మెట్ పల్లి అక్టోబర్ 14 నేటి దాత్రి
మెట్పల్లి ఎస్బిఐ బ్యాంకులో ఖాతాదారుడైన టీజీ ఎస్ ఎన్ పి డి సి ఎల్ ఉద్యోగి రంగు రవీందర్ గ్రామం గోవిందారం వారు ఆరు నెల క్రితం సహజ మరణించడం జరిగింది సాలరీ ప్యాకేజ్ అకౌంటు ఖాతాదారుడి కి ఉన్నందున ఇన్సూరెన్స్ పది లక్షల రూపాయలు అతని భార్యకు బ్యాంకు మేనేజర్ పి నవీన్ కరెంట్ డిపార్ట్మెంట్ ఎస్సీ. డి ఈ ఈ డిఈ చేతుల మీదుగా చెక్కును అందజేయడం జరిగింది. అనంతరం బ్యాంకు మేనేజర్ పి నవీన్ మాట్లాడుతూ 18వ తారీకు రెండో నెల 2025 రోజున ఎస్బిఐ మరియు టీజీ ఎస్ ఎన్ పి డి సి ఎల్ మధ్య ఎం ఓ యు శాలరీ ప్యాకేజ్ అకౌంట్ ఒప్పందం జరిగింది. తెలంగాణ కరెంటు డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఎస్బిఐ బ్యాంకు లో ఖాతా దారులుగా జీతం పొందుతున్న వారికి ఇన్సూరెన్స్ సౌకర్యము కల్పించాలని ఒప్పందం కుదిరిందని తెలిపారు. మా బ్యాంకులో ఖాతాదారుడైన విద్యుత్ శాఖ ఉద్యోగి రవీందర్ ఇటీవల ఆర్నెల్ల క్రితం చనిపోవడం జరిగింది. వారికి సాలరీ ప్యాకేజ్ అకౌంటు ఉన్నందున ఇన్సూరెన్స్ 10 లక్షల రూపాయలు బ్యాంకు సిబ్బంది విద్యుత్ ఉన్నత అధికారులతో చెక్కును వారి భార్యకు అందివ్వడం ఇవ్వడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో సర్వీస్ మేనేజర్ మౌనిష రాకేష్ విద్యుత్ శాఖ ఉద్యోగులు బ్యాంక్ ఉద్యోగులు పాల్గొన్నారు.