మహిళా అభివృద్ధితోనే ఆర్థిక అభివృద్ధి
◆:- బీమా పథకాలపై అవగాహన
◆:- సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం
◆:- ఎస్బిఐ సీజీఎం సహదేవన్ రాధాకృష్ణన్
జహీరాబాద్ నేటి ధాత్రి:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందాలని ఎస్బిఐ హైదరాబాద్ సర్కిల్ సీజీఎం (చీఫ్ జనరల్ మేనేజర్ ) సహదేవన్ రాధాకృష్ణన్, డీజీఎం జితేంద్ర కుమార్ శర్మ లు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జన సురక్ష పై నిర్వహించిన అవగాహన సదస్సుకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్ ధన్, సురక్ష, జీవన్ జ్యోతి, గ్యాస్ సబ్సిడీ, దీన్ దయాళ్, అంత్యోదయ యోజన, కిసాన్ సమ్మన్ నిధి, పీఎంకిసాన్, సుకన్య సమృద్ధి పథకం, బేటీ బచావో బేటీ పడావో తదితర పథకాలపై మహిళా సంఘాలకు అవగాహన కల్పించారు. ప్రతి ఖాతాదారుడు బీమా చేయించుకోవాలని వారు సూచించారు. ప్రతి ఖాతాదారు తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలని తెలిపారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని మహిళా సంఘాలకు విజ్ఞప్తి చేశారు. డిజిటల్ అరెస్టు వంటి మోసాలను నమ్మకూడదని, అలాంటి సంఘటనలు జరిగితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంఢీ హైదరాబాద్ రాజీవ్ కుమార్, సంగారెడ్డి ఆర్‌ఎం ఆర్‌బిఓ పపాసాహెబ్ సిరాజ్ బాషా, ఝరాసంగం ఎంపీడీవో మంజుల, వివిధ బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లు, జహీరాబాద్, ఝరాసంగం, కోహిర్, మొగుడంపల్లి, న్యాల్‌కల్, రాయికోడ్ తదితర మండలాలకు చెందిన ఐకెపి సిబ్బంది, మహిళా సంఘాల నాయకులు, సభ్యులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అంతకుముందు కేతకి సంగమేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.