ఈదుల పల్లి లో ఘనంగా పాస్టర్ డే సెలబ్రేషన్ వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-13T112537.492.wav?_=1

 

ఈదుల పల్లి లో ఘనంగా పాస్టర్ డే సెలబ్రేషన్ వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండలం ఈదుల పల్లి గ్రామం చర్చి లో గ్రామ సంఘాస్తుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన పాస్టర్ డే సెలబ్రేషన్ వేడుకలు ఈ సందర్బంగా ప్రపంచవ్యాప్తంగా పాస్టర్స్ డే సెలబ్రేషన్ జరుపుకోవడం చాలా సంతోషకరం అని అన్నారు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పట్టణాల్లో అందరికీ పాస్టర్స్ డే శుభాకాంక్షలు స్థానిక సంఘ కాపరి వారి కుటుంబ సభ్యులకు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు సంఘస్తులు చిన్నపిల్లలు పాల్గొన్నారు.

*గ్రూప్ 1 విజేతను సన్మానించిన ఎమ్మెల్యే…

*గ్రూప్ 1 విజేతను సన్మానించిన ఎమ్మెల్యే

కాప్రా నేటిధాత్రి

చర్లపల్లి డివిజన్ పరిధిలోని చక్రీపురం నాగార్జున కాలనీ కి చెందిన దరవత్ సబితా ఇటీవల విడుదల అయిన గ్రూప్ 1 ఫలితాల్లో 303 ర్యాంక్ సాధించి డి.ఎస్.పి గా ఎంపిక కావడం జరిగింది.
ఈ సందర్భగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వారి నివాసానికి (డాక్టర్ ఏ ఎస్ రావు నగర్) డివిజన్ కార్పొరేటర్ శిరీష సోమ శేఖర్ రెడ్డి తో కలిసి వెళ్ళి వారిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ కష్టపడి చదివి గ్రూప్ 1 ఫలితాల్లో డీ ఎస్ పి గా నియమితులైన సబితా ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి అని ఈమె విజయం బంజారా జాతి కే గర్వకారణం అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమ శేఖర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నాయకులు శివ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఎంపివో ఉద్యోగం సాధించిన ఆమనిని సన్మానించిన మాజీ ఎంపీపీ

ఎంపివో ఉద్యోగం సాధించిన ఆమనిని సన్మానించిన మాజీ ఎంపీపీ

రామడుగు, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కొరటపల్లి గ్రామానికి చెందిన బంధారపు తిరుపతి భాగ్యల కూతురు బంధారపు ఆమని గ్రూప్2 పరీక్ష ఫలితాలలో 765 ర్యాంకుతో ఎంపీఓ ఉద్యోగం సాధించిన సందర్భంగా రామడుగు మండల మాజీ ఎంపీపీ కలిగేటి కవిత లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించిన అనంతరం వారు మాట్లాడుతూ ఇంతటితో ఆగకుండా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మరియు ఆమని తల్లిదండ్రులను సన్మానించి వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈకార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ మేకల విజయేందర్, దాసరి రత్నమాల, అనిల్, హరీష్, పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

డిప్యూటీ కలెక్టర్ ను అభినందించిన పాలకుర్తి తిరుపతి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-06T123946.116.wav?_=2

 

డిప్యూటీ కలెక్టర్ ను అభినందించిన పాలకుర్తి తిరుపతి

పరకాల,నేటిధాత్రి

పట్టణానికి చెందిన పాలకుర్తి కాశయ్య రిటైర్డ్ పోలీస్ అధికారి కుమారుడు సందీప్ నిజామాబాద్ డిప్యూటీ కలెక్టర్ గా నియామకం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బిజెపి పరకాల పట్టణ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి తిరుపతి సందీప్ కు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించి అభినందించారు. తన సోదరుడు పాలకుర్తి సందీప్ బాబాయ్ కాశయ్య స్ఫూర్తితో వ్యవసాయక అధికారిగా పనిచే స్తూనే గ్రూపు 1 పరీక్ష రాసి గ్రూపు వన్ లో 80 శాతం మార్కులు సాధించి డిప్యూటీ కలెక్టర్ గా నియామకం కావడం ఎంతో గర్వంగా ఉందని పాలకుర్తి తిరుపతి అన్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా పేరు సంపాదించినందుకు చెప్పలేనంత సంతోషం గా ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో సందీప్ మరింత ఉన్నత సాయికి ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

మరోసారి నిరూపించిన జహీరాబాద్ అఖిల…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-04T120340.119.wav?_=3

 

సమాజంలో ప్రత్యేకత,ఉన్నత విలువలు,గౌరవం పొందాలంటే చదువొక్కటే మార్గం

◆:- మరోసారి నిరూపించిన జహీరాబాద్ అఖిల

జహీరాబాద్ నేటి ధాత్రి:

మాజీ టీఎస్ఐడిసి చైర్మన్ మొహమ్మద్ తన్విర్ ఇటీవల డీఎస్పీగా ఎంపికైన అఖిల.తన తండ్రి పాక్స్ చైర్మన్ జగన్నాథ్ రెడ్డితో కలిసి టీఎస్ఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్విర్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈసందర్భంగా డీఎస్పీ గా ఎంపికైన అఖిలను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.వారు మాట్లాడుతూ సమాజంలో డబ్బుకంటే,అన్నిటికంటే ముఖ్యం చదువేనని దానికి మన జహీరాబాద్ బిడ్డ డీఎస్పీ గా ఎంపికవ్వడమే నిదర్శనమని(“టీఎస్ఐడిసి చైర్మన్ మొహమ్మద్ తన్విర్”) అన్నారు…ఇట్టి కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు జాంగిర్ సురే జాంగిర్ ఖురేషి ముత్తిరామ్ బాసిద్ అక్రమ్ తదితరులు ఉన్నారు,

ప్రతి డ్రైవర్ కు ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం…

ప్రతి డ్రైవర్ కు ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం

మాట నిలబెట్టుకున్న సొంటి రెడ్డి

#నెక్కొండ, నేటి ధాత్రి:

క్కొండ మండల కేంద్రంలోని నవత ఆటో యూనియన్ సభ్యులందరికీ తన సొంత ఖర్చులతో ఉచితంగా ప్రమాద బీమా చేపిస్తానన్న మాట ప్రకారం. 160 మంది డ్రైవర్లకు సంవత్సరం పాటు ఉచితంగా ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయల బీమా ఇన్సూరెన్స్ చేపించిన టిపిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి. బుధవారం మండల కేంద్రంలోని తహసిల్దార్ సెంటర్లో నవత ఆటో యూనియన్ అధ్యక్షుడు మోడెం సురేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఇన్సూరెన్స్ భీమ పత్రాలను నవత ఆటో యూనియన్ డ్రైవర్లకు అందించిన సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, ఈ సందర్భంగా సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ఒక సంవత్సరమే కాకుండా ఐదు సంవత్సరాలు కంటిన్యూగా ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ పాలసీ బీమా అందరికీ చెల్లిస్తానని ఇంకా ఎవరైనా డ్రైవర్లు ఉంటే వాళ్ల పేర్లు కూడా పంపించాలని ప్రతి ఒక్క డ్రైవర్ కు ఇన్సూరెన్స్ చాలా ముఖ్యమని యూనియన్ బాధ్యులకు తెలిపారు. డ్రైవర్ల అందరూ ప్రభుత్వానికి పరోక్షంగా సేవ చేస్తున్నారని, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుటలో డ్రైవర్ల పాత్ర కీలకమని, వీరి కుటుంబాలు వీరిపై ఆధారపడి ఉన్నాయని, ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే ఎవరో ఏదో సహాయం చేస్తారని ఎదురు చూడకుండా చట్టప్రకారం ఇన్సూరెన్స్ చేసి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని పొందే అవకాశం ప్రభుత్వం కల్పించిందని, ఇలాంటి ఇన్సూరెన్స్ లను వినియోగించుకోవాలని డ్రైవర్లకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి కి చిరు సన్మానం చేశారు .కార్యక్రమంలో నవత ఆటో యూనియన్ అధ్యక్షుడు మోడెం సురేష్, శ్రీరంగం శ్రీనివాస్, ఉల్లేరావు ప్రభాకర్, పెండ్యాల రాజు, బద్రు నాయక్, మోడెం రాజు, మహమ్మద్ అమీర్, నవత ఆటో యూనియన్ డ్రైవర్లు, తదితరులు పాల్గొన్నారు.

కోట గుళ్ళ లో ప్రొఫెసర్ దంపతుల పూజలు…

కోట గుళ్ళ లో ప్రొఫెసర్ దంపతుల పూజలు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళా క్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో బుధవారం జగిత్యాల వైద్య కళాశాల ప్రొఫెసర్ కోడూరు నవీన్ కుమార్ సుమతి దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

ఫిట్‌నెస్ హబ్(జిమ్)సెంటర్ ని ప్రారంభించిన…

ఫిట్‌నెస్ హబ్(జిమ్)సెంటర్ ని ప్రారంభించిన

◆:-తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

◆:- రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ టౌన్ : పట్టణంలోని సిద్ది హోటల్ ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఫిట్‌నెస్ హబ్(జిమ్)సెంటర్ ని తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి ప్రారంభించారు.అనంతరం జిమ్ సెంటర్ యజమానులు మోహీన్,తైసీన్ వారిని ఘనంగా సన్మానించారు.ఈకార్యక్రమంలో సిడిసి చైర్మన్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-29T135842.230.wav?_=4

 

దేవి నవరాత్రి ఉత్సవ కమిటీ&భవాని భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న

◆:-తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

◆:- -కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ టౌన్ పట్టణంలోని భవానీ మాత దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవ కమిటీ&భవాని భజన మండలి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి పాల్గొన్నారు.వారిని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.అనంతరం దేవి నవరాత్రి ఉత్సవ కమిటీ&భవాని భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన చివరి రోజు భజన పోటీలను వీక్షించి భజన పోటీలో నెగ్గిన వారికి బహుమతులు ప్రధానం చేశారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,ఆలయ కమిటీ సభ్యులు,భజన భక్తులు పాల్గొన్నారు.

భూపాలపల్లి జిల్లా నుండి హజ్ యాత్రకు నలుగురి ఎంపిక..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-29T135245.590.wav?_=5

 

భూపాలపల్లి జిల్లా నుండి హజ్ యాత్రకు నలుగురి ఎంపిక

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్లేందుకు
ఖదీర్ అహ్మద్ – గౌసియా బేగం హనీఫ్ – అమీన బేగం భూపాలపల్లి జిల్లా నుండి ఎంపికైనారు తెలంగాణ హజ్ కమిటీ వరంగల్ జిల్లా అధ్యక్షులు సర్వర్ మోహియోద్దీన్ మొహమ్మద్ మోహియుద్దిన్ సెలెక్ట్ పత్రాలను, మార్గదర్శక బుక్కును అందించడం జరిగింది
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు మొహమ్మద్ ఇర్ఫాన్ జామ మస్జిద్ అబ్బాసియ మజీద్ కమిటీ ఉపాధ్యక్షులు అబ్దుల్ హఫీజ్ మజీద్ మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ సాబీర్ ఖాన్ సయ్యద్ నజీబ్ షాహిద్, నదీమ్ రహీం తదితరులు హజ్ యాత్రకు జిల్లా నుండి సెలెక్ట్ అయిన శుభ సందర్భంగా వారికి పుష్పమాలతో సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది
హజ్ యాత్ర యొక్క మరగదర్శకను అందజేసి వారికి ముందస్తు అభినందనలు తెలిపినారు

సిరిసిల్ల జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎం.హరిత…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-29T130410.862.wav?_=6

 

సిరిసిల్ల జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎం.హరిత

శుభాకాంక్షలు తెలిపిన అదనపు కలెక్టర్, జిల్లా అధికారులు

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా ఎం హరిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా సమీకృత కార్యాలయానికి రాగా, అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన ఛాంబర్ లో కలెక్టర్ ఎం హరిత బాధ్యతలు స్వీకరించారు.

అనంతరం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు పుష్పగుచ్చం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, అధికారులు, సిబ్బంది కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో ఏ.ఓ రాంరెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రిజర్వేషన్ ఖరారుతో పల్లెల్లో ఎన్నికల సందడి..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-29T125441.448.wav?_=7

 

స్థానిక సంస్థ ఎన్నికల రిజర్వేషన్ ఖరారుతో.. పల్లెలో సాగుతున్న ఆప్యాయత పలకరింపులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం స్థానిక ఎన్నికల రిజర్వేషన్ ఖరారుతో
నోటిఫికేషన్ విడుదల కంటే ముందే పల్లెలో నెలకొంటున్న ఎన్నికల వాతావరణ సందడి, సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలో 33 సర్పంచ్ స్థానాల రిజర్వేషన్, 13 ఎంపీటీసీ స్థానాలకు 4 ఎస్సి,6 బీసీ 3 జనరల్ గా ఖరారు చేయగా ఎంపీపీ బీసీ మహిళకు కేటాయించారు. జడ్పీటిసి బీసీ జనరల్ ఖరారు చేసినట్లు చేయడంతో ఎప్పుడెప్పుడా ఆశావహులు ఎగిరి గంతేశారు. అని అధికారులు స్పష్టం ఎదురుచూస్తున్న పల్లెలో మొదలైన ఏం తమ్మి, ఏం అన్న అంత కుశలమేనా ఇంట్లో అందరూ ఎట్లున్నారు ఊరికి సరిగ్గా దర్శనిమిచ్చుడే లేదు అప్పుడప్పుడు ఊరికి రావాలి అందరూ వస్తు పోతూ ఉంటేనే బాగుంటుంది.. రా చాయి తాగుదాం అంటు పలకరిస్తూ జీవనాధారం కొరకు పట్నంలో ఉంటూ పండగకు వచ్చిన ప్రజలకు, మర్యాదలు కురిపిస్తున్నారు.ఇక గ్రామాల్లోనే ఉన్న ప్రజలకు ఫోన్లు చేసి మరి కనిపిస్తాలేవు ప్రొద్దున నుంచి అంటూ ఫోన్లో సంభాషణలు చేస్తున్నారు..ఇది ఇలా ఉండగా ఇన్నాళ్లు ఎదురుచూసిన ఆశావాహుల్లో రిజర్వేషన్ అనుకూలంగా లేకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.. మొత్తానికి ఝరాసంగం మండలంలో స్థానిక సంస్థ ఎన్నికల రిజర్వేషన్ తో పల్లెలో ఎన్నికల వాతావరణ సందడి నెలకొంది.. ఇరుపార్టీల నాయకులు పోటీలో నెగ్గేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

గ్రామాల్లో కొత్త రాజకీయ ట్రెండ్.. కార్యకర్తలకు హెచ్చరికలు

పార్టీ కోసం కష్టపడని వారు, పార్టీకి కష్టకాలంలో తోడుగా నిలవని వారు ఇప్పుడు సర్పంచ్, ఎంపీటీసీ వంటి స్థానాలకు పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇలాంటి వారు కార్యకర్తలను పట్టించుకోకుండా, పార్టీ పేరుతో తమ పెత్తనం చూపాలని ప్రయత్నిస్తున్నారని గ్రామస్థాయిలో చర్చ నడుస్తోంది.కార్యకర్తలు మరియు ప్రజలు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, వీరిని ప్రోత్సహించడం అంటే మనకే మనం నష్టం చేసుకోవడం అవుతుందని సూచనలు వెలువడుతున్నాయి. పార్టీ బలోపేతం కోసం కష్టపడ్డ నిజమైన కార్యకర్తలకే ప్రజల మద్దతు లభించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ఎం. హరిత…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-29T121919.981.wav?_=8

 

 

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ఎం. హరిత

– శుభాకాంక్షలు తెలిపిన అదనపు కలెక్టర్, జిల్లా అధికారులు

సిరిసిల్ల(నేటి ధాత్రి):

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా ఎం. హరిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా సమీకృత కార్యాలయానికి రాగా, అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన ఛాంబర్ లో కలెక్టర్ ఎం హరిత బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు పుష్పగుచ్చం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, అధికారులు, సిబ్బంది కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
కార్యక్రమంలో ఏఓ రాంరెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ ఛాయాచిత్రం అవార్డు గ్రహీత పంతకానీరాజుకు సన్మానం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-29T121419.576.wav?_=9

 

ఉత్తమ ఛాయాచిత్రం అవార్డు గ్రహీత పంతకానీరాజుకు సన్మానం

మహాదేవపూర్ సెప్టెంబర్ 29 నేటి ధాత్రి *

తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ శిల్పరామంలో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భంగా ఉత్తమ ఛాయాచిత్రం అవార్డు అందుకున్న మహాదేపూర్ గ్రామవాసి వర్తమాన ఫోటోగ్రాఫర్ అంతకాని రాజుని జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ కోట రాజబాబు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కటకం అశోక్ సన్మానించారు పర్యాటక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు చేతులమీదుగా రాజు ఈ అవార్డును అందుకున్నారు రాష్ట్ర చరిత్ర సాంస్కృతి పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకోవాలని ఆసక్తిని పెంచే విధంగా ఛాయాచిత్రాలు తీయడం గొప్ప విషయమని వారు కొనియాడారు

నూతన తహసీల్దార్ గా భాద్యతలు స్వీకరణ…

నూతన తహసీల్దార్ గా భాద్యతలు స్వీకరణ

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

గుండాల మండల నూతన తహసీల్దార్ గా ఖాసీం బుధవారం బాధ్యతలను స్వీకరించారు . నూతన తహసీల్దార్ ఖాసీం ను తహసీల్దార్ ఆఫీస్ స్థాఫ్ సన్మానించి, స్వాగతం పలికారు.

వర్ధన్నపేటలో తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ నేతలకు సన్మానం..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అద్యక్షులు & రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం

వర్దన్నపేట( నేటిధాత్రి):

 

 

భూపాలపల్లి జిల్లా పర్యటనకు వెళ్ళుతుండగా హనుమకొండ జిల్లా, దేవన్నపేట టోల్ ప్లాజా వద్ద వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పోషాల వెంకన్నగౌడ్,ఎస్సీ సెల్ వర్ధన్నపేట మండల అధికార ప్రతినిధి కందిక ఎల్లస్వామి గార్లు తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి ప్రీతీమ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించడం జరిగింది.

దండు రమేష్ కు రాష్ట్ర ఈ జీ సి కౌన్సిలర్ గా సన్మానం

దండు రమేష్ కు రాష్ట్ర ఈ
జీ సి కౌన్సిలర్ గా సన్మానం

గణపురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరు ముళ్ళ ఎల్ల స్వామి

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరు ముళ్ళ ఎల్ల స్వామి మాట్లాడుతూ బుధవారం రోజు జయశంకర్ భూపాలపల్లి భారత్ ఫక్షన్ హాల్ లో జరిగే దండు రమేష్ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర ఈ. జి.సి. కౌన్సిల్ మెంబర్ గా నియమించిన సంధర్బంగా “సన్మాన మహోత్సవ” కార్యక్రమానికి
ముఖ్య ఆతిథులుగా విచ్చేస్తున్న దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాశనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు, నాగరిగారి ప్రీతం తెలంగాణ రాష్ట్ర ఎస్.సి.కార్పొరేషన్ చైర్మన్,గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి శాసనసభ్యులు, అయిత ప్రకాష్ రెడ్డి , రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ కావున ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కుటుంభ సభ్యులు అందరూ హాజరై విజయవంతం చేయవలసిందిగా మనవి

ఏ వై ఎస్ ఆధ్వర్యంలో ఇన్చార్జి ఎపిఎం కు ఘన సన్మానం…

ఏ వై ఎస్ ఆధ్వర్యంలో ఇన్చార్జి ఎపిఎం కు ఘన సన్మానం.

చిట్యాల,నేటిధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో వెలుగు మహిళా సమైక్య ఏపిఎం ఇన్చార్జి గా గుర్రపు రాజేందర్ బాధ్యతలు చేపట్టినందున అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు జన్నే యుగేందర్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య* అన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ… రాజేందర్ వెలుగు మహిళ సమైక్య లో సీసీగా పనిచేస్తూ ఇన్చార్జి ఏపిఎం గా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందని అంబేద్కర్ యువజన సంఘం తరపున రాజేందర్ కు శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సక్రమంగా నిర్వహించాలని అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు గోల్కొండ సురేష్ అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రచార కార్యదర్శి కట్కూరి రాజు పుల్యాల సురేష్ ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కోశాధికారి శీలపాక నాగరాజు అంబేద్కర్ వాదులు పుల్ల ప్రభాకర్ జీడి సురేష్ భాస్కర్ మైదం మహేష్ గుర్రం తిరుపతి పాముకుంట్ల చందర్ తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ శ్యామ్ రావు, సంగమేశ్వర్ లకు ఘన సన్మానం….

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-23T142316.809.wav?_=10

 

ఎంపీ శ్యామ్ రావు, సంగమేశ్వర్ లకు ఘన సన్మానం

జహీరాబాద్ నేటి ధాత్రి;

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో స్థానిక సిద్దేశ్వర మందిరంలో మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం అనంతరం, నూతనంగా ఎన్నికైన ఉమ్మడి మెదక్ జిల్లా సమన్వయకర్త ఎంపీ శ్యామ్ రావు, జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన ఎంపల్లి సంగమేశ్వర్ ను శివశక్తి అధ్యక్షులు సంగమేశ్వర్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షులు ఎం. సంగమేశ్వర్, ఉపాధ్యక్షులు ఎస్. వెంకటేశం, ప్రధాన కార్యదర్శులు రాజకుమార్, నాగరాజు, గోరఖ్నాథ్ రావు, కోశాధికారి అంబన్న, సలహాదారు నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.

రాజేందర్ కు ఉత్తమ మండల అధ్యక్షుడిగా సన్మానం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-22T130032.005.wav?_=11

 

రాజేందర్ కు ఉత్తమ మండల అధ్యక్షుడిగా సన్మానం

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం 49వ వార్షికోత్సవం ఉమ్మడి వరంగల్ జిల్లా
తేదీ 21/09/2025 రోజున ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ మాంకాల యాదగిరి అధ్యక్షతన ముఖ్యఅతిథిగా డాక్టర్ మధు పాక ఎల్లయ్య రాగా ప్రపంచ మేధావి భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి జై భీమ్ నినాదాలతో నీలిరంగు జెండాను ఎగురవేసి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వరకు భారీ ర్యాలీ తీసి ఘనంగా నిర్వహించడం జరిగింది అంబేద్కర్ ఆశయ సాధనకు పే బ్యాక్ ది సొసైటీ నినాదంతో అంబేద్కర్ వాదాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లి రాజ్యాంగంలో రాసిన హక్కులను రిజర్వేషన్లను మహిళా హక్కులను కార్మిక ఉద్యోగ హక్కులను తెలుపుతూ అంబేద్కర్ సంఘాలను అంబేద్కర్ వాదానికి కృషి చేస్తున్న జయశంకర్ భూపాలపల్లి గణపురం మండలం అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ శాలువాతో సన్మానించి ఉత్తమ మండల అధ్యక్షుడిగా ప్రశంస పత్రాన్ని అందించడం జరిగింది రాజేందర్ మాట్లాడుతూ నాకు ఈ అవార్డు అందించిన రాష్ట్ర నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బొమ్మల అంబేద్కర్ సలహాదారులు డీబీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రైతు రమేష్ కుమార్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య సీనియర్ నాయకులు కొమ్ముల సురేందర్ పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version