బిటి 3 పత్తి విత్తనాలను నియంత్రించాలి.

బిటి 3 పత్తి విత్తనాలను నియంత్రించాలి

సిపిఐ మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ గౌడ్

మరిపెడ నేటిధాత్రి.

మరిపెడ మండలం
లోని రబీ సీజన్ వ్యవసాయ పనులు ప్రారంభమైన వేల మరిపెడ మండలంలోని అమాయకులైన రైతులను ఆసరాగా చేసుకుని బీటీ3పత్తి విత్తనాలను విచ్చలవిడిగా మరిపెడ మండలంలోని వివిధ గ్రామాల్లో విక్రయిస్తున్నారు అదేవిధంగా మరిపెడ మండలంలోని అనుమతి లేని ఫెర్టిలైజర్స్ అనుమతులు ఉండి రెన్యువల్ చేయని చేయని ఫెర్టిలైజర్స్ షాపులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ నిషేధించినటువంటి క్రిమి సహారక రసానిక ఎరువులను అన్ని ఫెర్టిలైజర్ షాపులు నిల్వలు లేకుండా చూడాలని రైతులకు ఎమ్మార్పీ ధరలకు ఎరువుల బస్తాలు క్రిమి సారక మందులను అందించాలని వారు డిమాండ్లతో కూడిన వినపత్రాన్ని మరిపెడ ఏవో గారికి సిపిఐ మరిపెడ మండలం తరపున కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్ యాకన్న సత్యం రాజేష్ తదితరులు పాల్గొన్నారు

నకిలీ పత్తి విత్తనాలను స్వాధీన పరుచుకున్న.

నకిలీ పత్తి విత్తనాలను స్వాధీన పరుచుకున్న కోటపల్లి పోలీసులు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

 

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లో నకిలీ పత్తి విత్తనాలు స్వాధీన పరుచుకున్నట్లు జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు తెలిపారు.నకిలీ పత్తి విత్తనాలు చేరవేస్తున్నట్లు నమ్మదగిన సమాచారం రావడంతో కోటపల్లి పోలీసులు,వ్యవసాయ శాఖ అధికారితో కలిసి అంతరాష్ట్ర బ్రిడ్జి రాపనపల్లి వద్దకు వెళ్లి తనిఖీలు చేపట్టగా టాటా టియాగో కారులో తరలిస్తున్న1,45,800 రూపాయల విలువ గల 46.6 కిలోల నకిలీ పత్తి విత్తనాలను రవాణా చేస్తున్న నిందితులను పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.నకిలీ పత్తి విత్తనాలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కోటపల్లి ఎస్సై రాజేందర్,పోలీస్ సిబ్బంది పిల్లి శ్రీనివాస్,శ్యాంసుందర్, హోంగార్డ్స్ శ్యామ్,తిరుపతి రెడ్డిలను జైపూర్ ఎసిపి ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ఏసిపి వెంకటేశ్వర్లు,చెన్నూరు సిఐ దేవేందర్రావు,శ్రీరాంపూర్ సిఐ వేణు చందర్,కోటపల్లి ఎస్సై రాజేందర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

నిషేధిత పత్తి విత్తనాలపై అవగాహన సదస్సు.

నిషేధిత పత్తి విత్తనాలపై అవగాహన సదస్సు

మందమర్రి నేటి ధాత్రి

 

మందమర్రి మండలం వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ మరియు పోలీస్ శాఖ వారు ఆధ్వర్యంలో సారంగపల్లి గ్రామ పంచాయతీలో కార్యాలయంలో రైతు లతో నిషేధిత గ్లసిల్ పత్తి విత్తనాల వినియోగం నిషేధిత గ్లోపోనేటు వినియోగం వల్ల కలుగు నష్టాలపై అవగాహన ఈ కార్యక్రమం పోలీసు వారు మరియు రెవెన్యూశాఖ వ్యవసాయ శాఖ నిర్వహించిన ప్రజలకు అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించరు ఈ కార్యక్రమం లో వ్యవసాయ శాఖ ఏవో కిరణ్మయి ఏ ఈ ఓ తిరుపతి మండల ప్రజా పరిషత్ ఆఫీసర్ రాజేశ్వర్ పంచాయతీ కార్యదర్శి సవ్య పోలీస్ శాఖ మందమర్రి ఎస్సై రాజశేఖర్ ఏ.స్ఐ మజీద్ ఖాన్ పోలీస్ సిబ్బంది మాజీ సర్పంచ్  పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version