ఎమ్మెల్యే గాంధీ నివాసంలో ‘అనధికార’ సమీక్షలు..

ఎమ్మెల్యే గాంధీ నివాసంలో ‘అనధికార’ సమీక్షలు..

ప్రొటోకాల్‌ను గాలికొదిలేసిన అధికారులు!
​క్యాంపు కార్యాలయం ఉండగా ఎమ్మెల్యే ఇంటికి అధికారుల పరుగులు
​ మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకోవడంపై బొబ్బ నవతా రెడ్డి ఆగ్రహం

పదవి లేని వారు అధికారుల పక్కన కూర్చోవడానికి హక్కు ఎక్కడిది?
​ జోనల్ కమిషనర్ హేమంత్‌కు మాజీ కార్పొరేటర్ ఫిర్యాదు

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అధికార యంత్రాంగం మరియు ప్రజాప్రతినిధుల తీరుపై బీఆర్ఎస్ సీనియర్ మహిళా నేత, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో ప్రొటోకాల్ నిబంధనలు తుంగలో తొక్కబడ్డాయని, అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరిందని ఆమె ఆరోపించారు. మంగళవారం ఆమె సిఎంసి జోనల్ కమిషనర్ హేమంత్ గారిని కలిసి, నియోజకవర్గంలో సాగుతున్న అనధికారిక సమీక్షా సమావేశాలపై రాతపూర్వక ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా బొబ్బ నవతా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం, అధికారిక సమావేశాల నిర్వహణ కోసం మియాపూర్‌లో అన్ని వసతులతో కూడిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నిర్మించారని గుర్తు చేశారు. ఇంతటి ఆధునిక భవనం అందుబాటులో ఉండగా, మియాపూర్, శేరిలింగంపల్లి, ఆల్విన్ కాలనీ సర్కిళ్ల అధికారులను కూకట్‌పల్లిలోని ఎమ్మెల్యే వ్యక్తిగత నివాసానికి పిలిపించుకుని అధికారిక సమీక్షలు నిర్వహించడం వెనుక అంతర్యమేమిటని నిలదీశారు. “ప్రభుత్వ నిధులతో కట్టిన కార్యాలయం ఏమైంది? అది వాడుకలో లేనప్పుడు దానిని సిఎంసి అధికారులకే అప్పగించాలి కదా?” అని ఆమె ప్రశ్నించారు.
మహిళా అధికారుల పట్ల అగౌరవం

 

ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారిక సమీక్షలు ప్రభుత్వ కార్యాలయాల్లోనే జరగాలని, కానీ ఎమ్మెల్యే తన ఇంటి వద్ద మీటింగ్స్ ఏర్పాటు చేసి అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా ఈఈ శిరీష, డీఈలు శ్రీదేవి, మౌనిక వంటి మహిళా అధికారులను ఎమ్మెల్యే నివాసానికి పిలిపించుకోవడం మహిళలను అవమానించడమేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “మహిళా అధికారులకు హుందాతనం కల్పించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై లేదా?” అని ఆమె సూటిగా ప్రశ్నించారు. అధికారులు కూడా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలను అతిక్రమించడం సరికాదని హితవు పలికారు.అధికారులతో నిర్వహించే ఈ సమీక్షల్లో ప్రస్తుతం ఎలాంటి అధికారిక పదవి లేని మాజీ కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ వంటి వారు ఏ హోదాలో కూర్చుంటున్నారని ఆమె నిలదీశారు.
చట్టపరమైన చర్యలకు సిద్ధం
అధికారులు చట్టానికి లోబడి విధులు నిర్వర్తించాలని, పద్ధతి మార్చుకోని పక్షంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి, చట్టపరమైన చర్యలు తీసుకునేలా పోరాడతామని నవతా రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఈ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదు కార్యక్రమంలో ఏఈలు భాస్కర్, యుగేంధర్, వర్క్ ఇన్‌స్పెక్టర్ల తీరుపై కూడా ఆమె విస్మయం వ్యక్తం చేశారు.

నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు…..

నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు…..

◆-: మహిళా సర్పంచ్ స్థానంలో వారి కుటుంబ సభ్యుల పెత్తనం ఏంటి

◆-: ఎంపీడీఓ షగుప్త ఇర్ఫాత్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ – నియోజకవర్గ కేంద్రమైన న్యాల్కల్ మండల్ ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, తదితర కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు తప్పనిసరిగా ప్రోటోకాల్ ను పాటించాలని, ప్రోటోకాల్ ను ఉల్లంఘించి పనులు చేపడితే ప్రజా ప్రతినిధులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులపై శాఖపరమైన చర్యలు తప్పవని న్యాల్కల్ మండల పరిషత్ అభివృ ద్ధి అధికారిణి షాగుప్త ఇర్ఫాత్ స్పష్టం చేశారు. ఓ ప్రకటన విడుదలaక్రమాలను చేపట్టాలని సూచించారు. మహిళా సర్పంచుల స్థానంలో వారి వారి కుటుంబ సభ్యులు, అధికార, విపక్ష పార్టీ శ్రేణులు, నాయకులు,తదితరులు తాజాగా ఎన్నికైన సర్పంచులకు బదులుగా ఇతరులు.. ప్రోటోకాల్ ను ఉల్లంఘించి ప్రారంభోత్సవాలు చేపడితే ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులపై శాఖా పరమైన చర్యలు చేపట్టేందుకు జిల్లా పంచాయ తీరాజ్ శాఖాధికారులకు నివేదికలు పంపనట్లు పేర్కొన్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ప్రోటోకాల్ ను ఉల్లంఘించిన ప్రజా ప్రతినిధులు, కార్యదర్శులపై శాఖపరమైన చర్యలు తప్పవని ఎంపీడీవో హెచ్చరించారు. మండలంలోని 38 గ్రామ పంచాయతీల సర్పంచులు తప్పనిసరిగా నియమావళిని అనుసరించాలని ఆదేశించారుa

ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అవమానం పై బీసీ, దళిత సంఘాల నిరసన

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను అవమానపరిచిన జిల్లా కలెక్టర్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి

బీసీ, దళిత సంఘాల డిమాండ్

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవం లో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ప్రోటోకాల్ పాటించకుండా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను అవమానపరిచి అగౌరపరచినందున అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం, బీసీ కుల సంఘాలుమరియు దళిత సంఘాలు గురువారం రోజున డిమాండ్ చేశాయి, కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేసిన అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు, బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు గడ్డం నరసయ్య, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు బొప్పా దేవయ్య, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, పద్మశాల సంఘం పట్టణ అధ్యక్షుడు గోలి వెంకటరమణ, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు కత్తెర దేవదాసు, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు రాగుల రాములు, ఎస్సీ ఎస్టీ సంఘం జిల్లా అధ్యక్షుడు కంసాల మల్లేశం ,

 

 

 

బీసీ సేన జిల్లా అధ్యక్షుడు బట్టు ప్రవీణ్, బీసీ సంఘం పట్టణ అధ్యక్షుడు తడక కమలాకర్ లు గురువారం రోజున అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలియజేసి మాట్లాడుతూ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే బీసీ బిడ్డ ఆది శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేస్తున్న క్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఫోటోకాల్ పాటించకుండా మధ్యలోనే వచ్చి తన కారు సైరన్ సౌండ్ మోగించి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ని మరియు ప్రజా పాలన దినోత్సవాన్ని అగౌరపరిచి అవమానించారన్నారు, ఉద్దేశపూర్వకంగా ఒక బీసీ బిడ్డ ఆయన ఆది శ్రీనివాసును ప్రోటోకాల్ పాటించకుండా అవమానపరిచిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆది శ్రీనివాస్ కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు , చట్టరీత్యా చర్య తీసుకోవాలని ఎస్పీ గారికి ఫిర్యాదు చేసిన అనంతరం పై అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు, ఆది శ్రీనివాస్ పై జరిగిన అవమానం యావత్తు బీసీ ,దళితులకు జరిగిన అవమానంగా మేము భావిస్తున్నామన్నారు, చర్యలు తీసుకోకపోతే నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా నాయకులు హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో పర్ష హన్మాండ్లు,గడ్డం నరసయ్య, కత్తెర దేవదాసు , బొప్ప దేవయ్య , చొక్కాల రాము, గోలి వెంకటరమణ, రాగుల రాములు ,రాగుల జగన్ ,బట్టు ప్రవీణ్ ,తడక కమలాకర్, కంచర్ల రాజు , రవీందర్, మల్లేశం ,ఇల్లంతకుంట తిరుపతి, నల్ల శ్రీకాంత్, సామల తిరుపతి తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version