బార్ అసోసియేషన్లను సందర్శించిన టిపిసిసి లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్:-
వరంగల్/హన్మకొండ, నేటిధాత్రి (లీగల్):-
బుధవారం రోజున టిపిసిసి లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా వరంగల్ మరియు హన్మకొండ బార్ అసోసిషన్లను సందర్శించారు. వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలస సుధీర్ గారు ఆయను న్యాయవాదులకు పరిచయం చేశారు.
ఇట్టి సందర్భంగా పొన్నం అశోక్ గౌడ్ మాట్లాడుతూ తనను బార్ కౌన్సిల్ మెంబర్ గా గెలిపిస్తే న్యాయవాదులకు హెల్త్ ఇన్సూరెన్స్ మరియు రిటైర్మెంట్ మరియు న్యాయవాదుల సంక్షేమం కోసం పోరాడుతానని అన్నారు, అదేవిధంగా న్యాయవాదుల పై జరుగుతున్న దాడులకు అరికట్టడానికి న్యాయవాదుల రక్షణ చట్టం తేవడానికి తనకు ఉన్న అనుభవం తో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి బిల్లు వచ్చే విధంగా కృషి చేస్తానన్నారు. కాబట్టి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తన గెలుపుకు సహకరించగలరని కోరారు.
ఇట్టి కార్యక్రమంలో వరంగల్ లీగల్ సెల్ చైర్మన్ సామంతుల శ్రీనివాస్, మరియు ఎలుకుర్తి ఆనంద్ మోహన్, జి. శ్రీనివాస్, ఇజ్జిగిరి సురేష్ రాష్ట్ర వైస్ చైర్మన్ శేఖర్ రావు, రాష్ట్ర కన్వీనర్లు పోషిని రవీందర్, రంజిత్ గౌడ్, ఆర్.వేణుగోపాల్, కె.రంజిత్, మరియు సురేందర్ రెడ్డి, ఏ. ప్రసాద్, మహేందర్, గణేష్, నీల శ్రీధర్ రావు, శ్రీధర్ గౌడ్,మరియు సీనియర్, జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు పాల్గొని ఆయన గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు.
