స్థానిక సంస్థ ఎన్నికల రిజర్వేషన్ ఖరారుతో.. పల్లెలో సాగుతున్న ఆప్యాయత పలకరింపులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం స్థానిక ఎన్నికల రిజర్వేషన్ ఖరారుతో
నోటిఫికేషన్ విడుదల కంటే ముందే పల్లెలో నెలకొంటున్న ఎన్నికల వాతావరణ సందడి, సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలో 33 సర్పంచ్ స్థానాల రిజర్వేషన్, 13 ఎంపీటీసీ స్థానాలకు 4 ఎస్సి,6 బీసీ 3 జనరల్ గా ఖరారు చేయగా ఎంపీపీ బీసీ మహిళకు కేటాయించారు. జడ్పీటిసి బీసీ జనరల్ ఖరారు చేసినట్లు చేయడంతో ఎప్పుడెప్పుడా ఆశావహులు ఎగిరి గంతేశారు. అని అధికారులు స్పష్టం ఎదురుచూస్తున్న పల్లెలో మొదలైన ఏం తమ్మి, ఏం అన్న అంత కుశలమేనా ఇంట్లో అందరూ ఎట్లున్నారు ఊరికి సరిగ్గా దర్శనిమిచ్చుడే లేదు అప్పుడప్పుడు ఊరికి రావాలి అందరూ వస్తు పోతూ ఉంటేనే బాగుంటుంది.. రా చాయి తాగుదాం అంటు పలకరిస్తూ జీవనాధారం కొరకు పట్నంలో ఉంటూ పండగకు వచ్చిన ప్రజలకు, మర్యాదలు కురిపిస్తున్నారు.ఇక గ్రామాల్లోనే ఉన్న ప్రజలకు ఫోన్లు చేసి మరి కనిపిస్తాలేవు ప్రొద్దున నుంచి అంటూ ఫోన్లో సంభాషణలు చేస్తున్నారు..ఇది ఇలా ఉండగా ఇన్నాళ్లు ఎదురుచూసిన ఆశావాహుల్లో రిజర్వేషన్ అనుకూలంగా లేకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.. మొత్తానికి ఝరాసంగం మండలంలో స్థానిక సంస్థ ఎన్నికల రిజర్వేషన్ తో పల్లెలో ఎన్నికల వాతావరణ సందడి నెలకొంది.. ఇరుపార్టీల నాయకులు పోటీలో నెగ్గేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
గ్రామాల్లో కొత్త రాజకీయ ట్రెండ్.. కార్యకర్తలకు హెచ్చరికలు
పార్టీ కోసం కష్టపడని వారు, పార్టీకి కష్టకాలంలో తోడుగా నిలవని వారు ఇప్పుడు సర్పంచ్, ఎంపీటీసీ వంటి స్థానాలకు పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇలాంటి వారు కార్యకర్తలను పట్టించుకోకుండా, పార్టీ పేరుతో తమ పెత్తనం చూపాలని ప్రయత్నిస్తున్నారని గ్రామస్థాయిలో చర్చ నడుస్తోంది.కార్యకర్తలు మరియు ప్రజలు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, వీరిని ప్రోత్సహించడం అంటే మనకే మనం నష్టం చేసుకోవడం అవుతుందని సూచనలు వెలువడుతున్నాయి. పార్టీ బలోపేతం కోసం కష్టపడ్డ నిజమైన కార్యకర్తలకే ప్రజల మద్దతు లభించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.