వరంగల్ జిల్లాలో 28 వేల మెట్రిక్ టన్నుల బియ్యం బాకీ.

వరంగల్ జిల్లాలో 28 వేల మెట్రిక్ టన్నుల బియ్యం బాకీ.

ప్రభుత్వానికి చెల్లించింది 50 శాతమే..మిగతా 50 శాతం ధాన్యం మిల్లుల్లో ఉన్నాయా?

గడువు ముగిస్తున్నది….మిల్లుల్లో మిగిలిన ధాన్యం భద్రంగా ఉన్నదా?

ఖరీఫ్ సీజన్ ధాన్యం మిల్లులకు కేటాయించబోతున్న ప్రభుత్వం?

సివిల్ సప్లైస్ అధికారులు…భారీ ఎత్తున రభీ సీజన్ బకాయిలు ఉన్నాయి..గమనిస్తున్నారా?

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

2024-2025 సంవతరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం రబీ సీజన్ లో వరంగల్ జిల్లా రైస్ మిల్లర్లకు 2 లక్షల 6 వేల 702 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కేటాయించింది.ఐతే 2025-2026 సంవత్సరం ఖరీఫ్ సీజన్ కు 2లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా ఇటీవలే జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులు,రైస్ మిల్లర్ల సమావేశంలో ప్రకటించారు.ఈ నేపథ్యంలో గత రబీ సీజన్లో కేటాయించిన 2 లక్షల 6 వేల 702 మెట్రిక్ టన్నుల వరి ధాన్యంలో కేవలం 50 శాతం మాత్రమే రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం రూపంలో అప్పజెప్పారు.సగం మేరకు వరి ధాన్యం రైస్ మిల్లర్ల వద్దనే ఉండడం పట్ల మిగిలిన ధాన్యం రైస్ మిల్లర్ల వద్దనే ఉన్నదా? అనే పలు అనుమానాలకు తావిస్తుంది.రైస్ మిల్లర్లకు వరి ధాన్యం కేటాయించన సమయంలో మాత్రమే మిల్లుల పర్యటనలు చేసిన అధికారులు ఆ తర్వాత అటు వైపు కన్నెత్తి చూడలేదని ఆరోపణలు సైతం విభిపిస్తున్నాయి.

2024-2025 సంవతరం రబీ సీజన్ గాను రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలో 83 రైస్ మిల్లులకు పర్మిషన్లు ఇచ్చింది.అందులో 21 బాయిల్డ్ రైస్ మిల్లులకు 1 లక్షా 12
వేల 310 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించింది.అలాగే 62 రా..రైస్ మిల్లులకు 94 వేల 392 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించింది.మొత్తం 83 రైస్ మిల్లులకు వరంగల్ జిల్లా రైస్ మిల్లర్లకు 2 లక్షల 6 వేల 702 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కేటాయించింది.ఐతే అందులో నుండి
బాయిల్డ్ రైస్ మిల్లర్లు 76 వేల 371 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా 33 వేల 928 మెట్రిక్ టన్నుల బియ్యం 45 శాతం రూపంలో మాత్రమే ప్రభుత్వానికి ముట్టజెప్పారని సివిల్ సప్లైస్ అధికారులు తెలుపుతున్నారు.అలాగే

62 రా రైస్ మిల్లుల నుండి 63 వేల 242 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా 35 వేల 181మెట్రిక్ టన్నుల బియ్యం 55 శాతం రూపంలో మాత్రమే ఇచ్చారని అధికారులు తెలుపుతున్నారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం 83 రైస్ మిల్లుల నుండి 1 లక్షా 39 వేల 613 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా 69 వేల 109 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి ముట్టజెప్పారు.కాగా మరో 70 వేల 431 మెట్రిక్ టన్నుల బియ్యం సుమారు 50 శాతం పైబడి ప్రభుత్వానికి రైస్ మిల్లర్లు బాకీ ఉన్నట్లు జిల్లా సివిల్ సప్లైస్ మేనేజర్ సంధ్యారాణి తెలిపారు.

ప్రభుత్వానికి చెల్లించింది 50 శాతమే..మిగతా 50 శాతం ధాన్యం మిల్లుల్లో ఉన్నాయా?

ఇప్పటి వరకు వరంగల్ జిల్లా నుండి రాష్ట్ర ప్రభుత్వానికి రైస్ మిల్లర్లు ఇవ్వాల్సిన బియ్యం 1 లక్షా 39 వేల 613 మెట్రిక్ టన్నుల గాను 69 వేల 109 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే ప్రభుత్వానికి ముట్టజెప్పారు.కాగా మరో 70 వేల 431 మెట్రిక్ టన్నుల బియ్యం సుమారు 50 శాతం పైబడి కావడం ఒక బాగమైతే ఖరీఫ్ సీజన్ వరిధాన్యం
సమయం వచ్చింది గనుక అసలు రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం సంబంధించిన వరిధాన్యం ఆయా రైస్ మిల్లులల్లో ఉన్నదా అనే అనుమానాలకు తావిస్తున్నది.

గడువు ముగిస్తున్నది….మిల్లుల్లో మిగిలిన ధాన్యం భద్రంగా ఉన్నదా?

గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్,రబీ సీజన్లలో సివిల్ సప్లైస్ ద్వారా కేటాయించింది.ఆయా సందర్భాలలో కొన్ని రైస్ మిల్లుల నుండి ధాన్యం పక్కదోవ పట్టాయని ఆరోపణలు గట్టిగానే వినబడ్డాయి.ఐతే ప్రస్తుతం 2024-2025 సంవత్సరానికి గాను కేటాయించిన ధాన్యం నుండి ప్రభుత్వానికి ఇచ్చిన 50 శాతం పోను మిగతా వరిధాన్యం ఆయా రైస్ మిల్లులలో భద్రంగా ఉన్నాయా అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

ఖరీఫ్ సీజన్ ధాన్యం మిల్లులకు కేటాయించబోతున్న ప్రభుత్వం?

2025-2026 సంవత్సరానికి గాను వరంగల్ జిల్లాలో 2 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.కాగా ఇటీవల జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులు,కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్ మిల్లర్లతో సమీక్షించి ప్రకటించారు.ఐతే ఇప్పటికే 50 శాతం బకాయి ఉన్న రైస్ మిల్లర్లు కొత్తగా కేటాయిస్తున్న ధ్యానం పరిస్థితి ఏమిటని సంబంధిత సివిల్ సప్లైస్ అధికారులకు పలు ప్రజా సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.

జిల్లెల్లలో పాక్స్ కేంద్రం పరిశీలించిన కలెక్టర్…

జిల్లెల్ల గ్రామంలో ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రం పరిశీలన రైతులకు టార్పిలిన్లు కచ్చితంగా అందజేయాలి ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి కలెక్టర్. గరీమ అగ్రవాల్. జిల్లెల్ల గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.పాక్స్ కొనుగోలు కేంద్రంలోనీ. ధాన్యం కుప్పలు. వడ్లు తేమశాతం పరిశీలించి. వర్షాలు అనేసథ్యంలో రైతులు వరి కోతలు మరో రెండు రోజులు వాయిదా వేసుకోవాలని వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత ధాన్యం ఆరబెట్టాలని సూచిస్తూ. రైతులకు తార్పలిన్లు కచ్చితంగా అందజేయాలని. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే దాన్యాన్ని రైస్ మిల్లర్ అన్లోడ్ చేసుకునేలా చూడాలని. సన్న రకం వడ్లను కూడా తీసుకునేలా అన్ని చర్యలు. తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారిని ఆదేశించారు. రైతులు. ఎటువంటి ఆందోళన చెందవద్దని. ప్రభుత్వపరంగా అన్ని విధాల. రైతులకు అండగా ఉంటూ. సహాయ కార్యక్రమాలు చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చంద్ర ప్రకాష్. తంగళ్ళపల్లి తహసిల్దార్ జయంత్. పాక్స్. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version