పత్తి పంటను ధ్వంసం చేసిన అడవి పందులు
నష్టపరిహారం చెల్లించాలని అధికారులకు వినతి పత్రం అందించిన రైతులు
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని కొండపేట, నాగంపేట,ఏసన్వయి,ఏడగట్ట, పిన్నారం గ్రామాలలో భారీగా అడవి పందులు పత్తి పంటను నష్టం చేశాయని రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డివై ఎఫ్ఆర్ఓ లావణ్య కి వ్యవసాయ శాఖ అధికారి ఏవో సాయి రెడ్డికి శుక్రవారం వినతిపత్రం అందించారు.పలు గ్రామాల రైతులకు జరిగిన నష్టానికి అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకొని రైతులకు జరిగిన నష్టాన్ని పరిశీలించి వెంటనే తగిన నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ సాంబ గౌడ్,కోటపల్లి మండల సీనియర్ నాయకులు కొట్టే నారాయణ,అజ్మీర, పున్నం,అన్వర్,ఆలీ,పోచం, కొట్రాంగి మల్లేష్,దేవయ్య, రూపా నాయక్,భూమయ్య, రైతులు,బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
