రామాయంపేట పట్టణం సుందరీకరణ.. పనులు వేగవంతం..
టై బజార్ వేలం రద్దు..
ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వ్యాపారులు..
రామాయంపేట సెప్టెంబర్ 13 నేటి ధాత్రి (మెదక్)
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు ఆదేశాల మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లో ఆనందాన్ని నింపుతున్నారు.
రామాయంపేట పట్టణంలో కూరగాయల మార్కెట్ టై బజార్ వసూల్ వేలం ను రద్దు చేసిన నిర్ణయంపై రైతులు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రోహిత్‌రావు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
ఇక పట్టణ సుందరీకరణలో భాగంగా — సంగారెడ్డి నుంచి వెలుకతుర్తి వెళ్లే 765 డీజి ప్రధాన రహదారిపై, అలాగే సిద్దిపేట వెళ్లే రహదారి డివైడర్ మధ్యన బటర్‌ఫ్లై లైట్ల ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది.
దాదాపు ఒక కోటి యాభై లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ పనులకు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత్రావు అధ్యక్షత వహించారు.
పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రామాయంపేటలో జరుగుతున్న సుందరీకరణ పనులు పూర్తయితే పట్టణం మరింత అందంగా మారనుందని రామాయంపేట పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సరాపు యాదగిరి.రమేష్ రెడ్డి. విప్లవ కుమార్. పిట్ల ప్రకాష్.మాజీ కౌన్సిలర్లు సుందర్ సింగ్. దానికి స్వామి. చింతల స్వామి. తదితర కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.