నీలికుర్తి గ్రామంలో ధాన్యం కొనుగోలు సెంటర్ PACS ఏర్పాటు చేయాలి
సిపిఐ మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ
మరిపెడ నేటిధాత్రి.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రైతులు పండించిన వరి ధాన్యాన్ని దళారులకు వ్యాపారులకు అమ్మకుండా కనీస మద్దతు ధర బోనస్ లభించే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఐకెపి ప్యాక్స్ సెంటర్ల ద్వారా కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేసింది మరిపెడ మండలంలోని అన్ని గ్రామాలలో ఐకెపి ప్యాక్స్ సెంటర్లు ఏర్పాటు చేసి కొనుగోలు ప్రారంభించడం జరుగుతుంది. నీలికుర్తి గ్రామంలో ప్యాక్స్ సెంటర్ ఏర్పాటుచేసి ఇక్కడ ఉన్నటువంటి 2500 మంది వరి ధాన్యం పండించే రైతుకు కనీస మద్దతు ద్వారా బోనస్ లభించే విధంగా ప్రజా ప్రతినిధులు అధికారులు తక్షణమే నీలికుర్తి గ్రామంలో ఫ్యాక్ సెంటర్ ఏర్పాటుచేసి కొనుగోలు ప్రారంభించాలని ఎమ్మార్వో గారికి డిమాండ్లతో కూడిన వినపత్రాన్ని అందజేయడం జరిగింది
గత కొన్ని సంవత్సరాలుగా నీలి కుర్తి గ్రామంలో ప్యాక్ సెంటర్ ద్వారా ధాన్యం కొనుగోలు జరిగింది గత రబీ కాలంలో ప్యాక్ సెంటర్ కొనుగోలు వ్యాపారులు దళారులు ప్రమేయాన్ని అరికట్టాలని నీరుకుర్తి గ్రామస్తుల ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే దానిని సాకుగా చూసుకొని అధికారులు ప్రజాప్రతినిధులు అక్కడ సెంటర్ ని ఎత్తివేయడం వలన రైతులు కనీస మద్దతు ధర బోనస్‌ను పొందలేకపోతున్నారు కాబట్టి సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు తక్షణమే ఫ్యాక్స్ సెంటర్ ని ఏర్పాటు చేయాలని వినపత్రాన్ని సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్,యాకన్న,అంజి,వస్త్రం తదితరులు పాల్గొన్నారు