పశువుల ఆసుపత్రులను తనిఖీ చేసిన జిల్లా అధికారి
నర్సంపేట,నేటిధాత్రి:
దుగ్గొండి మండలంలోని స్వామిరావుపల్లి,నాచినపల్లి,శివాజీ నగర్ గ్రామాలలో జరుగుతున్న గాలి కుంటు టీకాల కార్యక్రమాల నేపథ్యంలో ను వరంగల్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.ఈ సందర్బంగా ప్రతీ రైతు పశువులకు గాలికుంటూ టీకాలు వేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో దుగ్గొండి పశువై ద్యాదికారి డాక్టర్ సోమశేఖర్, తొగర్రాయి పశువైద్యాదికారి డాక్టర్ శారద, తిమ్మంపేట పశువైద్యాదికారి డాక్టర్ బాలాజీ, పశువైద్య సిబ్బంధి, రైతులు పాల్గొన్నారు.
