పౌర్ణమి వెన్నెల్లో దీపోత్సవం.. వేలాదిగా పాల్గొన్న భక్తులు…

పౌర్ణమి వెన్నెల్లో దీపోత్సవం.. వేలాదిగా పాల్గొన్న భక్తులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం: జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతున్న బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో మార్గశిర పౌర్ణమి దత్త జయంతి సందర్భంగా గురువారం ఆధ్మాత్మికతను సంతరించుకుంది రాత్ర పౌర్ణమి వెలుగుల్లో నింగిలోని తారలన్నీ నేలపై వెలిగినట్లుగా… ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన లక్షదీపోత్సవ శోభతో బర్దిపూర్ ను పసిడి కాంతులతో నింపింది. తొలి దీపాన్ని స్వామీజీలు, భాజపా జాతీయ నాయకులు, మురళీధర్ రావు, హాజరై మఠాధిపతులు దీపాలను వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకునేందుకు, లక్ష దీపోత్సవాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. శివలింగాకారంలో ఏర్పాటుచేసిన దీపోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది. రాత్రికి సంస్కృతిక కార్యక్రమాలతో పాటు విశ్వ మానవ ధర్మ ప్రచార సభనిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల పీఠాధిపతులు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జిల్లా బిజెపి అధ్యక్షురాలు గోదావరి, జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చంద్రశేఖర్, వివిధ ప్రాంతాల భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
సంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

దత్త జయంతి సందర్భంగా ఆశ్రమాన్ని దర్శించిన కాంగ్రెస్ అభ్యర్థి…

దత్త జయంతి సందర్భంగా ఆశ్రమాన్ని దర్శించిన కాంగ్రెస్ అభ్యర్థి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచెల్మెడ గ్రామ పంచాయతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రుద్ర గాయత్రి, గురువారం దత్త జయంతి సందర్భంగా ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామంలోని ఆశ్రమానికి వెళ్లి శ్రీ శ్రీ శ్రీ వైరాగ్య శిఖామణి అవదూత గిరి మహారాజ్ ను దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు రుద్ర కృష్ణ, మాజీ సర్పంచ్ గాజుల బాల కిష్టయ్య, వార్డు అభ్యర్థులు, నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

దత్తాత్రేయ ఆలయంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ…

దత్తాత్రేయ ఆలయంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని రంజోల్ గ్రామంలోని దత్తాత్రేయ స్వామి ఆలయంలో గురువారం దత్త జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకం, ఆరాధన, ప్రసాద వితరణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్త బసంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులకు మహా అన్నపూర్ణ ప్రసాదాన్ని అందజేశారు. దత్త పౌర్ణమి పురస్కరించుకొని ఈ కార్యక్రమాలు నిర్వహించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version