ఎస్ బి ఐ నుండి రెండు లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేత..

ఎస్ బి ఐ నుండి రెండు లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేత

#నెక్కొండ, నేటి ధాత్రి:

నెక్కొండ మండలంలోని వాగ్య నాయక్ తండ కు చెందిన స్వామి కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందగా నెక్కొండ ఎస్బిఐ బ్రాంచ్ మేనేజర్ ఐలేష్ మృతుడి భార్య సునీతకు రెండు లక్షల ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ ఐలేష్ మాట్లాడుతూ ఎస్బిఐ బ్యాంకులో స్వామి 436 రూపాయల ఇన్సూరెన్స్ ను చేయడంతో రెండు లక్షల బీమా చెక్కును మృతుడి భార్య సునీతకు అందజేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు ఎస్బిఐ ఇన్సూరెన్స్ ను తప్పక కట్టుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ ఎస్బిఐ బ్యాంకు సిబ్బంది, నెక్కొండ మాజీ జెడ్పిటిసి సరోజ హరి కిషన్ పాల్గొన్నారు.

కోటి రూపాయల ఎస్బిఐ ప్రమాద భీమా అందజేత.

కోటి రూపాయల ఎస్బిఐ ప్రమాద భీమా అందజేత

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన కొమిశెట్టి కిరణ్ కుమార్ ఇటీవల రోడ్డు ప్రమాదం లో మృతి చెందగా, మృతుడు కాశీపేట 2 గని లో విధులు నిర్వర్తించేవాడు.సింగరేణి సంస్థకు ఎస్బిఐ బ్యాంక్ సంస్థకు మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఎస్బిఐ సాలరీ అకౌంట్ ఎస్బిఐ లొ మెయింటైన్ చేసినందుకు గాను కోటి రూపాయల భీమా ఎస్బిఐ బ్యాంక్ మంజూరు చేసింది. ఇట్టి కోటి రూపాయల చెక్కును నామిని అయిన మృతుని భార్య కొమిశెట్టి కోమల కు శనివారం రామకృష్ణపూర్ ఎస్బిఐ బ్యాంక్ ఆవరణలో మంచిర్యాల ఎస్బిఐ రీజినల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్త, ఆర్బీవో సివిఈ చీఫ్ మేనేజర్ శ్రీనివాస్ మూర్తి లు మృతుని కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమం లో బ్రాంచ్ మేనేజర్ గుగులోత్ గోపాల్, బ్యాంక్ స్టాఫ్ ప్రశాంత్,రామ కార్తిక్, వెంకటేశ్. రాజేంద్ర ప్రసాద్ , చందు, రమాదేవి లు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version