చైనా మాంజా నిషేధం: కఠిన చర్యలు

చైనా మాంజా వినియోగం నిషిద్ధం – వాడినా, అమ్మినా కఠిన చర్యలు..

◆-: • సుఖసంతోషాల నడుమ పండగను జరుపుకోవాలి..

◆-: • ఒకరి ఆనందం, మరికరికి విషాదం కాకూడదు.: ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల కేంద్రంలో ఆయా గ్రామాల
ప్రజల ప్రాణ రక్షణను దృష్టిలో ఉంచుకుని, ప్రమాదాలకు కారణమవుతున్న చైనా మాంజా (నైలాన్ దారాలు) వినియోగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించిందని ఝరాసంగం ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ తెలియజేశారు. మండల వ్యాప్తంగా చైనా మాంజా అమ్మకాలపై దాడులు నిర్వహించి, నిషేధిత చైనా మాంజాను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. చైనా మాంజా కారణంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, పక్షులు తీవ్రంగా గాయపడటంతో పాటు ప్రాణ నష్టం సంభవించిన ఘటనలు చోటుచేసుకున్నాయని ఎస్ఐ పేర్కొన్నారు.నిబంధనలను ఉల్లంఘించి చైనా మాంజాను వాడినా లేదా అమ్మినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.మండల ప్రజలు ఈ విషయాన్ని గమనించి, తమ పిల్లలను చైనా మాంజా వినియోగానికి దూరంగా ఉండేలా ఉంచాలని సూచించారు. నిబంధనలు పాటిస్తూ, చైనా మాంజా వల్ల కలిగే ప్రమాదాల నుండి ప్రాణ భద్రతకు సహకరించాలని సూచించారు.
మండలంలోని ఎక్కడైనా నిషేధిత చైనా మాంజా వినియోగించినట్లు సమాచారం ఉన్నట్లయితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version