వనపర్తిలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

సంక్రాంతి వేడుకలలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్
వనపర్తి నేటిదాత్రి

 

వనపర్తి 30 వ వార్డు జంగిడి పురం కాలనీ అసోసియేషన్ విజ్ఞేశ్వర కాలనీ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయని మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ వాకిటి శ్రీదర్ ఒక ప్రకటన లో తెలిపారు .బుధవారం నాడు ప్రజలు భోగి మంటలు వెలిగించి జరుపుకున్నామని తెలిపారు ఈసందర్భంగా వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ ప్రజలు సుఖశాంతులతో భోగ భాగ్యాలతో విలసిల్లాలని సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కురుమయ్య మద్దిలేటి సుధాకర్ పాపిరెడ్డి వెంకటేశ్వర్లు జగపతిరావు తిరుపతయ్య వెంకట్రామ్ రెడ్డి మధుసూదనరావు సూర్యశేఖర్ రెడ్డి బాలస్వామి కృష్ణయ్య కొండన్న శివాజీ రమణ దర్గయ్య తదితరులు పాల్గొన్నారు

బాలాజీ సెలబ్రేషన్ గ్రూప్ ఆధ్వర్యంలో భోగి మంటలు

బాలాజీ సెలబ్రేషన్ గ్రూప్ ఆధ్వర్యంలో భోగి మంటలు

వనపర్తి నేటిదాత్రి .

 

 

వనపర్తి పాత మార్కెట్ యార్డులో సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీబాలాజి సెలబ్రేషన్ గృపు అద్యర్యము లో మంగళవారం రాత్రి 45 కుటుంబ సబ్యులు పాల్గొని భోగి మంటల కార్యక్రమంఘనంగా నిర్వహించామని అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు చెప్పారు ఈసందర్భంగా ఆయన
మాట్లాడుతూ ఈ యొక్క సెలబ్రేషన్ గ్రూపు మూడు సంవత్సరాల క్రింద 45 కుటుంబాలతో ఏర్పాటు చేసుకొని పండుగ సాంప్రదాయాలను కొనసాగించాలని ముఖ్య ఉద్దేశంతో భోగి మండల కార్యక్రమం ఉగాది హోలీ వినాయక చవితి కార్యక్రమాల ను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సభ్యులు గోకారం కృష్ణమూర్తి పోలిశెట్టి మురళి కటకం శ్రీధర్ కటకం పరమేష్ కలకొండ కిషోర్ సాయి నారాయణ గంధం రాజు నూకల వెంకటేశ్వర్లు సుధీర్ వెంకటేశ్వర్లు సంబు వెంకటేశ్వర్లు లగిశెట్టి శ్రీనివాసులు మహిళలు తదితరులు పాల్గొన్నారని కలకొండ శ్రీనివాసులు తెలిపారు

పండుగలతో అనుబంధాలు బలపడతాయి: మోటే ధర్మారావు

పండుగలతో అనుబంధాలు బలపడతాయి..

సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ సర్పంచ్ మోటే ధర్మారావు.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి.

 

 

పండుగల ద్వారా కుటుంబ అనుబంధాలు మరింత బలపడతాయని మొగుళ్లపల్లి మాజీ సర్పంచ్ మోటే ధర్మారావు అన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడంలో ఇలాంటి పండుగల పాత్ర ఎంతో ముఖ్యమైందని ఈ సంక్రాంతి మీ జీవితాలలో కొత్త కాంతులు దింపాలని సరదాలు పంచే సంక్రాంతి వేడుక ప్రజలందరికీ ఆనందం పంచాలని ఆకాంక్షించారు అనుకున్న కార్యక్రమాలన్నీ నెరవేరాలని ఈ ఏడాది పొడుగునా ఇంటింటా సిరులు కాంతులు విరిసిల్లాలని ఆకాంక్షించారు ప్రజలకు ప్రభుత్వ అధికారులకు మండల నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version