ఐనవోలులో యూరియా దందాపై నేటిధాత్రి కథనానికి స్పందన
రైతుల ఫిర్యాదులపై స్పందించిన వ్యవసాయ అధికారులు
లింక్ సేల్స్ పేరుతో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవు
నేటి ధాత్రి – ఐనవోలు:
ఐనవోలు మండలంలో యూరియా దందా విచ్చలవిడిగా కొనసాగుతుండటంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా కృత్రిమ కొరత సృష్టించి డీలర్లు లింక్ సేల్స్ పేరుతో మరో వస్తువులు బలవంతంగా కొనిపిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ విషయంలో నేటి ధాత్రి పత్రిక వార్త కథనాల రూపంలో వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. నేటిధాత్రి కథనాన్ని పరిగణలోకి తీసుకున్న వ్యవసాయ శాఖ అధికారులు స్పందించారు.
మండలంలోని వ్యాపారస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించిన అధికారులు రైతులపై లింక్ సేల్స్ రుద్దడం చట్టవిరుద్ధం. యూరియాకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం అందిస్తున్న నానో లిక్విడ్ యూరియా లేదా నానో లిక్విడ్ సంబంధించిన ఎరువులు రైతులు కావాలంటే ఇవ్వాలి గాని, ఎవరైనా బలవంతంగా లింక్ సేల్స్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.
తదుపరి వారు రైతులను ఉద్దేశించి యూరియా కోసం ఎవరైనా అనవసర వేధింపులు చేస్తే, లింక్ సేల్స్ పేరుతో ఇబ్బంది పెడితే వెంటనే మా దృష్టికి తీసుకురావాలి. మేము వెంటనే చర్యలు తీసుకుంటాం” అని కోరారు.
ఐతే రైతులు మాత్రం అధికారులు కౌన్సిలింగ్‌నే కాక, కఠిన తనిఖీలు నిర్వహించి దందాకు చెక్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
