రాజేందర్ కు ఉత్తమ మండల అధ్యక్షుడిగా సన్మానం
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం 49వ వార్షికోత్సవం ఉమ్మడి వరంగల్ జిల్లా
తేదీ 21/09/2025 రోజున ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ మాంకాల యాదగిరి అధ్యక్షతన ముఖ్యఅతిథిగా డాక్టర్ మధు పాక ఎల్లయ్య రాగా ప్రపంచ మేధావి భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి జై భీమ్ నినాదాలతో నీలిరంగు జెండాను ఎగురవేసి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వరకు భారీ ర్యాలీ తీసి ఘనంగా నిర్వహించడం జరిగింది అంబేద్కర్ ఆశయ సాధనకు పే బ్యాక్ ది సొసైటీ నినాదంతో అంబేద్కర్ వాదాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లి రాజ్యాంగంలో రాసిన హక్కులను రిజర్వేషన్లను మహిళా హక్కులను కార్మిక ఉద్యోగ హక్కులను తెలుపుతూ అంబేద్కర్ సంఘాలను అంబేద్కర్ వాదానికి కృషి చేస్తున్న జయశంకర్ భూపాలపల్లి గణపురం మండలం అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ శాలువాతో సన్మానించి ఉత్తమ మండల అధ్యక్షుడిగా ప్రశంస పత్రాన్ని అందించడం జరిగింది రాజేందర్ మాట్లాడుతూ నాకు ఈ అవార్డు అందించిన రాష్ట్ర నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బొమ్మల అంబేద్కర్ సలహాదారులు డీబీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రైతు రమేష్ కుమార్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య సీనియర్ నాయకులు కొమ్ముల సురేందర్ పాల్గొన్నారు