సిరిసిల్ల మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో కాళోజి జయంతి వేడుకలు
సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈ రోజు మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో మహతి కళాశాలలో మానేరు రచయితల సంఘం అధ్యక్షులు గెంట్యాల భూమేష్ తెలంగాణ ప్రజాకవి కాళోజి జయంతి సందర్భంగా కళాశాలలోని విద్యార్థులకు తెలంగాణ భాష దినోత్సవం పురస్కరించుకొని కాళోజి జయంతి వేడుకను పురస్కరించుకొని తాను మాట్లాడుతూ తెలంగాణ యాస భాష మన కాళోజీ అని నిజాం, నిరంకుశత్వానికి ఎదురుతిరిగిన కవితల యోధుడని, మా భాష,మన అస్తిత్వం, మన నేల భూమి మన తెలంగాణ పోరాటం అని తెలిపారు.అందులో భాగంగా ఆడెపు లక్ష్మణ్ మాట్లాడుతూ రాబోయే తరాలకు మన భాష మన ఆస్తిత్వం ఎంతో ఉపయోగమని అలాంటి ఈరోజున తెలుగు భాషా దినోత్సవం కాళోజి జయంతి వేడుక మనకెంతో గర్వకారణం అని తెలిపారు.
కవి రచయిత బూర దేవానందం కాళోజి పై కవిత గానం చేశారు. ఈ కార్యక్రమంలో మానేరు రచయితల సంఘం గౌరవ సలహాదారులు, అధ్యక్షులు జర్నలిస్టు టీవీ నారాయణ,చిటికెన కిరణ్ కుమార్, అల్లే రమేష్, కామవరపు శ్రీనివాస్, పోకల సాయికుమార్, ఎండి ఆఫీస్, అధ్యాపకులు వేణు,అంకారపు రవి కవులు,రచయితలు మరియు మహతి కళాశాల విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.