తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ శ్రీధర్ బాబు కి పాలభిషేకం చేసిన గ్రామ ప్రజలు,నాయకులు
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు పర్శ ఓదెలు ఆధ్వర్యంలో ఖమ్మంపల్లి సమ్మక్క-సారక్క మినీ మేడారం అభివృద్ధి కొరకు నాలుగు లక్షలరూపాయలను ఇచ్చినందుకుగాను మన ప్రాంత అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కి,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుచొప్పరి సదానందం కి పాలాభిషేకం చేయడం జరిగింది.
కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షులు అల్లం కుమారస్వామి ,గ్రామ శాఖ అధ్యక్షులు పర్శ ఓదెలు,వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జాగరి సమ్మయ్య,గ్రామ యువజన అధ్యక్షులు వార్డుమెంబెర్స్ దొమ్మటి రాజేందర్,అల్లం శేఖర్ లు మాట్లాడుతూ
కాంగ్రెస్ ప్రభుత్వం దేవస్థానల అభివృద్ధికి నిధులు విడుదల చెయ్యడం
గొప్ప వరం లాంటిదని నాయకులు కొనియాడారు మరియు మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు కి టి పి సి సి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు కి కృతజ్ఞతలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు,రైతులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.
