రైతులకు సరిపడాయూరియా పంపిణీ చేయాలి..

రైతులకు సరిపడాయూరియా పంపిణీ చేయాలి

కేంద్ర ప్రభుత్వం రైతులకు,యూరియా పంపిణీ తగ్గించడం దుర్మార్గమైన చర్య

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు మానుకొని రైతులకు న్యాయం చేయాలి
ప్రైవేట్ ఫెర్టిలైజర్ షాపుల దోపిడి అరికట్టాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి ముషo రమేష్

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

ఈరోజు జిల్లా కేంద్రంలోని అమృత లాల్ శుక్ల కార్మిక భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని రైతులకు వానకాలానికి సరిపోవు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు అలాగే జిల్లాలోని సహకార సంఘ గోదాముల వద్ద తెల్లవారుజాము నుండే బార్లు తీరుతున్న రైతుల బాధలు పట్టించుకునే నాధుడే లేడని అన్నారు ఇంత జరుగుతున్నా జిల్లా వ్యవసాయ అధికారులు మాత్రం జిల్లాలో యూరియా కొరతలేదని రైతులు ఆందోళన చెందవద్దని ప్రకటనలు చేస్తున్నారని అన్నారు అలాగే ప్రైవేటు వ్యాపారులు కూడా ఇదే అదునుగా భావించి ఒక యూరియా బస్తా 310 రూపాయల నుండి 350 వరకు అమ్ముతూ యూరియాతోపాటు మిగతా పెటిలైజర్ కొంటేనే యూరియా ఇస్తామని అవసరం లేకున్నా దంటు గోళీలు గడ్డి మందు తదితర ఫెర్టిలైజర్ అంట కడుతున్నారని వారిపై వ్యవసాయ శాఖ ఎందుకు చర్య తీసుకోవడం లేదని ఆయన అన్నారు గతంలో ప్రతి సహకార సంఘ గోదాముల్లో నిల్వ ఉండే యూరియా బస్తాలు నేడు కనిపించడం లేదని యూరియా బస్తాలు కేటాయింపుల్లో కూడా పెద్ద రైతులు భూస్వాములు లైన్లో ఎక్కడ కనిపించడం లేదని ఎక్కడ చూసినా సన్నకారు చిన్న కారు రైతులే ఇబ్బందులు పడుతున్నారని మరి వారికి యూరియా ఎలా అందుతుందో అర్థం కావడం లేదని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి సీజనకు సరిపడా యూరియా సప్లై చేయాలని లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున రైతులతో ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోడం రమణ,జవ్వాజి విమల పాల్గొన్నారు

100 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో అపెరల్ పార్కులో అందుబాటులోకి.

 

100 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో అపెరల్ పార్కులో అందుబాటులోకి.

జిల్లాలో రైతులకు సరిపడా ఎరువులు

ప్రారంభించిన కలెక్టర్, సిరిసిల్ల ఏ.ఎం.సీ చైర్ పర్సన్, డీఏఓ

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

సిరిసిల్ల జిల్లాలో అత్యవసర సమయంలో వినియోగించేందుకు ఎరువుల గోదాంను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్కులో 100 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఎరువుల గోదాంను ఏర్పాటు చేయగా, శుక్రవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగంతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. జిల్లాలో ఎప్పుడైనా.. ఎక్కడైనా అత్యవసర పరిస్థితిలో ఎరువులు కొరత ఏర్పడినప్పుడు అందజేసేందుకు ముందస్తుగా ఎరువుల గోదాం ఏర్పాటు చేసినట్లు వివరించారు. 100 మెట్రిక్ టన్నుల ఎరువులు బఫర్ లో అందుబాటులో పెడతామని తెలిపారు.
అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం మాట్లాడారు. జిల్లాకు అవసరమైన ఎరువులు గతంలో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల నుంచి మాత్రమే జిల్లాకు తెప్పిస్తున్నామని తెలిపారు. అత్యవసర సమయంలో ఎరువులు కావాల్సివస్తే ఇబ్బందులు ఎదురయ్యేవని గుర్తు చేశారు. ఈ ఇబ్బందులు అన్ని దూరం చేసేందుకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేక చొరవతో అపెరల్ పార్కులో 100 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఎరువుల గోదాంను ఏర్పాటు చేయించారని వెల్లడించారు. జిల్లాలో ఎరువులకు కొరత లేదని రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుంది..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-8-1.wav?_=1

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుంది

బిఆర్ఎస్ సేన రాష్ట్ర అధ్యక్షులు
వెంగని మనోహర్

సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రం లోని ప్రెస్ క్లబ్ లో బిఆర్ఎస్ సేన రాష్ట్ర అధ్యక్షులు వెంగని మనోహర్ మాట్లాడతూ.. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి పాదయాత్రలో కులగణన 42 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసినదే, కానీ నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుల గణన అనే పేరుతో బీసీ బిడ్డలను మోసం చేస్తూ గద్దెన ఎక్కి కూర్చొని నేడు బీసీలకు విద్యా, వైద్యం, ఉపాధి కల్పనలో వెనుక అడుగు వేసేలా చూస్తుందని అంతేకాకుండా ఏదో ఒక బీసీ కుల గణన అని రాష్ట్రవ్యాప్తంగా చిన్న సర్వే చేపట్టి, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరియు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రెండు ఒక్కటై బీసీలను మోసం చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో శీలం స్వామి, నందగిరి భాస్కర్ గౌడ్,
మెరుగు తిరుపతి, నెమలికొండ భాస్కర్, కురుమని ప్రశాంత్, బొట్టుకు అజయ్,పీట్ల విన్న బాబు, అమర కొండ కృష్ణ, తదితర బిఆర్ఎస్ నాయకులు, పలు కార్యకర్తలు పాల్గొన్నారు.

గీతా జ్ఞాన యజ్ఞం సిరిసిల్ల గీతా ప్రచార సేవా సమితి కరపత్రం ఆవిష్కరణ

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2.wav?_=2

గీతా జ్ఞాన యజ్ఞం సిరిసిల్ల గీతా ప్రచార సేవా సమితి కరపత్రం ఆవిష్కరణ

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని గీత ఆశ్రమం లో గీత ప్రచార సేవా సమితి అధ్యక్షులు కోడం నారాయణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపాల శంకరయ్య కార్యనిర్వహణలో గీతా జ్ఞాన యజ్ఞం కరపత్రం ఆవిష్కరణ జరిగినది. ఆవిష్కరణకు ఆశ్రమ భక్తులు గీతా ప్రచార సేవా సమితి భక్తులు హాజరైనారు. భగవద్గీతలో రెండవ అధ్యాయం సాంఖ్యయోగం సాయంత్రం ప్రతిరోజు 6:30 నుండి 8 వరకు ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు భజన కార్యక్రమం 8 గంటల నుండి 9 వరకు శివ మహిమ స్తోత్రం ఉపనిషత్తు ప్రవచనాలు స్వామీజీ అక్షయ చైతన్య చెబుతారు సిరిసిల్ల వాసులు పరిసర ప్రాంత గ్రామ ప్రజలు ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రవచనాలను విని తరించాలని భగవద్గీత గొప్పదనాన్ని తెలుసుకొని సర్వేజనా సుఖినోభవంతు అనే నానుడిగా ముందుకు సాగాలని, ఇంత మంచి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మీ జీవితాన్ని ధన్యం చేసుకుంటారని ఆశిస్తున్నాము అని తెలిపారు.

Sircilla

ఈ కార్యక్రమంలో కొక్కుల రాజేశం, గజ్జల్లి రామచంద్రం, వేముల బక్కయ్య, జక్కని రమేష్, మెరుగు మల్లేశం మెరుగు లక్ష్మణ్ రుద్ర రాజేంద్రప్రసాద్, జి సత్యనారాయణ ,లకావత్ మోతిలాల్, మోర దామోదర్, గడ్డం కౌసల్య బూర్ల శారద సారంగం, మొదలైన వారు పాల్గొన్నారు

సిరిసిల్ల కవయిత్రికి జాతీయ పురస్కారం..

సిరిసిల్ల కవయిత్రికి జాతీయ పురస్కారం

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-59.wav?_=3

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రముఖ ఉపాధ్యాయురాలు,కవయిత్రి శ్రీమతి తాళ్లపల్లి (మోతుకుల) భాగ్యలక్ష్మి,శ్రీ గౌతమేశ్వర సాహితీ కళా సేవా సంస్థ,శ్రీ ఆర్యాణి సకల కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో కరీంనగర్ ఫిలింభవన్ లో జాతీయస్థాయి 2025 భారత్ విభూషణ్ అవార్డుల ప్రదానోత్సవం లో పురస్కారం అందించడం జరిగినది. మరియ తల్లీ నీకు వందనం కవితాసంకలనం ఆవిష్కరణ మహోత్సవంలో అద్భుతమైన కానుక అమ్మ కవిత ముద్రణకు ఎంపికైన సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గౌతమేశ్వర సేవా సంస్థ మరియు ఆర్యాణి కళా సంస్థల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ దూడపాక శ్రీధర్, డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్, ప్రతిమ హాస్పిటల్ డెర్మటాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ గీతారెడ్డి , డాక్టర్ మోత్కుల నారాయణ గౌడ్, ప్రముఖ సాహితీవేత్తలు, సాహితీ అభిమానులు పాల్గొన్నారు.

కిష్టంపేట గ్రామాన్ని సందర్శించిన రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ ఎస్పీ.

కిష్టంపేట గ్రామాన్ని సందర్శించిన రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ ఎస్పీ…

చందుర్తి నేటిధాత్రి:

ఈరోజు చందుర్తి మండలం కిష్టంపేట గ్రామాన్ని అడిషనల్ ఎస్పి చంద్రయ్య సందర్శించారు. ఇటీవల గ్రామంలో తేలుకాటుకు గురై సరియైన వైద్యం అందక మరణించిన చిన్నారి విషయంలో, ఆర్ఎంపీ డాక్టర్ పై నమోదైన కేసులో మృతురాలి ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యులను మరియు ఇతర సాక్షులను విచారించడం జరిగింది. ఇందులో భాగంగా ఎస్సీ కాలనీ గ్రామస్తులతో మాట్లాడుతూ మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో వ్యవహరించాల్సిన తీరును మరియు మూఢనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలపై కాలనీ వాసులకి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరియు ఆపద సమయంలో ప్రజలు ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్కరు కూడా పోలీస్ సహాయం తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రమేష్ మరియు సిబ్బంది ఉన్నారు..

సిరిసిల్ల ఎమ్మార్వో ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా.

సిరిసిల్ల ఎమ్మార్వో ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

 

 

 

 

సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఇసుక మరియు ముడి సరుకుల ధరల్ని ప్రభుత్వం నియంత్రించాలి – అన్నల్ దాస్ గణేష్ సిపిఎం సిరిసిల్ల పట్టణ కార్యదర్శి.

సిపిఎం రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో ఇసుక కొరత తీర్చాలని ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగినది.

ఈ సందర్బంగా సిపిఎం సిరిసిల్ల పట్టణ కార్యదర్శి అన్నల్ దాస్ గణేష్ మాట్లాడుతూగత 15 రోజులుగా సిరిసిల్ల పట్టణంలో ఇందిరమ్మ ఇండ్లు మరియు ప్రైవేట్ ఇంటి నిర్మాణాలకు ఇసుక అనుమతులు లేకపోవడంతో ఇండ్ల నిర్మాణాలు ఆగిపోయాయి ప్రభుత్వ పనులకు ఇస్తున్న ఇసుక బ్లాక్లో నాలుగు వేల నుండి 5 వేలకు అమ్ముకుంటున్నారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఇందిరమ్మ ఇండ్లకు 10 ట్రాక్టర్ల ఇసుక మాత్రమే ఇస్తామని చెబుతున్నారు కానీ సిరిసిల్ల పట్టణంలో నల్ల రేగడి భూములు అయినందున పుటింగులకే పది ట్రిప్పుల ఉష్కే సరిపోని పరిస్థితి ప్రభుత్వం మరొక్కసారి ఆలోచించి ఇసుక ట్రిప్పుల సంఖ్య పెంచాలని అలాగే ప్రైవేట్ ఇంటి నిర్మాణాలకు కూడా ప్రతిరోజు ఇసుక అందించేలా చర్యలు తీసుకోవాలని దానివలన పట్టణంలోని పేద ప్రజల పైన అదనపు భారాన్ని తగ్గించినట్టు అవుతుంది ఇంటి నిర్మాణానికి సంబంధించి ఇతర ముడి సరుకుల ధరల్ని కూడా నియంత్రించాలి ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచెయ్యాలి మైనింగ్ అధికారులు దాడులను ఆపాలి పేదల ఇంటి నిర్మాణాలకు అలాగే ప్రయివేట్ ఇంటి నిర్మాణదారులకు ఇబ్బందులు లేకుండా అధికారులు తక్షణమే చెర్యలు తీసుకోవాలని సిపిఎంసిరిసిల్ల జిల్లా కమిటీగా తహసీల్దార్ వినతిపత్రం అందించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోడం రమణ, ఎగమాంటి ఎల్లారెడ్డి, జవ్వాజి విమల సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ, శ్రీరామ్ రమేష్ చంద్ర సిపిఎం సీనియర్ నాయకులు మిట్టపెల్లి రాజమల్లు, రాపెల్లి రమేష్, నక్క దేవదాస్, జిందాం కమలాకర్, బెజగం సురేష్, సిరిమల్లా సత్యం, కోలా శ్రీనివాస్, బింగి సంపత్ సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్ల పురపాలక సంఘం 100 రోజుల కార్యచరణ ప్రతిజ్ఞ.

సిరిసిల్ల పురపాలక సంఘం 100 రోజుల కార్యచరణ ప్రతిజ్ఞ

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ కేంద్రం లోని పురపాలక సంఘం సిరిసిల్ల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక ను ఈరోజు అమరవీరుల స్థూపం వద్ద ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో 100రోజుల కార్యాచరణ ప్రతిజ్ఞ ద్వారా ప్రారంభించుకోవడం జరిగింది.అదే విధంగా అమరవీరుల స్థూపం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.   

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జూన్ 2 నుంచి సెప్టెంబర్ 9 వరకు పట్టణం లోని పురపాలక సంఘం ద్వారా జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో పురోగతి సాధించుటకు ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.ఈ యొక్క 100రోజుల కార్యాచరణ లో శానిటేషన్, ఇంజనీరింగ్, రెవెన్యూ, పట్టణ ప్రణాళిక మరియు మెప్మా విభాగాలు ప్రణాళిక బద్ధంగా కార్యక్రమాలు ఉండడం వల్ల ప్రతి విభాగం అభివృద్ధిలో పాలు పంచుకోవడం జరుగుతుంది అని ప్రజలు కూడా మాకు సహకరించి సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పట్టణ ప్రజలకు తెలియజేయడం జరిగినది.

సిరిసిల్ల పోలీస్ అధికారులకు ఆత్మీయ వీడ్కోలు.

సిరిసిల్ల పోలీస్ అధికారులకు ఆత్మీయ వీడ్కోలు

సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)

 

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ అధికారులు పదవి విరమణ పొందిన SI మారుతి , హెడ్ కానిస్టేబుల్ రాజమౌళి కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు తెలియజేశారు.
42 సంవత్సరాల విధి నిర్వహణలో అందరి మన్ననలు అందుకొని ఈ రోజు పదవీ విరమణ పొందుతున్న వేములవాడ రూరల్ ఎస్.ఐ మారుతి మరియు కొనరావుపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తు హెడ్ కానిస్టేబుల్ రాజమౌళి శాలువా, పులమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐ.పీ.ఎస్.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.

సుదీర్ఘ కాలం పాటు పోలీస్ శాఖలో మీరు అందించిన సేవలు భవిష్యత్ తారాల వారికి స్ఫూర్తిదాయకమని,ప్రజలను పోలీసులు సక్రమంగా విధులను నిర్వర్తించడానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉంటుందని వారి తోడ్పాటు వల్లనే విధులను నిర్వర్తించి ఉన్నత స్థానాలకు ఎదగగలరని తెలియజేశారు.

SI Maruthi 

 

పదవీ విరమణ పొందిన తర్వాత వచ్చే ప్రయోజనాలను త్వరగా అందించాలని సిబ్బందికి తెలియజేశారు. పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో తమ శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఆనందంగా గడపాలని సూచించారు. తమ ఆరోగ్యాల పట్ల తగు జాగ్రత్తలను తీసుకోవాలని కోరారు.ఎటువంటి అవసరం ఉన్న పోలీసు వ్యవస్థ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

సిరిసిల్లలోని పేర్టీ నైన్ ఉచిత క్యాంపు.

సిరిసిల్లలోని పేర్టీ నైన్ ఉచిత క్యాంపు

సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి ):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని తారకరామ హాస్పిటల్ లో పేర్టీ నైన్ ఉచిత క్యాంపు ఏర్పాటు చేయడం జరిగినది. ఇందులో భాగంగా జిల్లాలో ఉన్న ఇతర గ్రామాల ప్రజలు అందుబాటులో ఉండే విధంగా సిరిసిల్లలో ఏర్పాటు చేయడం జరిగిందని తారకరామ హాస్పిటల్ మేనేజ్మెంట్ దొంతుల రమేష్ తెలియజేశారు. అంతేకాకుండా పేర్టీ నైన్ హాస్పిటల్ సంస్థ హైదరాబాద్ వారు పాల్గొని ఉచిత క్యాంపును విజయవంతం చేయడం జరిగినది.

సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి విన్నపం.

సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి విన్నపం

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఆదివారం రోజు సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ దీర్ఘకాలకు సెలవు పై వెళ్లడం వలన మునిసిపల్ జరుగు అభివృద్ధి కార్యక్రమాలు పాలనపరమైన వ్యవహారాలన్నీ ఆటంకాలు ఏర్పడుతుంది. కేవలం కొద్దిరోజుల వరకే కమిషనర్ లీవ్ లో వెళితే బాగుండేది కానీ దీర్ఘకాలం సెలవు పై వెళ్లడం వలన 39 వార్డులతో ఉన్న సిరిసిల్ల పట్టణం చాలా పెద్ద మున్సిపల్ గా ఉన్న వ్యవహారాలలో ఎన్నో ఆటంకాలు ఏర్పడుతున్నవి. మున్సిపల్ కు ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సంఘటన ఎదురు కావడం పాలకవర్గం లేకపోవడంతో ఎవరు కూడా దీని మీద శ్రద్ధ కనబడుచుక పోవడం ఒకింత బాధ కలిగించి ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫున విప్ గా ఉన్న ఆది శ్రీనివాస్ చొరవ తీసుకొని పూర్తిస్థాయిలో కమిషనర్ నియమించాలి కలెక్టర్ ప్రభుత్వానికి తెలియజేసి పూర్తి కలెక్టర్ నియమించాలి పాలన పాలనమైన వివారాలల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా కమిషనర్ నియమించాలని సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షుడు బియ్యం కార్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు చీకోట అనిల్ సహాయ కార్యదర్శి, కుసుమ గణేష్ కోశాధికారి చెప్ప దేవదాస్ సభ్యులు, నల్ల మురళి మేము ప్రజల పక్షాన కమిషనర్ నియమించాలని కోరుతున్నాము.

సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి.!

రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి,పత్రిక ప్రకటన

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

 

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన అనాథ, నిరాశ్రయులు మరియు నిరుపేద బాలికలకు 3సం.రాల డిప్లామా కోర్సులలో ప్రవేశానికి గాను దుర్గాబాయి దేశ్‌ముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థ, హైదరాబాద్ లో ప్రవేశానికి ధరఖాస్తులను ఆహ్వానించడం జరిగింది. కోర్సుల వివరాలు: డిప్లామా ఇన్ సివిల్ ఇంజనీర్ (DCE) విభాగంలో (60 సీట్లు), డిప్లామా ఇన్ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానికల్ (DEEE) విభాగంలో (60 సీట్లు), డిప్లామా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ (DCME) విభాగంలో (60 సీట్లు), డిప్లామా ఇన్ ఎలట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (DECE) విభాగంలో (60 సీట్లు) కలవు.
ఇందుకు గాను 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన బాలకల యొక్క కులం మరియు ఆదాయదృవీకరణ పత్రం (not for Orphans), తల్లిదండ్రుల యొక్క మరణ దృవీకరణపత్రము (in case of Orphans), బోనఫైడ్, ట్రాన్సఫర్ సర్టిఫికేట్, స్టడీ కేర్టిఫికేట్ మరియు 10 వ తరగతి మార్కుల మేమో ను సంబందిత ధరఖాస్తు ఫామ్ తో జత పరచవలెను. తేది: 20.05.2025 లోపు పూర్తి చేసిన ధరఖాస్తులను జిల్లా కలెక్టర్ కార్యలయంలోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు వయోవృద్దుల శాఖ, రాజన్న సిరిసిల్ల జిల్లా లో సమర్పించగలరని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి,పత్రిక ప్రకటనలో తెలియజేశారు.

సిరిసిల్ల సాహితి సమితి ఆధ్వర్యంలో.

సిరిసిల్ల సాహితి సమితి ఆధ్వర్యంలో

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

సిరిసిల్ల టౌన్:(నేటి ధాత్రి)

 

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సిరిసిల్ల సాహితి సమితి కార్యనిర్వాహణలో ఘనంగా వేడుకలు జరిగినది. సాహితి సమితి అధ్యక్షులు జనపాల శంకరయ్య మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన జ్యోతిరావు పూలే అని జ్యోతిరావు పూలే భావితరాలకు ఆశ కిరణం అనిజ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతిరావు పూలే సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా సాహితీ సమితి కార్యదర్శి వెంగళ లక్ష్మణ్, కవి రచయిత జుకంటి జగన్నాధం, మాజీ గ్రంధాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, సిరిసిల్ల సీనియర్ సిటిజన్ అధ్యక్షులు చేపురి బుచ్చయ్య, గుండెల్లి వంశీ, ఎండి ఆఫీజ్, గజ్జెల్లి సత్యనారాయణ, అంకారపు రవి,కవులు రచయితలు పాల్గొన్నారు.

సిరిసిల్లలో ఉగాది కవి సమ్మేళనం.

సిరిసిల్లలో ఉగాది కవి సమ్మేళనం

 

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి)

 

మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సరము 30 ఆదివారం ఉగాది నూతన సంవత్సరము సందర్భంగా కవి సమ్మేళనం తేదీ:29 శనివారం రోజున ఉదయం 10గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా సినారే గ్రంధాలయంలో నిర్వహించబడుతుంది.
ఈ కవి సమ్మేళనం లో రాజన్న సిరిసిల్ల కవులు, సాహితీ అభిమానులు కళాకారులు కవితా గానంకు ఆహ్వానం పలుకుతున్నాం. మారసం అధ్యక్షులు TV. నారాయణ,ఉపాధ్యక్షులు బుర దేవానందం ప్రధాన కార్యదర్శి ఆడెపు లక్ష్మణ్, కార్యదర్శి ఎలగొండ రవి, మారసం సభ్యులు కామవరపు శ్రీనివాసు తెలిపారు.

బిఆర్ఎస్ నాయకుడి సవాలు స్వీకరించి సిరిసిల్ల చేరుకున్న.!

బి.ఆర్.యస్ నాయకుడి సవాలు స్వీకరించి సిరిసిల్ల చేరుకున్న కాంగ్రెస్ నేత ప్రవీణ్ జె.టోనీ

సిరిసిల్ల టౌన్:(నేటి ధాత్రి)

జిలెల్ల కు చెందిన బాధితులతో, ప్రభుత్వ భూమి కబ్జా పత్రాలతో మరియు పొన్నం ప్రభాకర్ గారి వద్ద ఎన్నికల్లో డబ్బులు తీసుకున్న సాక్ష్యాధారాలతో ఈరోజు సిరిసిల్ల అంబేద్కర్ వద్దకు చేరుకున్న ప్రవీణ్ జె. టోనీ..

Congress

ముందస్తుగా అదుపులోకి తీసుకున్న పట్టణ సీఐ కృష్ణ గారు, అరెస్టు చేసి సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగినది. ఈ సందర్బంగా
ప్రవీణ్ జే టోనీ మాట్లాడుతూ నిజానిజాలపై మండల కాంగ్రెస్ ఎప్పుడు సిద్ధమే
ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళం వెనకడుగు వేయం బి.ఆర్.యస్ పార్టీ అహంకారంతో నిరంకుశ వైఖరితో పాలనను కొనసాగించి దోపిడి దౌర్జన్యం ఇంటిపేరుగా మార్చుకున్న బిఆర్ఎస్ నాయకులు
నీతులు మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది అని అన్నారు అంతే కాకుండా
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ గత పది సంవత్సరాల పాలనలో ఇసుక దొంగలు ఎవరో తెలుసు,భూ దొంగలు ఎవరో తెలుసు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కమిషన్లు తీసుకున్నవారు తెలుసు.
రైతులను వేధించింది ఎవరో తెలుసు సామాన్యులను దోచుకుందువరో తెలుసు,దళితులను,గిరిజనులను,బీసీ,మైనారిటీలను అవమానించిన వారు ఎవరో తెలుసు.
అన్ని నీచ పనులు చేసి ఇప్పుడు తప్పుగా మాట్లాడుతున్నారు అని తెలిపారు.

కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు…

తంగళ్ళపల్లి మండలంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు….

తంగళ్ళపల్లి:నేటి ధాత్రి

తంగళ్ళపల్లిమండలంలో పలు గ్రామాల్లో ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ముందుగా తంగళ్ళపల్లి గ్రామపంచాయతీని ఆకస్మికంగా తనిఖీ చేసి గ్రామ పంచాయతీలో ఉన్న వివరాలు అడిగి తెలుసుకుని సిబ్బంది సరైన టైంలో వస్తున్నారా గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నారనిఅధికారులను ఆదేశించారు అలాగే మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ముందుగా ప్రజాపాలన కౌంటర్ ను పరిశీలించి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం టి సైబర్ సర్వర్ రూమ్ను పరిశీలించి మండలంలో ఇంటి ఇతర పనులపై ఆరా తీశారు మండలంలో భూముల క్రమబద్ధీకరణకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి వాటిలో ఎన్ని అప్రూవ్ అయ్యాయని ఎంపిడిఓ లక్ష్మీనారాయణ ఆరా తీయగా . 2893. దరఖాస్తులు అప్రూవ్ అయ్యాయని
కలెక్టర్అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు అలాగే నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేస్తూ ముందుగా ఓపి రిజిస్ట్రేషన్ పరిశీలించారు ఇతర రూములు తిరుగుతూ ఆసుపత్రికి వచ్చే రోగులపై ఎటువంటి రకాల పరీక్షలు చేస్తూ వారికి మందులు ఇచ్చే గది ల్యాబ్ తనిఖీ చేసి మందులు వ్యాక్సిలపై ఆరా తీశారు ప్రభుత్వ వైద్య సేవ చేసుకునేలా ప్రజలందరికీ ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని వైద్యులకు సిబ్బందికి సూచించారు ప్రభుత్వ దావఖానాలోనే ప్రసవం అయ్యేలా చూడాలని ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఇక్కడ ఏమైనా ఇబ్బందులు కొరతలు ఉన్నాయని నేరెళ్ల వైద్యశాల అధికారి డాక్టర్ చంద్రిక రెడ్డిని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు తర్వాత నేరెళ్ల టీజి ఆర్ ఎస్ గర్ల్స్ విద్యార్థి హాస్టల్లో సందర్శించి విద్యార్థుల కు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు జిల్లా కలెక్టర్ మెనూ ప్రకారం రాగిజావయిస్తుండగా పరిశీలించారు తర్వాత ఏ ఆహారాలు విద్యార్థులకు అందిస్తున్నారు అని అడగగా ప్రిన్సిపల్ సమాధానం చెబుతూ మెనూ ప్రకారం బగారా రైస్ ఆలుగడ్డ కూర టమాట ఉడికించిన గుడ్లు, సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు తర్వాత కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు ఉత్తమఫలితాలు సాధించేలా చర్యలు తీసుకొని ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రణాళికల ప్రకారం విద్యార్థులను సిద్ధం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు

సిరిసిల్ల పట్టణంలో మోనో కార్పస్ చెట్ల వలన వాయు కాలుష్యము.

సిరిసిల్ల పట్టణంలో మోనో కార్పస్ చెట్ల వలన వాయు కాలుష్యము

పట్టించుకోని మునిసిపల్ అధికారులు

సిరిసిల్ల టౌన్:(నేటిదాత్రి)

సిరిసిల్ల పట్టణంలో ఉన్న (గత ప్రభుత్వ హయంలో లో ) పెట్టిన మోనో కార్పస్ చెట్లవలన వాయు కాలుష్యము ఏర్పడుతుందందని, ఇది ఏమాత్రం మంచిది కాదని పిల్లలకు, పెద్దలకు ఊపిరితిత్తుల సమస్య ఏర్పడుతుందని గతంలో కూడా మున్సిపల్ అధికారులకు చెప్పిన వారు పెడచెవిన పెట్టారు.
వాటి వలన ఏలాంటి ఇబ్బంది లేదంటే మోనో కార్పస్ మొక్కలు ప్రతి అధికారి ఛాంబర్లో టేబుల్ మీద ఉంచుకొని ప్రజలకు అవగాహన కల్పించాలని
మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న దాదాపు 10 చెట్లను తొలగించినారు. ( వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా).
కానీ పట్టణంలో డివైడర్ మధ్యలో, పార్కులల్లో అలాగే ఉంచారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని అట్టి చెట్లను తొలగించగలరని బూర యాదగిరి అనే సామాజిక కార్యకర్త తెలిపారు…

కలెక్టర్ పై అసత్య ప్రచారాలు చేసే వారి పై కేసులు నమోదు

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ పై ఎటువంటి కేసులు లేవు
అసత్య ప్రచారాల నేపథ్యంలో పత్రికా ప్రకటన విడుదల చేసిన జిల్లా కలెక్టర్

సిరిసిల్ల(నేటిధాత్రి):

సిరిసిల్ల జిల్లా కలెక్టర్ వ్యక్తిత్వాన్నికి మచ్చ తెచ్చెలా అసత్య ప్రచారాలు చేసే వారి పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తన పై వివిధ కేసులు ఉన్నట్లుగా సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని, తన పై ఎటువంటి కేసులు లేవని, తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సామాజిక మాధ్యమాలు పోస్ట్ చేస్తున్న వారి పై, అసత్యాలను ప్రచారం చేస్తున్న వారి పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటానని , ఇప్పటికే కొంత మంది పై కేసులను నమోదు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
అసత్య ఆరోపణలు, కట్టుకథల ఆదారంగా మీడియా సామాజిక మాధ్యమాలలో వార్తలను ప్రచారం చేయవద్దని అనవసరంగా కేసులలో ఇరుక్కోవద్దని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version