వివాహా వేడుకల్లో పాల్గొన్న టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్విర్..
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలో ఝరాసంగం మండల కేంద్రమైన శ్రీ కేతకి సంగమేశ్వర దేవస్థానం సమీపంలోని వేసవి కళ్యాణ మండపంలో బొగ్గుల జగదీశ్వర్ తాజా మాజీ సర్పంచ్ మేనత్త కూతురు మేదపల్లి గ్రామం బి.సంగమేశ్వర్ కుమార్తె వివాహ కార్యక్రమం ఆహ్వాన మేరకు టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్విర్ వివాహ కార్యక్రమంలో హాజరై వధూవరుడుని ఆశీర్వదించారు వారితో పాటు బిజీ సందీప్ బాల్ రెడ్డి నాగేశ్వర్ సజ్జన్ సద్దాం హుస్సేన్ సాగర్ పటేల్ బాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు,
◆:- తెలంగాణ రాష్ట్ర సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం కోసం కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి విజయం సాధించిన తర్వాత మొదటి సారి జహీరాబాద్ విచ్చేసిన సందర్భంగా జహీరాబాద్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా తెలంగాణ రాష్ట్ర సెట్విన్ చైర్మన్ ఎన్ గిరిధర్ రెడ్డి కలిసి శాలువా పులమలలతో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు ముల్తాన్,సిడిసి చైర్మన్ ముబీన్ జహీరాబాద్ మండల అధ్యక్షులు నర్సింహారెడ్డి యువ నాయకులు నాగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి నవాజ్ రెడ్డి, అభిలాష్ రెడ్డి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు,
◆:- మండల ప్రజలకు 14 సంవత్సరాలు సేవలందించిన హోంగార్డ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా 14 సంవత్సరాలుగా పనిచేసి సంగారెడ్డి బదిలీపై వెళ్తున్న సత్యనారాయణ, పోలీస్టేషన్ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థాన ఆలయ ధర్మకర్తలు పూజారులు శాలువా పూలమాలతో సత్కరించి సంగమేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందితో కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించరు. అనంతరం ఝరాసంగం ఎస్సై క్రాంతికుమార్ పటేల్ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం అనేది అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకంటే చాలా కీలకమైనదన్నారు. ఇంతకాలం ఇక్కడ చాలా క్రమశిక్షణ పట్టుదలతో పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించడం మన స్టేషన్కి గర్వకారణమని ఇప్పుడు వెళ్లే చోట కూడా ఇంతకన్నా రెట్టింపు పెరు తెచ్చుకోవాలని సూచించారు.
ఏఐసిసి కార్యదర్శిగా నియమితులైన జెట్టి.కుసుమకుమార్ ను సన్మానించిన
◆:- తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ నవంబర్ (13) ఏఐసీసీ కార్యదర్శిగా ఒడిశా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జిగా నియమితులైన జెట్టి, కుసమకుమార్ వారి నివాసంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్, గిరిధర్ రెడ్డి వారితో పాటు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి పాల్గొన్నారు.
నూతన వధువరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్,ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
హైదరాబాద్ ఆనందా కన్వెన్షన్ లో జరిగిన మాజి మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ సోదరుడు గంగుల సుధాకర్ కుమారుడి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన సంగారెడ్డి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శాసనసభ్యులు చింతా ప్రభాకర్ జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు
ఉమ్రా యాత్ర కు వెళుతున్న మహ్మద్ షౌకత్ అలీ కి ఘన సన్మానం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండల కేంద్రమైన ఝరాసంగం కు చెందిన మహమ్మద్ షౌకత్ అలీ కి ఉమ్రా యాత్ర కు వెళుతున్న శుభ సందర్భంగా ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన ఝరాసంగం గ్రామ పెద్దలు మాజీ ఎంపిపి హన్మంత్ రావు పాటిల్ మాజీ సర్పంచ్ రుద్రప్ప పాటిల్, డాక్టర్ రామయ్య నాయకులు ఆశ్రసఫ్ అలీ,లియకత్, ఏజాజ్ బాబా, నాగన్న పటేల్, రాజేందర్ సింగ్ నాగన్న, పెంటయ్య సంగన్న రాయికోటి నర్సిములు, హన్మంత్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఇస్మాయిల్, పాఖుర్, కృష్ణ ఖ్యాయుమ్, అంజాద్, మహేష్, ఆన్సర్, నాసర్, వారితోపాటు మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు,
షౌకత్ అలీ మరియు ఆయన కుమారుడు జాకీర్ మియా సౌదీ అరేబియాలోని. ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే ఉమ్రా యాత్ర కు బయలుదేరడం జరిగింది.ఈ సందర్భంగా వాళ్ళని సన్మానించిన రేజింతల్ గ్రామ కాంగ్రెస్ సినియర్ నాయకులు మహమూద్ మియా అహ్మద్మియా ముంతాని ఇతరులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం షౌకత్ అలీ ఏర్పాటు చేసిన విందు లో పాల్గొన్నారు.
రుద్రగూడెం గ్రామ బిఆర్ఎస్ నాయకుడు అంబరగొండ సుమలత-రాజు దంపతుల కుమార్తె మనిషా-అజిత్ వివాహ వేడుక గిర్ని బావి ఫంక్షన్ హాల్ లో జరగగా వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ ,మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఉడుగుల ప్రవీణ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ (సిడిసిఏ) కార్యదర్శి సతీష్ యాదవ్ ను తిరుపతి యాదవ నాయకులు ఘనంగా సన్మానించారు. శ్రీమాన్ సన్నిధి శరభయ్య యాదవ్ విగ్రహ స్థాపన సమావేశంకు సతీష్ యాదవ్ ను గౌరవంగా ఆహ్వానించారుఈ సందర్భంగా తిరుపతి యాదవ నాయకులు, బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్, పలువురు యాదవ నాయకులతో కలిసి సిడిసిఏ కార్యదర్శి సతీష్ యాదవ్ కు పుష్పగుచ్చం అందజేసి దుశ్యాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు
-అద్భుతంగా నటించి.. సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చిన రమేష్ ను శాలువాతో ఘనంగా సత్కరిస్తున్న మిట్టపల్లి బృందం
-నేనే సర్పంచ్ లఘు చిత్రం డైరెక్టర్ ను అభినందిస్తున్న పాటల రచయితలు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
సమాజంలో ప్రస్తుతం సర్పంచ్ పాత్ర ఏ విధంగా ఉంటుంది..ఏ విధంగా ఉండాలనేది ప్రజలకు చూపించాలనే లఘు చిత్రమే నేనే సర్పంచ్ ఈ చిత్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన క్యాతరాజు రమేష్ నటించి..సమాజానికి మంచి సందేశాన్ని అందించడంతో..మిట్టపల్లి మిత్ర మండలి వ్యవస్థాపక అధ్యక్షులు పుల్ల సతీష్ కుమార్ మంగళవారం మొగుళ్లపల్లి-ముల్కలపల్లి గ్రామాల మధ్యన గల శ్రీ సమ్మక్క-సారలమ్మ దేవాలయ ప్రాంగణంలో క్యాతరాజు రమేష్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం సమాజంలో ప్రజల ఓటు విలువను ప్రజలకు తెలియజేస్తూ..ప్రజలకు సర్పంచ్ ఏ విధంగా పనులు చేయాలి..ప్రజలు ఏ విధంగా సర్పంచ్ తో పనులు చేయించుకోవాలి. ప్రజలకు అధికారులు ఏ విధంగా జవాబుదారితనంగా ఉండాలో పూసగుచ్చినట్లు ఈ లఘు చిత్రాన్ని చిత్రీకరించారు. దీంతో పలువురు వారిని అభినందించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మంగళపల్లి సుదర్శన్ ను అభినందిస్తూ..ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. పలువురి ప్రశంసలు పొందిన నేనే సర్పంచ్ అనే లఘు చిత్రంతో పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా లఘు చిత్రాలు మరెన్నో తీయాలని మంగళపల్లి సుదర్శన్ ను కోరినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాటల రచయితలు కల్లపెల్లి సతీష్, శ్రీపతి రాము, గాయకులు కాసర్ల రాజేష్, డప్పు సత్తి తదితరులు పాల్గొన్నారు.
ఎంపీడీవోను మర్యాదపూర్వకంగా కలిసిన పిఆర్టియు ఎస్ సభ్యులు.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
నల్లబెల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ జె శుభ నివాస్ ను మండల పిఆర్టియు టీఎస్ అధ్యక్షుడు ఉడుత రాజేందర్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎంపీడీవోను శాలువాతో సన్మానం చేసి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బానోతు కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పురం బద్రీనాథ్, రవీందర్, జిల్లా కార్యదర్శి శనిగరం శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షుడు కందకట్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్ నియోజకవర్గ న్యాల్కల్ మండల్ నూతన ఎంపిడిఓ షగుఫ్తా ఇఫ్తాత్ బాధ్యతలు సోమవారం స్వీకరించారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆమెకు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేసిన అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో కార్యాలయం సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
బి ఫార్మసీ పూర్తి చేసినందుకు సన్మానం చేసిన కళాశాల బృందం
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి పట్టణానికి చెందిన ఎల్ చంద్రశేఖర్ సరిత కూతురు ఎల్ సౌమ్యకు హైదరాబాద్ నారపల్లి లో కళాశాల ప్రిన్సిపల్ బృందం బి ఫార్మసీ పూర్తి చేసినందుకు సన్మామనము చేశారని అదేవిధంగా సర్టిఫికెట్ కూడా అందజేశారని చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు . ఈ మేరకు నల్ల నరసింహారెడ్డి యజమాన్యానికి కళాశాల ప్రిన్సిపల్ కృష్ణ మోహన్ కు అధ్యాపక బృందానికి ఎల్ సౌమ్య ఆమె తల్లిదండ్రులు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి మంచి ర్యాంకులు సాధించాలని ప్రిన్సిపల్ కృష్ణమోహన్ ఆకాంక్షించారు
తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ & కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నగరాగారి ప్రీతీమ్ గారు ఇటీవల *అల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం నేషనల్ కో ఆర్డినేటర్ గా నియమితులైన శుభసందర్భంగా ఈ రోజు హైదరాబాద్ లోని వారి స్వ గృహములో కాంగ్రెస్ పార్టీ ఎస్సి విభాగం రాష్ట్ర నాయకులు & వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య గారు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చమందించి శాలువాతో సన్మానించి హృదయపూర్వక హార్థిక శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమములో వరంగల్ ఉమ్మడి జిల్లాల ఎస్సీ విభాగం ఇంచార్జి దబ్బెట రమేష్ , ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఆర్షం అశోక్ ,ఎస్సీ విభాగం జిల్లా నాయకులు ఆరూరి సాంబయ్య లు పాల్గొనడం జరిగింది.
ఘనంగా యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్ జన్మదిన వేడుకలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల కేంద్రంలో సంగారెడ్డి యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఉదయ్ శంకర్ పార్టీ యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమంతరావు పాటిల్, సంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ ఆలయ చైర్మన్ శేఖర్ పాటిల్, మాజీ ఎంపీటీసీ శంకర్ పాటిల్, మాజీ సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి, నర్సింలు పాటిల్,సంగ్రామ్ పాటిల్,మారుతి పాటిల్, మల్లయ్య స్వామి, కొల్లూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్, బొప్పన్ పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలయ్య మాజీ ఉప సర్పంచ్ అమృత్ శ్రీకాంత్ పాటిల్, సిద్ధు పాటిల్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్, సి ప్రకాష్, సి విజయ్, నర్సింలు, సంజీవులు, ఎం సునీల్, సి అబ్రహం, సోషల్ మీడియా మండల ఇంచార్జి నవీన్ ఆర్.టి.ఐ యాక్ట్ డిస్టిక్ ప్రెసిడెంట్ గోపాల్ నమస్తే ఇందు జహీరాబాద్ ఇంచార్జ్ అఖిల్ తదితరులు పాల్గోని ఉదయ్ శంకర్ పాటిల్ శాలువా పూలమాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు,
ఝరాసంగం మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ యువ నేత యువజన కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అభిమానులు, మిత్రులు, స్నేహితులు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, కులసంఘాలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అధ్వర్యంలో ఉదయ్ శంకర్ పాటిల్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయ్ శంకర్ పాటిల్ కి జన్మదిన శు భాకాంక్షలు తెలుపుతూ శాలువాతో ఘనంగా సన్మానం చేసి కేక్ కట్ చేపించి, తినిపించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమములో ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమంతరావు పాటిల్, ఆలయ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, సీనియర్ నాయకులు రాచయ్య స్వామి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్, మాజీ ఎంపిటిసి శంకర్ పాటిల్, నాయకులు వేణుగోపాల్ రెడ్డి, నర్సింలు పాటిల్, సంగ్రామ్ పాటిల్, మారుతి పాటిల్, మల్లయ్య స్వామి, కొల్లూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్, శ్రీకాంత్ పాటిల్, సిద్ధు పాటిల్, శ్రీనివాసరెడ్డి, కొల్లూరు వార్డు సభ్యులు ఎం విష్ణు, వై నగేష్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్, సి ప్రకాష్, నీ విజయ్, నర్సింలు, సంజీవులు, ఎం సునీల్, సి అబ్రహం, మహమ్మద్ ఫక్రుద్దీన్ మహమ్మద్ మోలా మహమ్మద్ సాహెబ్ బుడగ జంగం గోపాల్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
“నిహాంత్” పెళ్లి వేడుకకు హజరై వదూవరులను దీవించండి.
“సిఎం రేవంత్ రెడ్డి”ని కలిసి శుభలేఖ అందజేసిన “సుభాష్ రెడ్డి”.
వివాహానికి తప్పకుండా హజరై వదూవరులను ఆశీర్వదించాలని విజ్ఞప్తి.
తన కుమారుడు “నిహాంత్” పెళ్ళి శుభలేఖ “సిఎం”కు అందజేసిన “సుబాష్ రెడ్డి”.
“నేటిధాత్రి”,హైదరాబాద్. మా అబ్బాయి నిహాంత్ పెళ్లికి రండి. వచ్చి మీ అమూల్యమైన ఆశీర్వనాలు అందించి దీవించండి. ప్రముఖ పారిశ్రామిక, రియల్ వ్యాపారి, మానవతా వాది, సామాజిక వేత్త తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవారం కలిశారు. నవంబర్ 7 న తేదీన సుభాష్ రెడ్డి కుమారుడు నిహంత్ పెళ్లి వేడుక జరగనున్నది.
CM Revanth invited to Nihant’s wedding
తన కుమారుడి పెళ్ళికి హజరై నూతన వదూవరులను ఆశీర్వదించాలని కోరుతూ పెళ్ళి శుభలేఖను సిఎం. రేవంత్ రెడ్డికి అందించి సుబాష్ రెడ్డి ఆహ్వానం పలికారు.
మండలంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గా పూర్తి బాధ్యతలు స్వీకరించిన రామ.రామకృష్ణ ని శాలువాతో స్వాగతం పలికి అంబేద్కర్ చిత్ర పటాన్ని బహుకరించి శుభాకాంక్షలు తెలిపిన కార్యాలయ సిబ్బంది. ఈ కార్యక్రమంలో ఏఈ ఉదయ్ కుమార్,సీనియర్ అసిస్టెంట్ సరోజన ఈసి రజినీకాంత్,పంచాయతీ కార్యదర్శులు నాగరాజు, నర్సింగం,టిఎ లు కుసుమ, స్వప్న,రాధిక ఫీల్డ్ అసిస్టెంట్ నీరటి రాములు,మరియు కార్యాలయ సహాయకులు గోవింద్ నవీన్ కుమార్, దొంతుల రాజేందర్, కంప్యూటర్ ఆపరేటర్ ప్రకాష్, సాగర్,అభిరామ్,సాయి కృష్ణ,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎన్నికైన విద్యార్థికి స్వర్ణకార చేతివృత్తుల సంఘం ఘనసన్మానం. మల్లాపూర్ అక్టోబర్ 14 నేటి ధాత్రి
మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన సార రుత్విక్ జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనందున మల్లాపూర్ స్వర్ణకార చేతివృత్తుల సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో స్వర్ణకార సంఘం అధ్యక్షుడు బెజ్జారపు గంగాధర్ మాట్లాడుతూ భవిష్యత్తులో రిత్విక్ అనేక విజయాలు సాధించాలని, అలాగే ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, అలాగే నేటి విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపినారు. ఇట్టి కార్యక్రమంలో జగిత్యాల జిల్లా స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షులు ఎగ్యారపు శ్రీనివాస్, జిల్లా సంయుక్త కార్యదర్శులు తిప్పర్తి కిషన్, సింహరాజు నరేష్, అలాగే సంఘ సభ్యులు తుమ్మనపల్లి శ్రీనివాస్, బెజ్జారపు తిరుపతి, బెజ్జారపు శ్రీనివాస్, కట్ట వీరేంద్ర చారి, గన్నరపు రమేష్, ఎగ్యారపు వెంకటరమణ, ద్రుశెట్టి రాజేష్, దురిశెట్టి శ్రీనివాస్, ఆకోజి వెంకటరమణ అలాగే విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఘనంగా డాక్టర్ ఆరాధన్ రెడ్డి, సరిన్ జాన్ జన్మదిన వేడుకలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్. పట్టణంలోని సిటీ సెంటర్ ఆసుపత్రి ప్రధాన డాక్టర్ ఆరాధన్ రెడ్డి, డైరెక్టర్ సారిన్ జాన్ జన్మదిన వేడుకలు ఆదివారం నాడు సిటీ సెంటర్ ఆసుపత్రిలో పార్లమెంట్ ఇంచార్జ్, ఆసుపత్రి డైరెక్టర్ గంకటి శుక్లవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకల్లో భాగంగా ఇరు డాక్టర్లకు డైరెక్టర్లు శుక్లవర్ధన్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి లు శాలువకప్పి బొకేతో ఘనంగా సన్మానించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఇంచార్జ్ మాట్లాడుతూ తమ జీవితంలో చేసే మంచి కార్యాలు తమను ఉన్నతంగా నిలుపుతాయని, ప్రజల కష్ట నష్టలలో అండగా నిలిచినప్పుడే తమకు పేరు ప్రఖ్యాతలు వస్తాయని అన్నారు. కార్యక్రమంలో డా ఆరాధన్ రెడ్డి, డా సారిన్ జాన్, డైరెక్టర్ లు గంకటి శుక్లవర్ధన్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, పల్లవి స్కూల్ డైరెక్టర్ గంకటి శ్రీధర్ రెడ్డి, మొయిజ్ లష్కరి, మొహమ్మద్ అష్రాఫ్, డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వివాహ వేడుక లో వేడుక లో పాల్గొన్న రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని ఫ్రెండ్స్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో మొగుడంపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ తాజుద్దీన్ గారి కుమార్తె వివాహ వేడుక లో పాల్గొని నూతన వరునికి వివాహ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ వారితోపాటు వెంకట్ రెడ్డి మొహమ్మద్ కుతుబుద్దీన్ మహమ్మద్ తాజోద్దీన్ సుభాష్ సందీప్ తదితరులు ఉన్నారు,
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.