నూతన బాధ్యతలు చేపట్టిన శ్రీరాంపూర్ సీఐ శ్రీలత
నేర నిరోధక చర్యలపై ప్రత్యేక దృష్టి
శ్రీరాంపూర్,మంచిర్యాల నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా
శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ నూతన సీఐ గా పి.శ్రీలత శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.గతంలో పనిచేసిన సీఐ డి.వేణు చందర్ సస్పెన్షన్ నేపథ్యంలో కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఐ శ్రీలత మాట్లాడుతూ..స్థానిక సమస్యల పరిష్కారం,నేర నిరోధక చర్యలు,మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
