర్ణాటక రాష్ట్రానికి చెందినమరో నాయి బ్రాహ్మణులు నరేష్ కుమార్ కి టిటిడి పాలకమండలి సభ్యులు గా ఇచ్చినందుకు వారికి మేము జీవితాంతం రుణపడి ఉంటామని వర్షం వ్యక్తం చేశారు. ఈమధ్య తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంటున్న కొత్త నిర్ణయాల వల్ల ఉద్యోగులు తమదైన శైలిలో భక్తులకు, విఐపి లకు తేడా లేకుండా వారికి నచ్చిన రీతిలో వారు విధులను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. బుధవారం జరిగిన టిటిడి పాలక మండలి సభ్యులు నరేష్ కుమార్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటి నుంచి దానికి పది నిమిషాల ముందు మహా ద్వారం గుండా ఎవరెవరు వెళ్లారు..? అనే ఎక్కడా సిసి టీవీ ఫుటేజ్ బయట పెట్టలేదన్నారు. బోర్డు సభ్యులుగా వారికి మహా ద్వారం గుండా పోయే అవకాశం ఉన్న, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిగా బోర్డు మెంబర్ మహా ద్వారం గుండా వెలుపలికి వచ్చే సమయంలో టిటిడి ఉద్యోగి అవగాహన రాహిత్యంగా వ్యవహరించడం సబబుగా లేదన్నారు. తరతరాలుగా నాయి బ్రాహ్మణులుగా మంచి కట్టు, సాంప్రదాయంతో భగవంతుడు సేవలో తాము కూడా శాశ్వత, కాంట్రాక్ట్ ప్రతిపాదికన ఇతర ఉద్యోగస్తులతోపాటు సమైక్యంగా పనిచేసుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో నిరంతరం ఉంటున్నామని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మా సేవలను గుర్తించి టీటీడీ బోర్డు మెంబర్ గా మా కులానికి సంబంధించిన ఇద్దరిని నియమించి రాష్ట్రవ్యాప్తంగా కళ్యాణకట్టలో పనిచేస్తున్న మా సమస్యలను గుర్తించి వాటిని నిషేధిస్తున్న ఈ తరుణంలో మాపై ఇటువంటి వివక్ష చూపడం బాధ కలిగించిందన్నారు.తాము నిజంగానే టీటీడీ ఉద్యోగి పట్ల దురుసుగా ప్రవర్తించి ఉంటే కర్ణాటక రాష్ట్రానికి చెందిన బోర్డు మెంబర్ నరేష్ కుమార్ భాష బేధం వల్ల జరిగిన తప్పిదానికి, దానికి ముందు జరిగిన సీసీటీవీ ఫుటేజ్ ను రిలీజ్ చేసి ఎంతమంది ఆ రోజు ముఖద్వారం ముందు బయటకు ప్రవేశించారన్న వీడియోను టీటీడీ యాజమాన్యం విడుదల చేయాలని కోరారు.నారీశక్తి అవార్డు గ్రహీత, శ్రీవారి కళ్యాణకట్ట మహిళా క్షురకుల వ్యవస్థాపక అధ్యక్షురాలు కె.రాధాదేవి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకునే నిర్ణయాల పట్ల తాము ఎప్పుడు వ్యతిరేకం కాదని, ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంలోకి వస్తున్న తమ తరతరాల ప్రవృత్తి దారులను గుర్తిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు పదవులు ముట్ట చెప్పడం ఆనందదాయకంగా ఉందన్నారు. టీటీడీ లో చిరు ఉద్యోగిగా ఉన్న చీర్ల కిరణ్ అనే వ్యక్తి టిటిడి ఉద్యోగుల అసోసియేషన్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటూ గత టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కనుసనల్లో పనిచేస్తుండేవారు అనే ఆరోపణలు ఎక్కువగా ఉండేవన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ఈయన టిటిడిలో విధులు నిర్వహించకుండా చిరుద్యోగి అయినప్పటికీ అధికారి స్థాయిలో సిబ్బందిపై హుకుం జారీ చేసేవాడని ఆరోపించారు. ఇప్పుడు కూడా టీటీడీ బోర్డు మెంబర్ పై వచ్చిన ఆరోపణలను ప్రతిపక్ష వైసిపి పార్టీ నేతల కనుసనల్లోనే ఉద్యోగులను రెచ్చగొట్టి నిరసన కార్యక్రమాలు చేపట్టడం దుర్మార్గపు చర్య అని చెప్పారు. అలాగే కళ్యాణ కట్టలో పనిచేస్తున్న వెంకీపురం పవన్ పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ప్రతిపక్ష వైసిపి పార్టీకి చెందిన నేతలతో తిరుగుతూ కళ్యాణకట్ట విధులు నిర్వహించకుండా ఉద్యోగ సంఘ నేతగా చలామణి అవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇప్పటికే తమ నాయి బ్రాహ్మణ కులం నుంచి వంకిపురం పవన్ ను బహిష్కరించడం జరిగిందన్నారు. ప్రతిపక్ష వైసిపి పార్టీ నేతల కనుషనల్లోనే కొంతమంది టీటీడీ ఉద్యోగులు ఈ నిరసన కార్యక్రమాలు చేశారని కొంతమంది ఉద్యోగులు బహిరంగంగా చర్చించుకుంటూన్నా రని, పేర్కొన్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు చీర్ల కిరణ్,వంకి పురం పవన్ కార్యకలాపాలపై టీటీడీ ఉన్నతాధికారులువిజిలెన్స్ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ నేపథ్యంలో ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టిటిడి పాలకమండలి సభ్యుడు నరేష్ కుమార్ మాటలను వ్యంగంగా చిత్రీకరిస్తూ టిటిడి ఉద్యోగులు నిరసనలు, ధర్నాలు చేయడం సబబుగా లేదని ఖండించారు. టిటిడి దేవస్థానం వారు సోషల్ మీడియాలో విడుదలైన వీడియోకు ముందు జరిగిన ముఖద్వార ప్రవేశ,బయటకు వచ్చిన వీడియోను కచ్చితంగా విడుదల చేయాలని కరాకండిగా తేల్చి చెప్పారు.ఈ విలేకరుల సమావేశంలో నాయి బ్రాహ్మణ సంఘ నేతలు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.