కోట గుళ్ళ లో ప్రొఫెసర్ దంపతుల పూజలు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళా క్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో బుధవారం జగిత్యాల వైద్య కళాశాల ప్రొఫెసర్ కోడూరు నవీన్ కుమార్ సుమతి దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు.