సిరిసిల్ల జూనియర్ కళాశాలపై ఆకస్మిక తనిఖీ..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T170637.807.wav?_=1

 

ప్రభుత్వం జూనియర్ కళాశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీనివాస్

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు ఇంటర్మీడియట్ విద్యాధికారి (co-ed) శ్రీనివాస్ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేపట్టడం జరిగినది. ఇందులో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల గదుల పరిశీలన మరియు సైన్స్ ల్యాబ్లు, విద్యార్థుల మేధాశక్తి గురించి, పాఠ్యాంశాల గురించి, మరియు విద్యార్థుల హాజరుశాతం పెంచాలని,అధ్యాపకులను ఉద్దేశిస్తూ మారుతున్న టెక్నాలజీ నేర్చుకొని విద్యార్థులకు విద్యాబోధన చేయాలని వారు కోరారు.ఎంసెట్ జేఈఈ ఎంట్రన్స్ లకు సంబంధించిన తరగతులను “ఫిజిక్స్ వాలా” నిర్వహిస్తున్నారని వాటి లో పాఠాలు విని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.. ఈ సంవత్సరం కళాశాలలో ఉత్తమ ఫలితాలు తీసుకురావాలని అధ్యాపకులను, విద్యార్థులను కోరారు.

 

 

అలాగే పరిశీలన చేసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. అంతేకాకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు కష్టపడితేనే విజయం తప్పనిసరి తమ వెంట ఉంటుందని సూచనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపల్ కె. విజయ రఘునందన్, తెలుగు అధ్యాపకులు వివేకానంద, మరియు తదితర అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

బిట్స్ పాఠశాలలో ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవం

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-1-2.wav?_=2

బిట్స్ పాఠశాలలో ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవం

హాజరైన బిట్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్.రాజేంద్రప్రసాద్ రెడ్డి

పరకాల నేటిధాత్రి

పట్టణంలోని బిట్స్ పాఠశాలలో ప్రిన్సిపల్ పిండి యుగేందర్ ఆధ్వర్యంలో ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బిట్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని డాక్టర్.సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేశారు.ఈ సందర్బంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క జీవిత సూత్రాలను అనుసరించినటువంటి పద్ధతులను అలాగే ఉత్తమ ఉపాధ్యాయులకు ఉండవలసినటువంటి లక్షణాలను తెలియజేశారు. తరువాత విద్యార్థులు వివిధ నృత్యాలతో,పాటలతో,ఉపన్యాసాలతో చూపర్లను అలరించారు.తర్వాత విద్యార్థులు ఉపాధ్యాయులను పుష్ప మాలా అలంకృతులతో సన్మానం చేశారు.తదానంతరం బిట్స్ పాఠశాల ప్రిన్సిపల్ యుగేందర్ గారు మాట్లాడుతూ సమాజ నిర్మాణానికి కావలసినటువంటి ఉపాధ్యాయుల ఆవశ్యకతను మరియు విద్యార్థిదశ నుండి పెంపొందించుకోవాల్సినటువంటి లక్షణాలను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు

https://netidhatri.com/wp-content/uploads/2025/09/teacher.wav?_=3

ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు

మహాదేవపూర్ (నేటి ధాత్రి)

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండల కేంద్రం లోని బాలుర జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం రోజున సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి లో బాగంగా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల లో భాగంగా పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులను పూల మాలలు మరియు శాలువాలతో సత్కరించి ఉపాధ్యాయుల గొప్పతనాన్ని కొనియాడారు. భారత దేశపు రెండవ రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం మొత్తంలో ఉపాధ్యాయుడిగా చేసిన సేవలే అత్యంత తృప్తినిచ్చాయని తన జీవిత చరిత్రలో రాసుకున్న సందర్భాన్ని ఉపాధ్యాయులు గుర్తు చేసుకున్నారు. ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేది ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన రోజని ప్రధానోపాధ్యాయులు అనిల్ కుమార్ అన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయుల గురించి కవితలు, పాటలు వినిపించి కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రాజయ్య, దేవేందర్ రెడ్డి, రమేష్, లచ్చయ్య, అనిల్ కుమార్, సమ్మయ్య,షాజహా, అనిత, కవిత, కిరణ్ కుమార్, కోటేశ్వర్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు విద్యార్థులు పాల్గొన్నారు.

జిల్లా ఉత్తమ హిందీ ఉపాధ్యాయుడిగా ఎంపికైన గోలి రాధాకృష్ణ…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T150357.474-2.wav?_=4

జిల్లా ఉత్తమ హిందీ ఉపాధ్యాయుడిగా ఎంపికైన గోలి రాధాకృష్ణ

సిరిసిల్ల టౌన్: ( నేదిధాత్రి)

 

సిరిసిల్ల సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రభుత్వ హిందీ ఉపాధ్యాయులు గోలి రాధాకృష్ణ, రాజన్న సిరిసిల్ల జిల్లా 2025- 26 సంవత్సరానికి గాను హిందీ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు కు ఎంపికైన సందర్భంగా సిరిసిల్ల ప్రజలు మరియు ప్రభుత్వ హిందీ ఉపాధ్యాయులు గోలి రాధాకృష్ణను అభినందించడం జరిగినది. గోలి రాధాకృష్ణ మాట్లాడుతూ ఇంత మంచి అవార్డు ఎంపికైనందున ద్వారా జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు గాని మరియు ప్రభుత్వానికి గాని మరియు సిరిసిల్ల జిల్లా పాఠశాల విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు మరియు తోటి ఉపాధ్యాయులు,నాయకులు,అభినందించారు.

జహీరాబాద్లో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T111859.014.wav?_=5

 

జహీరాబాద్లో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సైబర్ జాగృతి దివస్ సందర్భంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని స్రవంతి జూనియర్ కాలేజీలో పట్టణ సీఐ శివలింగం ఆధ్వర్యంలో బుధవారం సైబర్ నేరాలపై అవగాహన సదస్సు జరిగింది. 150 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సీఐ, ఎస్ఐ, పోలీస్ సిబ్బంది సైబర్ నేరాల గురించి, ఆన్లైన్ మోసాల గురించి, తాగి వాహనాలు నడిపితే తీసుకునే చర్యల గురించి, ట్రిపుల్ రైడింగ్ వల్ల కలిగే నష్టాల గురించి, షీ టీమ్స్ గురించి, OTPల వల్ల కలిగే నష్టాల గురించి విద్యార్థులకు వివరించారు.

సీరత్‌ఉన్‌నబీ సభ – మహిళల ఉత్సాహభరిత పాల్గొనిక…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T130359.342-1.wav?_=6

జహీరాబాద్‌లో సీరత్‌ఉన్‌నబీ సభ – మహిళల ఉత్సాహభరిత పాల్గొనిక

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్,రబీ ఉల్ అవ్వల్ నెల సందర్బంగా జమాత్ ఇస్లామీ హింద్ సౌత్ ఉమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో శాంతినగర్ ఇస్లామిక్ సెంటర్‌లో సీరత్‌ఉన్‌నబీ సభ జరిగింది.సభకు అధ్యక్షత వహించిన జమాత్ ఇస్లామీ హింద్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాజిదా బేగం మాట్లాడుతూ ప్రవక్త మహ్మద్ ముస్తఫా జననం మానవాళికి వరమని, అజ్ఞానాంధకారాన్ని తొలగించి కరుణ, ప్రేమ, న్యాయం ప్రసాదించారని పేర్కొన్నారు.

Seerat-un-Nabi Sabha Held in Jahirabad

ప్రత్యేక అతిథి సుమయ్య లతీఫీ అసిస్టెంట్ సెక్రటరీ, ఉమెన్స్ వింగ్, తెలంగాణ మాట్లాడుతూ సీరత్ బోధనలు కేవలం రబీ ఉల్ అవ్వల్‌లోనే కాక, జీవితాంతం ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.హాజరా బేగం, సయ్యదా మేహనాజ్, ఫహ్మీదా మఖ్మూర్, హాఫిజా సఫూరా సిద్దీఖా వేర్వేరు అంశాలపై ప్రసంగించారు.

Seerat-un-Nabi Sabha Held in Jahirabad

హాఫిజా ఉమ్తుల్ ముబీన్ ఖురాన్ తిలావత్ చేశారు. జీఐఓ అధ్యక్షురాలు హుజైఫా అఫ్నాన్ నాత్ పఠించగా, సీఐఓ విద్యార్థినులు సున్నత్ పై నాటిక ప్రదర్శించారు.పిల్లల కోసం సీరత్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మహిళలు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సిరిసిల్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-01T135104.883.wav?_=7

 

సిరిసిల్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ

– ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

 

– విద్యాలయం పరిసరాలు పరిశుభ్రం చేయించాలని ఆదేశాలు

– రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల, సెప్టెంబర్ – 01(నేటి ధాత్రి):

 

 

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సోమవారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం సిద్ధం చేసే గదికి వెళ్లారు. ఆహార పదార్థాలు సిద్ధం చేస్తుండగా, పరిశీలించారు. అనంతరం 6 నుంచి 10 తరగతి గదుల్లోని విద్యార్థుల ను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు.

విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు బోధిస్తుండగా, పరిశీలించారు. 10 వ తరగతి విద్యార్థులకు ఫిజిక్స్ పాఠాలు బోదించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాలు నిత్యం చదివించాలని, రాయించాలని సాధన చేయించాలని సూచించారు. విద్యాలయం ఆవరణ నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. ఆవరణ అంతా మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయించాలని సూచించారు.

మండల కేంద్రంలో క్రీడా దినోత్సవం వేడుకలు …

మండల కేంద్రంలో క్రీడా దినోత్సవం వేడుకలు 
మహాదేవపూర్ఆగష్టు30 (నేటి ధాత్రి )

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో శనివారం రోజున క్రీడా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ క్రీడ దినోత్సవ వేడుకలలో భాగంగా మహాదేవపూర్ మండల కేంద్రంలో విద్యార్థులతో క్రీడ ఉపాధ్యాయుని పూర్ణిమ తోటి ఉపాధ్యాయులతో కలిసి క్రీడా స్ఫూర్తినీ నింపేలా పాటలతో, నినాదాలతో ర్యాలీ నిర్వహించిన అనంతరం ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోటరాజబాపు, పిఎసిఎస్ చైర్మన్ చల్లా తిరుపతి రెడ్డి ఎంఈఓ ప్రకాష్ సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ క్రీడలలో విద్యార్థులు ముందంజలో ఉంటూ జాతీయస్థాయిలో క్రీడ పోటీలలో విజేతలుగా నిలిచి భవిష్యత్ తరాలకు క్రీడలపై స్ఫూర్తిని అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు అనిల్,ఎస్సై పవన్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

సింగరేణి పాఠశాలలో నూతన బస్సులను ప్రారంభించిన జిఎం…

సింగరేణి పాఠశాలలో నూతన బస్సులను ప్రారంభించిన జిఎం

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

శనివారం రోజున స్థానిక కృష్ణ కాలనీలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైనారు నూతనంగా పాఠశాలకు నియమింపబడిన 2 బస్సులను ప్రారంభించారు. జిఎం మాట్లాడుతూ ఈ స్కూలు బస్సులు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం, త్వరగా సేవలలోకి బస్సులలో తీసుకురావడం జరిగిందని, విద్యార్థులకు ఇది ఎంతో సౌకర్యవంతంగా, ఉపయోగకరంగా ఉంటుందని వారి విలువైన సమయమును కోల్పోకుండా ఈ బస్సుల ద్వారా త్వరగా పాఠశాలకు చేరుకోవచ్చునని, అలాగే విద్యార్థులు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా, సురక్షితంగా పాఠశాలకు ఈ బస్సుల ద్వారా చేరుకోవచ్చని విద్యార్థులకు తెలియజేశారు, అదేవిధంగా సింగరేణి పాఠశాల విద్యార్థులు పదవ తరగతిలో గత సంవత్సరం మంచి ర్యాంకులను కైవసం చేసుకున్నారని, నూటికి నూరు శాతం ఉత్తీర్ణులు అయ్యారని అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 10వ తరగతి విద్యార్థులు జిల్లా స్థాయి ర్యాంకులను తీసుకువచ్చి పాఠశాలకు సింగరేణి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆయన విద్యార్థులకు సూచించారు, ఈ కార్యక్రమంలో, ఏరియా పర్సనల్ మేనేజర్, (పాఠశాల కరస్పాండెంట్) కావూరి మారుతి, పాఠశాల ప్రిన్సిపల్, ఝాన్సీ రాణి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

జాతీయ క్రీడా దినోత్సవం…

జాతీయ క్రీడా దినోత్సవం…

క్రీడాకారులు ధ్యాన్ చంద్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి

మహబూబాబాద్ డి.ఎస్.పి తిరుపతిరావు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

శుక్రవారం కేసముద్రం మున్సిపాలిటీ స్థానిక జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల నుండి ఉప్పరపల్లి క్రాస్ రోడ్ వరకు కేసముద్రం మండల సీనియర్ హాకీ మరియు బాస్కెట్బాల్ క్రీడాకారులు మరియు హై స్కూల్ విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో మేజర్ ధ్యాన్ చంద్ జన్మదిన పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవం వన్ కె రన్ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ కొమ్ము రాజేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహబూబాద్ డిఎస్పి తిరుపతిరావు మరియు కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి హాజరై జెండా ఊపి రన్ ప్రారంభించారు.
అనంతరం క్రీడాకారులతో ఉత్సాహంగా రన్ లో ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు పరిగెత్తారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథి మహబూబాద్ డిఎస్పి తిరుపతిరావు మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఆగస్టు 29/ 2012 నుండి ఈ క్రీడా దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తున్నారని క్రీడాకారులు ధ్యాన్ చంద్ స్ఫూర్తిగా తీసుకొని దేశానికి మంచి పేరు తేవాలన్నారు.
గంట సంజీవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు మరియు క్రీడాకారులకు పెద్దపీట వేస్తున్నారని రాష్ట్రంలో ముఖ్యమంత్రి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, క్రీడ పాఠశాలలను ఏర్పాటు, అచ్యునుత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు నగదు పురస్కారాలతో సత్కరిస్తున్నారని తెలిపారు.కాబట్టి క్రీడాకారులు గ్రామీణ స్థాయి నుంచి పట్టుదలతో ఆడి ఉన్న శిఖరాలు చేరుకొని మన గ్రామానికి రాష్ట్రానికి దేశానికి పేరు తేవాలని ఆకాంక్షించారు.
అనంతరం వేం ట్రస్టు ద్వారా జాతీయస్థాయిలో రాణించిన కేసముద్రం చెందిన 10 మంది క్రీడాకారులకు హాకీ మరియు బాస్కెట్బాల్ క్రీడాకారులకు సన్మానం చేయడం జరిగింది, దానితోపాటు 25 వేల విలువైన క్రీడా సామాగ్రి బాస్కెట్బాల్స్ హాకీ స్టిక్స్ బ్యాడ్మింటన్ రాకెట్స్ వాలీబాల్స్ టెన్నికోల్ రింగ్స్ మొదలగునవి వేం ట్రస్ట్ ద్వారా పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిఐ సర్వయ్య, ఎస్సై మురళీధర్ రాజ్, స్థానిక నాయకులు రావుల మురళి,అల్లం నాగేశ్వరరావు, బండారు వెంకన్న, బండారు దయాకర్,సతీష్, కదిర సురేందర్, స్థానిక హెచ్ఎం బి రాజు, ఎంఈఓ కాలేరు యాదగిరి, పాలిటెక్నిక్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ నరసయ్య, ఫిజికల్ డైరెక్టర్ కొప్పుల శంకర్, దామల్ల విజయ్ చందర్ తో పాటు మండల క్రీడాకారులు మరియు ప్రజా ప్రతినిధులు దాదాపు 200 మంది పాల్గొన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా తెలుగుభాష దినోత్సవం…

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా తెలుగుభాష దినోత్సవం

గిడుగు రామ్మూర్తి భాషసేవలు మరువలేనివి

కళాశాల ప్రిన్సిపాల్ బేతి.సంతోష్ కుమార్

పరకాల నేటిధాత్రి

 

ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరకాలలో గిడుగు.రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని తెలుగు విభాగం ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు.అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్.బేతి సంతోష్ కుమార్ గిడుగు వేంకట రామ్మార్తి చిత్రపటానికి పూల వేసి ఘన నివాళి అర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రామ్మూర్తి పంతులు తెలుగు వ్యావహారిక భాషా కోసం చేసిన సేవలు మరువలేనివని అలాగే సవర భాషను నేర్చుకుని ఆ భాషకు వ్యాకరణం కనిపెట్టి సవరలకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేసిన గిడుగు పిడుగులాంటివారని కొనియాడారు.తెలుగు విభాగాధిపతి అశోక్ మోరె మాట్లాడుతూ తెలుగు అజంత భాష అని అనగా అచ్చులతో అంతమయ్చే భాష కాబట్టి సంగీతానికి అనువుగా ఉంటుందని తెలుగుభాషకు, ఇటరీ భీషకు దగ్గరి సంబంధం ఉండే పరిక తెలుగును ” ఈ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్” అ అంటారని అన్నారు.తెలుగు అధ్యాపకులు రణ ఈశ్వరయ్య ప్రసంగిస్తూ మాతృభాషలో విద్యాబోధన ద్వారా విద్యార్థుల మానసిక వికాసం జరిగి సృజనాత్మకత పెంపొందుతుందని,పరభాషలు నేర్చుకున్నప్పటికీ మాతృభాషను మరువకూడదన్నారు.ఈ కార్యక్రమంలో ఐక్యూఏసి కో ఆర్డినేటర్ డాక్టర్.రామక్రిష్ణ ఆద్యాపకులు డా.ఆడెపు రమేష్,బి.మహేందకరావు, డా.ఎ.శ్రీనావార్రెడ్డి,డా.ఎలిశాల అశోక్,డా.భీంరావు,డా.కె. జగదీష్ బాబు,యం సమ్మయ్య,డా.టి.కాల్పన,డా.జి.పావని,రాజశ్రీ,డా.జి.స్వప్న, డాక్టర్.సంజయ్,సతీష్,సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం…

ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

జైపూర్,నేటి ధాత్రి:

 

జైపూర్ మండలంలోని ఇందారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా హాకీ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించారు.అలాగే మండల విద్యాధికారి బి.శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై మేజర్ ధ్యాన్ చంద్ జీవితాన్ని విద్యార్థులకు పరిచయం చేసారు.మన జాతీయ క్రీడైన హాకీ లో ఆయన అత్యున్నత స్థాయి క్రీడాకారుడుగా ఎదిగిన తీరును వివరించారు.క్రీడలు మానసిక,శారీరక ఉల్లాసం తో పాటు ఐక్యతను చాటుతాయని వివరించారు. విద్యార్థులు చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు. పాఠశాల స్థాయి నుంచి నచ్చిన క్రీడలో మెలుకువలు నేర్చుకోవాలని విద్యార్థులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో పి.డి. ఎన్.పద్మ, ఉపాధ్యాయులు కె.రమాదేవి, కె.రమేష్ బాబు,ఏం. విజయలక్ష్మి,ఎం.సత్తిరెడ్డి,డి. సహదేవ్,జి.సంధ్యారాణి,పి. మంజుల,గోపగాని రవీందర్, కె.కనకయ్య,శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

బాలాజీ టెక్నో స్కూల్లో మాతృభాష దినోత్సవం…

బాలాజీ టెక్నో స్కూల్లో మాతృభాష దినోత్సవం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట మండలం లక్నపల్లిలోని బాలాజీ టెక్నో స్కూల్ లో గిడుగు వేంకట రామమూర్తి పంతులు జన్మదినాన్ని పురస్కరించుకొని మాతృభాష దినోత్సవం జరుపుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులకు తెలుగు భాష మాధుర్యాన్ని తెలిపేందుకు వీలుగా పద్య రచన,కావ్యరచన పోటీలను నిర్వహించారు.పాఠశాల ప్రిన్సిపాల్ పి .రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రదేశంలో వ్యవహారిక భాషో ద్యమానికి మూలపురుషుడైన గిడుగు వెంకట రామమూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు, బహుభాషావేత్త, చరిత్రకారుడు ,సంఘసంస్కర్త అయిన గిడుగు వెంకట రామమూర్తి పంతులు 1863 ఆగస్టు 29 శ్రీకాకుళం జిల్లాలో పర్వతాలపేట గ్రామంలో జన్మించారన్నారు.తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్ని,వీలును తెలియజెప్పిన మహనీయుడని ,అచ్చ తెలుగు చిచ్చర పిడుగు గిడుగు అని, పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి సృజనాత్మక శక్తి ఉన్న ప్రతి ఒక్కరికి వీలైందని తెలిపారు.ఈ కార్యక్రమంలో రియాజుద్దీన్,రమేష్ , రవీందర్ ,గణేష్, భాగ్యలక్ష్మి, నరేష్ ,విశాల, రంజిత్, విజయరాణి, రవీందర్ రెడ్డి, భవాని చంద్ ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

 

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం…

గొప్ప ఫీల్డ్ ఆటగాడు, దిగ్గజ మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎన్.సి. సి థర్డ్ ఆఫీసర్ ఎం.డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో బాలాజీ టెక్నో స్కూల్ లో జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ పి. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఆగస్టు 29 ని భారతదేశం జాతీయ క్రీడా దినోత్సవం గా జరుపుకుంటామని పేర్కొన్నారు.ఈ సంవత్సరం క్రీడా వేడుకలకు ఫిట్ ఇండియా మిషన్ నాయకత్వం వహిస్తుందని, ప్రతి సంవత్సరం “ఖేల్ కే మైదాన్ మై” అనే థీమ్ తో దేశవ్యాప్తంగా క్రీడలను నిర్వహిస్తారని తెలిపారు.మేజర్ ధ్యాన్ చంద్ 1929 నుండి 1936 వరకు ఒలంపిక్స్ లో భారతదేశ ఆధిపత్యం చెలాయించేలా కృషి చేశాడని వీరి నాయకత్వంలో భారత్ 1948లో హాకీ క్రీడలో స్వర్ణం సాధించిందని తెలిపారు.అనంతరం విద్యార్థులకు, ఎన్.సి.సి క్యాడేట్లకు క్రీడా పోటీలను నిర్వహించారు పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు భవాని చంద్ ,రవీందర్ రెడ్డి, పార్వతి ,వినోద్ ,గోపి, సతీష్, అరుంధతి, రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.

అక్షర ద స్కూల్,బిట్స్ లో జాతీయ క్రీడా దినోత్సవం..

నర్సంపేట పట్టణంలోని బాలాజీ విద్యా సంస్థలలో ఒక్కటైనా అక్షర ద స్కూల్,బిట్స్ స్కూల్ లో లో జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిదులుగా బాలాజీ విద్యాసంస్థలు చైర్మన్ డాక్టర్ ఆండ్ర రాజేంద్రప్రసాద్ రెడ్డి హాజరైయ్యారు.హాకీ క్రీడ దిగ్గజం ధ్యాన్ చంద్ జయంతి సందర్బంగా క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నామని పేర్కొన్నారు.ఒలంపిక్ క్రీడలలో మూడు బంగారు పథకాలు తెచ్చిన అందించిన గొప్ప క్రీడాకారుడు ధ్యాన్ చంద్ అని తెలిపారు.చదువులతో పాటు అన్ని రకాల క్రీడల్లో రాణించాలని విద్యార్థులకు సూచించారు.కోశాదికారి డాక్టర్ వనజ, ఈ కార్యక్రమంలో బిట్స్ స్కూల్ ప్రిన్సిపల్ జ్యోతి గౌడ్,అక్షర ద స్కూల్ ప్రిన్సిపల్ భవాణి,ఉపాద్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

రోడ్డు మరమ్మత్తులు చేపట్టిన బిజెపి నాయకులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T150239.383.wav?_=8

 

రోడ్డు మరమ్మత్తులు చేపట్టిన బిజెపి నాయకులు

బీజేపీ మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల లో ఊర నవీన్ రావు అధ్యక్షుడి ఆధ్వర్యంలో రోడ్డు పైనా గుంతలు పుడ్చడం కార్యక్రమం
బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షం కు ఓసి-3బాధిత గ్రామాలు నగరంపల్లి గ్రామం లోని ముసళ్ల కుంట గండి పడి నగరంపల్లి అప్పయ్యపల్లి గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బంది కలిగి సీతారాంపూర్, బంగ్లాపల్లి, అప్పయ్య పల్లి నుండీ మండల కేంద్రం లోని పాఠశాలల కు వెళ్లే విద్యార్థులు మరియు వ్యవసాయా పనులకు వెళ్లే రైతులు ఇబ్బందులకు గురి అవుతున్న కారణం గా బీజేపీ కార్యకర్తలు స్వచ్చ భారత్ కార్యక్రమం లో భాగంగా రోడ్డు పై ఏర్పడ్డ గుంతలను పుడ్చారు అనంతరం నవీన్ రావు మాట్లాడుతు సింగరేణి యాజమాన్యం యుద్ధ ప్రతిపదికన రోడ్డు మరమ్మత్తు చర్యలు చేపట్టి ఆయా గ్రామాల మధ్య రాకపోకలు ఇబ్బంది లేకుండా చూడాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమం లో బూత్ అధ్యక్షులు భూక్యా హరిలాల్, ఇనుగాలా మొగిలి నాయకులుమామిడిపల్లి మల్లన్న, మైదాం శంకర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు

రామాయంపేట జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-91.wav?_=9

రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీ సందడి..

రామాయంపేట ఆగస్టు 25 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు. కొత్తగా కళాశాలలో చేరిన విద్యార్థులను స్వాగతించేందుకు సీనియర్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ఉత్సాహభరిత వాతావరణంగా మారింది.
కార్యక్రమానికి ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ మల్లేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నృత్యాలు, పాటలు, నాటికలు, వినోదాత్మక ప్రదర్శనలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ఫ్రెషర్స్ విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు.

Freshers Party at Ramayampet Junior College.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మల్లేశం మాట్లాడుతూ –
“కళాశాలలో అడుగు పెట్టిన ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని, విద్యతో పాటు సామాజిక సేవా భావనను పెంపొందించుకోవాలని” సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలిచి ఎల్లప్పుడూ సహకారం అందిస్తారని తెలిపారు.
కార్యక్రమంలో అధ్యాపకులు మాట్లాడుతూ, ఫ్రెషర్స్ పార్టీ విద్యార్థుల మధ్య ఆత్మీయత పెంపొందించేందుకు, ప్రతిభ ప్రదర్శనకు వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు కళాశాలలో ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్లు ఫ్రెషర్స్ విద్యార్థులకు పుస్తకాలు బహుమతులుగా అందజేశారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు ఆనందంగా నృత్యాలు చేస్తూ ఉత్సాహాన్ని పంచుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T154921.524.wav?_=10

 

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

జిల్లా కన్వీనర్ గుజ్జల ప్రేమ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏబీవీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ గుజ్జల ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు తో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తుంది పేద విద్యార్థులకు ఎంతో వరంగా ఉండే ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారు ప్రైవేటు ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు రావలసిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థుల నుంచి బస్సులు చేస్తూ కళాశాల కేంద్రాలు వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు డిగ్రీ పూర్తి తర్వాత పై చదువులకు వెళ్లాలంటే వారి యొక్క సర్టిఫికెట్స్ ఎంత అవసరం ఉంటాయి అలాంటి వాటిని కళాశాలలు ఇవ్వకుండా విద్యార్థులకు ఇబ్బందుల గురి చేస్తున్నాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో విద్యార్థులు గుర్తుకొస్తారు కానీ గద్దెనింకినంక విద్యార్థులకు ఎందుకు గుర్తురారని డిమాండ్ చేశారు ప్రభుత్వము ఇకనైనా విద్య రంగ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రంలో గురుకులాలలో ఫుడ్ పాయిజన్లు అవుతున్న పట్టించుకోకుండా ఈ ముఖ్యమంత్రి రోజులు గడుపుతున్నాడు హాస్టళ్లకు పక్కా భవనాలు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు రాష్ట్రంలో పాఠశాలల నుంచి కళాశాలల వరకు ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కన్వీనర్ గుజ్జల ప్రేమ్ కుమార్,సాయి,విఘ్నేష్,ప్రదీప్,చారి,వైష్ణవి,మానస, తదితరులు పాల్గొన్నారు.

భుత్వ ఉన్నత పాఠశాలలో వనమహోత్సవం.

భుత్వ ఉన్నత పాఠశాలలో వనమహోత్సవం.

చిట్యాల, నేటిధాత్రి :

 

జడ్పీహెచ్ఎస్ చిట్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంఈవో కోడెపాక రఘుపతి మరియు శ్రీరామ్ రఘుపతి ఆధ్వర్యంలో ఘనంగా వనమహోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంఈవో రఘుపతి మాట్లాడుతూ విద్యార్థినీ, విద్యార్థులు విధిగా పాఠశాలలో, గృహాలు, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని తద్వారా ముందు తరాలను కాపాడుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బొమ్మ రాజమౌళి, నీలిమా రెడ్డి , కల్పన,విజయలక్ష్మి, ఉస్మాన్ అలీ, సాంబారు రామనారాయణ, సుజాత, శ్రీనివాస్, శంకర్, ఫిజికల్ డైరెక్టర్ సూధం సాంబమూర్తి, మౌనిక, బుజ్జమ్మ, మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

థౌసండ్ పిల్లర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో టై బెల్ట్స్ పంపిణి.

థౌసండ్ పిల్లర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో టై బెల్ట్స్ పంపిణి.

నర్సంపేట,నేటిధాత్రి:

 

దుగ్గొండి మండలంలోని నాచినపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు థౌసండ్ పిల్లర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో టై,బెల్ట్స్,గుర్తింపు కార్డులను ఎన్నారై శానబోయిన రాజ్ కుమార్ సౌజన్యంతో అందిజేశారు
ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం గంగాధర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 1000 పిల్లర్స్ లైన్ క్లబ్ అధ్యక్షులు పరికిపండ్ల వేణు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవడానికి గ్రామస్తులు ముందుకు రావాలన్నారు. రాబోయే రోజులలో ప్రభుత్వ విద్యాలయాలలో చదువుకున్న వారికే ఉన్నత విద్యాభ్యాసం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. నిబద్ధత గల ఉపాధ్యాయులు చక్కని విద్యా బోధన చేస్తున్నారని అభినందించారు. గ్రామీణ ప్రాంతాలలో అత్యంత నిరుపేద విద్యార్థులు పాఠశాలల్లో చదువుకోవడానికి వస్తారని వారికి సహాయ సహకారాలు అందించడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. పాఠశాల అభివృద్ధి కోసం తాము కృషి చేస్తామని రాజ్ కుమార్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రతినిధులు రాజగోపాల్, జోనల్ చైర్మన్ చొప్పరి సోమయ్య, మాజీ సర్పంచ్ పెండ్యాల మమతా రాజు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఓరుగంటి కవిత తిరుపతి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతిలక్ష్మి, ఉపాధ్యాయురాలు వీణ జ్యోతి, పెండ్యాల రాము మడతలపాటి కుమార్, రుదీర్, జటబోయిన రాజు, గుండెబోయిన కాజీ యాదవ్, పుట్టపాక భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

బాలాజీ టెక్నోస్కూల్ లో జాతీయ అంతరిక్ష దినోత్సవం…

బాలాజీ టెక్నోస్కూల్ లో జాతీయ అంతరిక్ష దినోత్సవం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట మండలం లక్నేపల్లిలోని బాలాజీ టెక్నో స్కూల్ లో 2.వ జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకున్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పి. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ చంద్రయాన్- 3 పూర్తయ్యి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా దేశం తన రెండవ జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు.
ఆర్యభట్ట నుండి గగన్ యాన్ వరకు ప్రాచీన జ్ఞానం నుండి అనంత అవకాశాల వరకు అనే ఇతివృత్తంతో జరుపుకునే అంతరిక్ష రంగంలో భారత్ తిరుగులేని విజయాలతో అమెరికా, చైనా, రష్యా, జపాన్ వంటి దేశాలకు సాధ్యంకాని విధంగా అనేక విజయాలను నమోదు చేసిందన్నారు.చంద్రయాన్ 1,2,3 ప్రయోగాలే కాకుండా చంద్రయాన్ – 4 ప్రయోగానికి సన్నద్ధం అవుతుందని, 2035 నాటికి సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని పట్టుదలతో ఉందని గుర్తుకుచేశారు. భారత్ చంద్రునిపై 2023 ఆగస్టు 23 న చంద్రుని దక్షిణ ధ్రువప్రాంతాన్ని చేరుకున్న మొదటి దేశంగా అవతరించిందని తెలిపారు.విద్యార్థులు, యువత సైన్సును కేవలం ఒక కెరీర్ గా చూడకుండా ఉండాలని, అంతరిక్ష పరిశోధన,సాంకేతికలు,దేశ నాయకత్వం పట్ల జాతీయ గౌరవాన్ని ప్రేరేపించి హద్దులు లేని ప్రయాణాన్ని చూడాలని విద్యార్థులను సూచించారు.ఎన్సిసి పదవ బెటాలియన్ సూచనల మేరకు సోషల్ సర్వీస్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ లో భాగంగా థర్డ్ ఆఫీసర్ ఎం.డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో కూడా జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించగా విద్యార్థులు అంతరిక్షం సంబంధించిన చార్టులు ప్రదర్శించి క్విజ్ పోటీలలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె. రమేష్, విజయ్, గౌతమ్, పూర్ణిమ, రాజ్ కుమార్, రమ్య, కృష్ణవేణి, హేమలత, నరసింహారెడ్డి, అనిత, విశాల,తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T141729.361.wav?_=11

విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించి మన జిల్లాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తేవాలని శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
శనివారం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆచార్య జయశంకర్ సార్ విగ్రహం నుండి అంబేడ్కర్ స్టేడియం వరకు ఏర్పాటు చేసిన క్రీడా దినోత్సవ రన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో పాటు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే పాల్గొని క్రీడా జ్యోతిని వెలిగించి జెండా ఊపి క్రీడా రన్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ క్రీడా యూనివర్సిటీతో పాటు జిల్లా కేంద్రాలలో క్రీడామైదానాలను ఏర్పాటు చేస్తూ క్రీడలకు ప్రాధాన్యత నిస్తుందని అన్నారు.
ఎంప్రభుత్వం విద్యాతో పాటు సమాంతరంగా క్రీడలకు అత్యున్త ప్రాధాన్యత కల్పిస్తూ క్రీడా యూనివర్సిటీ ఏర్పాటు చేసిందని తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించాలని ఉద్దేశ్యంతో అన్ని జిల్లా కేంద్రాలలో క్రీడా మైదానాల ఏర్పాటు మొదలు పెట్టడం జరిగిందని యువత మత్తు పదార్థాలకు ఇతర వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడల్లో పాల్గొని ప్రతిభ కనబరచాలని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎస్పి కిరణ్ ఖరే, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయ లక్ష్మీ, జిల్లా క్రీడల శాఖ అధికారి రఘు, అధికారులు, అనధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version