ఎంపీ శ్యామ్ రావు, సంగమేశ్వర్ లకు ఘన సన్మానం
జహీరాబాద్ నేటి ధాత్రి;
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో స్థానిక సిద్దేశ్వర మందిరంలో మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం అనంతరం, నూతనంగా ఎన్నికైన ఉమ్మడి మెదక్ జిల్లా సమన్వయకర్త ఎంపీ శ్యామ్ రావు, జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన ఎంపల్లి సంగమేశ్వర్ ను శివశక్తి అధ్యక్షులు సంగమేశ్వర్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షులు ఎం. సంగమేశ్వర్, ఉపాధ్యక్షులు ఎస్. వెంకటేశం, ప్రధాన కార్యదర్శులు రాజకుమార్, నాగరాజు, గోరఖ్నాథ్ రావు, కోశాధికారి అంబన్న, సలహాదారు నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
