రాజుపల్లిలో పశువైద్య శిభిరం
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలోని రాజు పల్లి గ్రామంలో పాఠశాల ఆవరణలో పశువులకు స్థానిక పశువైద్యాధికారి డాక్టర్ సునిల్ మరియు ప్రజ్వాల్ సంస్థ సం యుక్తంగా గ్రామంలోని 125 తెల్లజాతి పశువులకు గాలికుం టువ్యాధి నివారణ టీకాలను వేయటం జరిగింది అనంతరం ప్రజ్వాల్ సంస్థ ప్రతినిధి షేక్ గౌస్ మాట్లాడుతూ మూగజీ వాలు వాటి బాధలను చెప్పలే వని ముందుగానే రైతులు నివారణకు టీకాలు వేసుకొని రైతులు ఆర్థికంగా నష్టపో కుండా జాగ్రత్త పడాలని వివరించడం జరిగింది
ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది రమేష్ బాబు మరియు రవి, సదానందం మరియు గ్రామ రైతులు వెంకట్రావు ,గజ్జెల బుచ్చయ్య కందిరవి, కుసం సాంబయ్య చింతం బుచ్చయ్య, గజ్జెల తిరుపతి నవయుగసొసైటీ డైరెక్టర్ గడ్డం రమేష్ తదితరులు పాల్గొన్నారు.
