జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్ ఎన్‌పీఆర్‌డీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్ ఎన్‌పీఆర్‌డీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన 2026 క్యాలెండర్‌ను సైదా నాయక్ డీఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివ్యాంగులు అన్ని రంగాలలో రాణించాలని అభిప్రాయపడ్డారు. దివ్యాంగులపై చట్టవిరుద్ధంగా దాడి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. వారి ఆస్తిపై దాడి జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను దివ్యాంగులు వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ప్రధాన కార్యదర్శి కొనింటి నరసింలు, సీనియర్ నాయకుడు ఐమద్ అన్నా, మొగుడంపల్లి మండలం ఎన్‌పిఆర్‌డి అధ్యక్షుడు రాజ్‌కుమార్, జహీరాబాద్ ఎన్‌పిఆర్‌డి అధ్యక్షుడు ముహమ్మద్ వాజిద్, ఉపాధ్యక్షుడు మాచెందర్ తదితరులు పాల్గొన్నారు.

గణపురంలో వలస కుటుంబానికి 50 కేజీలు బియ్యం పంపిణీ

వలస బాధితులకు 50 కేజీలు బియ్యం అందజేత

పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మారపల్లి ప్రభాకర్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో దివి ప్రసాద్ నాయుడు బ్రిక్స్ ప్లాంట్ లో ఇటుక బట్టీలకు పనిచేయడానికి చతిస్గడ్ వలస వచ్చిన కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసిన మారేపల్లి ప్రభాకర్ రత్నబాబు వీరికి ఆ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు

వసతి గృహం విద్యార్థులకు ట్యూబ్ లైట్స్ అందజేత…

వసతి గృహం విద్యార్థులకు ట్యూబ్ లైట్స్ అందజేత

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

బెల్లంపల్లి లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకస్మికంగా పర్యటించగా అక్కడ ఉన్న వసతి గృహంలో సరైన వెలుతురు లేక చీకటి అలుముకున్న దృశ్యాలను చూసి వారు చలించి పోయారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులను కలసి వసతి గృహంలో సరైన వెలుతురు,కాంతి ఎందుకు లేవని అడిగారు.దానికి ప్రధాన ఉపాధ్యాయులు గతంలో ట్యూబ్ లైట్స్ ఏర్పాటు చేయగా ఇప్పుడు అవి పూర్తిగా చెడిపోయాయి అని అన్నారు.ప్రభుత్వం నుండి ఎలాంటి నిధులు అందకపోవడంతో అభివృద్ధిలో లోటు ఏర్పడిందని తెలిపారు.7వ తరగతి చదువుతున్న బి.అశ్విత్ తండ్రి మల్లేష్ మంచి మనసుతో వెంటనే స్పందించి పాఠశాల విద్యార్థుల అభివృద్ధికై తమ వంతు సహాయముగా 30 ఎల్ఈడి ట్యూబ్ లైట్స్ కొనుగోలు చేసి పాఠశాలకు అందజేశారు.పేరెంట్స్ కమిటీ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు,విద్యార్థులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్ సాగర్,పేరెంట్స్,విద్య కమిటీ చైర్మన్ రాజేశ్వర్,ఉపాధ్యాయులు కొండలరావు,గోపి పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version