ధనసిరి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అమర జవాన్ స్థూపం ప్రారంభోత్సవ
◆:- ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ….
జహీరాబాద్ నేటి ధాత్రి:
ధనసిరి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అమర జవాన్ స్థూపం ప్రారంభోత్సవ పాల్గొని
ఈ సందర్భంగా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశానికి చేస్తున్న సేవ అభినందనీయం అని ,నేటి యువతక జవాన్ లను ఆదర్శంగా తీసుకోవాలి అని , మన నియోజకవర్గం ధనసిరి గ్రామంలో 80 మంది వరకు సైనికులుగా ఉన్నారు ఇది మన అందరికి గర్వ కారణం అని అన్నారు .
ఎమ్మెల్యే గారితో పాటు గా జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, పాక్స్ చైర్మన్ మచ్చెందర్, రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, మాజి సర్పంచ్ లు హస్బి రాజు ,చిన్న రెడ్డి ,మహిపాల్ ,అశోక్ రెడ్డి, ప్రవీణ్, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..