ఎస్ బి ఐ నుండి రెండు లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేత
#నెక్కొండ, నేటి ధాత్రి:
నెక్కొండ మండలంలోని వాగ్య నాయక్ తండ కు చెందిన స్వామి కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందగా నెక్కొండ ఎస్బిఐ బ్రాంచ్ మేనేజర్ ఐలేష్ మృతుడి భార్య సునీతకు రెండు లక్షల ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ ఐలేష్ మాట్లాడుతూ ఎస్బిఐ బ్యాంకులో స్వామి 436 రూపాయల ఇన్సూరెన్స్ ను చేయడంతో రెండు లక్షల బీమా చెక్కును మృతుడి భార్య సునీతకు అందజేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు ఎస్బిఐ ఇన్సూరెన్స్ ను తప్పక కట్టుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ ఎస్బిఐ బ్యాంకు సిబ్బంది, నెక్కొండ మాజీ జెడ్పిటిసి సరోజ హరి కిషన్ పాల్గొన్నారు.