వైభవలక్ష్మి షాపింగ్ మాల్ లక్కీడ్రా విజేతలు రోషిణి, ప్రియాంక…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-06T133932.778.wav?_=1

 

వైభవలక్ష్మి షాపింగ్ మాల్ లక్కీడ్రా విజేతలు రోషిణి, ప్రియాంక

నేటిధాత్రి, వరంగల్.

ఉమాకాంత్ పాటిల్ ను పరామర్శించిన టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-06T133024.156.wav?_=2

 

ఉమాకాంత్ పాటిల్ ను పరామర్శించిన టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

హైదరాబాద్ కొత్తగూడ అపోలో హాస్పిటల్లో కాలు ఫ్రాక్చర్ అయి చికిత్స పొందుతున్న మాజీ సి డి సి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న టిజిఐడిసి మాజీ చైర్మన్ మహమ్మద్ తన్వీర్ వారితో పాటు ఖిజార్ ఖాన్ మతిన్ అంజద్ ఫారుక్ మన్నాన్ తదితరులు ఉన్నారు,

తుల్జా భవాని ఆలయానికి భక్తుల పాదయాత్ర ప్రారంభం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-06T130019.858.wav?_=3

ఝరాసంగం మండలం నర్సాపూర్ గ్రామం నుంచి మహారాష్ట్రలోని తుల్జా భవాని ఆలయం వరకు భక్తుల పాదయాత్ర

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలం నర్సాపూర్ గ్రామం నుండి భక్తులు లోక కళ్యాణర్ధం పాదయాత్ర చేపట్టారు. గ్రామంలోని తుల్జా భవాని ఆలయ వ్యవస్థాపకులు జాదవ్ మహేందర్ మహారాజు ఆధ్వర్యంలో భక్తులు మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా తుల్జాపూర్ అమ్మవారి చెంతకు సుమారు 220 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ప్రతి ఏడాది దీపావళి పర్వదిన అనంతరం పాదయాత్ర చేపడుతున్నట్లు గోపాల్ పేర్కొన్నారు.తుల్జా భవాని దేవస్థానానికి పాదయాత్రగా వెళ్లిన గ్రామస్తులు నర్సాపూర్ మాజీ సర్పంచ్ గోపాల్ మాట్లాడుతూ తుల్జా భవాని ఆలయం మహారాష్ట్రలోని ధరాశివ్‌లో ఉంది. ఈ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించబడింది మరియు శక్తి స్వరూపిణి అయిన భవాని దేవికి అంకితం చేయబడింది. ఈ దేవిని అనేకమంది భక్తులు, ముఖ్యంగా మరాఠాలు, రాజపుత్రులు, దేశస్థ బ్రాహ్మణులు, మరియు అగ్రిలు వంశ దేవతగా పూజిస్తానన్నారు,

డిప్యూటీ కలెక్టర్ ను అభినందించిన పాలకుర్తి తిరుపతి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-06T123946.116.wav?_=4

 

డిప్యూటీ కలెక్టర్ ను అభినందించిన పాలకుర్తి తిరుపతి

పరకాల,నేటిధాత్రి

పట్టణానికి చెందిన పాలకుర్తి కాశయ్య రిటైర్డ్ పోలీస్ అధికారి కుమారుడు సందీప్ నిజామాబాద్ డిప్యూటీ కలెక్టర్ గా నియామకం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బిజెపి పరకాల పట్టణ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి తిరుపతి సందీప్ కు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించి అభినందించారు. తన సోదరుడు పాలకుర్తి సందీప్ బాబాయ్ కాశయ్య స్ఫూర్తితో వ్యవసాయక అధికారిగా పనిచే స్తూనే గ్రూపు 1 పరీక్ష రాసి గ్రూపు వన్ లో 80 శాతం మార్కులు సాధించి డిప్యూటీ కలెక్టర్ గా నియామకం కావడం ఎంతో గర్వంగా ఉందని పాలకుర్తి తిరుపతి అన్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా పేరు సంపాదించినందుకు చెప్పలేనంత సంతోషం గా ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో సందీప్ మరింత ఉన్నత సాయికి ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

వైభవలక్ష్మి షాపింగ్ మాల్ లక్కీ డ్రా విజేతలకు బహుమతుల ప్రదానం

వరంగల్:

Vaibhavalaxmi Shopping Mall

దసరా పండుగను పురస్కరించుకొని వరంగల్ జెపిఎన్ రోడ్డులో ఉన్న వైభవలక్ష్మి షాపింగ్ మాల్ నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమంలో విజేతలను ఎంపిక చేసి వారికి బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ ఎంపీ కడియం కావ్య హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.

మొదటి బహుమతి విజేత కాశీబుగ్గకు చెందిన జి రోషిణి, కూపన్ నంబర్ బి 373, గల వారికి ఒక కిలో వెండి బహుమతి గెలుచుకున్నారు.

రెండవ బహుమతి విజేత రెడ్డిపాలెంకు చెందిన జి ప్రియాంక కూపన్ నంబర్ జే 250 టీవీఎస్ జూపిటర్ ద్విచక్ర వాహనం గెలుచుకున్నారు.

ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ, దసరా పండుగ శుభ సందర్భంలో ప్రజలకు ఆనందాన్ని పంచేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చిరస్మరణీయమని పేర్కొన్నారు. కస్టమర్ల విశ్వాసం మాల్ విజయానికి మూలకారణమని అభినందనలు తెలిపారు.

విజేతలకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు..

కార్యక్రమంలో వైభవలక్ష్మి షాపింగ్ మాల్ డైరెక్టర్లు, ప్రదీప్, హరీష్, రిషిత, సూరజ్ తదితరులు పాల్గొన్నారు.

 పాంగోలిన్ స్కేల్స్ అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టురట్టు…

 పాంగోలిన్ స్కేల్స్ అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టురట్టు

హనుమకొండలో హైదరాబాద్ యూనిట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఇవాళ(ఆదివారం) సోదాలు నిర్వహించారు. అక్రమంగా అలుగు పొలుసులని (పాంగోలిన్ స్కేల్స్) రవాణా చేస్తున్న నలుగురు నిందితులని అరెస్ట్ చేశారు.

 హనుమకొండ (Hanumakonda)లో హైదరాబాద్ యూనిట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఇవాళ(ఆదివారం) సోదాలు నిర్వహించారు. అక్రమంగా అలుగు పొలుసులని (పాంగోలిన్ స్కేల్స్) (Pangolin Scales) రవాణా చేస్తున్న నలుగురు నిందితులని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మొత్తం 6.53 కిలోల అలుగు పాంగోలిన్ స్కేల్స్‌‌ని సీజ్ చేశారు పోలీసులు.
అలుగులని వేటాడి వాటి చర్మంపై ఉండే పొలుసులని వేరు చేస్తున్నారు నిందితులు. వీటికి భారీ డిమాండ్ ఉండటంతో ఆగ్నేయాసియా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు నిందితులు. ఔషధాల తయారీలో ఈ అలుగు పొలుసులని వినియోగిస్తున్నారు. వైల్డ్ లైఫ్ చట్టం ప్రకారం అలుగులని వేటాడటం నేరమని పోలీసులు హెచ్చరించారు. డీఆర్ఐ అధికారులు నలుగురు నిందితులని అదుపులోకి తీసుకొని హనుమకొండ అటవీ అధికారులకు అప్పగించారు.

 మందాడి సినిమా షూటింగ్‌లో ప్రమాదం.. పడవ బోల్తా..

 మందాడి సినిమా షూటింగ్‌లో ప్రమాదం.. పడవ బోల్తా..

తమిళ ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్‌ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘మందాడి’. తమిళ కమెడియన్ సూరి హీరోగా నటిస్తున్నఈ చిత్రంలో తెలుగు నటుడు సుహాస్ విలన్‌గా నటిస్తున్నాడు.

తమిళ ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్‌ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘మందాడి’. తమిళ కమెడియన్ సూరి హీరోగా నటిస్తున్నఈ చిత్రంలో తెలుగు నటుడు సుహాస్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చెన్నై సముద్రతీరంలో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది (boat accident).
షూటింగ్ సమయంలో సాంకేతిక నిపుణులు ఉన్న పడవ సముద్రంలో బోల్తా పడింది. ఆ సమయంలో ఆ పడవలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారిద్దరినీ మిగిలిన వారు కాపాడారు. అయితే కెమెరాలు, ఇతర షూటింగ్ సామగ్రి మాత్రం సముద్రంలో కొట్టుకుపోయాయి. దాదాపు కోటి రూపాయల వరకు నష్టం సంభవించినట్టు వార్తలు వస్తున్నాయి (film shoot capsizes).సుహాస్‌కు ఇది తొలి తమిళ సినిమా (Suhas movie shoot accident). మతిమారన్ పుగళేంది ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వెట్రిమారన్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది.

 డల్లాస్‌లో సీనియర్ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు పర్యటన…

 డల్లాస్‌లో సీనియర్ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు పర్యటన

ఏపీ ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, HDPT-హిందు ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఛైర్మన్ (క్యాబినెట్ ర్యాంకు), భాజపా నేత డా. దాసరి శ్రీనివాసులు శనివారం డల్లాస్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రవాసాంధ్రులతో ఆయన సమావేశమయ్యారు.

ఏపీ ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, HDPT-హిందు ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఛైర్మన్ (క్యాబినెట్ ర్యాంకు), భాజపా నేత డా. దాసరి శ్రీనివాసులు శనివారం డల్లాస్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రవాసాంధ్రులతో ఆయన సమావేశమయ్యారు.
HDPT ద్వారా విదేశాల్లోని హిందు దేవాలయాలను తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలతో అనుసంధానించడం, పరస్పర సహకారం, మౌలికాంశాల సమీక్ష, ప్రవాసుల సహకారాన్ని పూర్తి స్థాయిలో ఆధ్యాత్మికతకు వినియోగించడం వంటివాటిపై ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఈ సందర్భంగా శ్రీనివాసులు వెల్లడించారు. మూడు దశాబ్దాలకు పైగా ఐఏఎస్ సర్వీసులో గన్నులు పట్టిన అన్నల డెన్నుల్లో తనకు ఎదురైన అనుభవాలను ఆయన పంచుకున్నారు. తన సర్వీసు అనుభవాల సమాహారం ‘ఇప్పచెట్టు నీడలో’ పుస్తకాన్ని అతిథులకు బహుకరించారు. ‘ఇప్పచెట్టు నీడలో’ పుస్తకంలోని కథనాలు ఆంధ్రజ్యోతి “నవ్య”లో “సంవేదన” శీర్షికన ప్రచురించారు. అవి విశేష జనాదరణను సొంతం చేసుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముందు ఆయన అర్వింగ్‌లోని మహాత్మ గాంధీ స్మారకస్థలి వద్ద గాంధీ పీస్ వాక్‌లో పాల్గొని బాపూజీకి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో సమీర్ రెహ్మాన్, అజయ్ గోవాడ, యశ్వంత్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

 బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్…

 బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్…

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్లను ఎత్తివేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపింది. అయితే..

 తెలంగాణ రాష్ట్రంలోని బీసీ రిజర్వేషన్ల అంశం రోజుకో మలుపు తీసుకుంటుంది. ఇప్పుడు తాజాగా రిజర్వేషన్ల అంశం సుప్రీకోర్టుకు చేరింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయబోతున్నారని సుప్రీంకోర్టులో వంగ గోపాల్ రెడ్డి పిటిషన్ వేశారు.

50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారంటూ పిటిషన్‌లో చెప్పుకొచ్చారు. గతంలో సుప్రీంకోర్టు 50 శాతం రిజర్వేషన్ మించరాదంటూ ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా.. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉన్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో గోపాల్ రెడ్డి వేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. జస్టిస్ విక్రమ్ నాథ్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగనున్నట్లు సమాచారం.

 బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణకు శత్రువులే..

 బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణకు శత్రువులే..  హరీశ్‌రావు షాకింగ్ కామెంట్స్

అన్ని రకాల వస్తువుల ధరలు పెంచి ప్రజలను పీడించింది బీజేపీ ప్రభుత్వం కాదా అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. జీఎస్టీ రేట్లు పెంచింది మోదీ ప్రభుత్వమేనని.. మళ్లీ ఇప్పుడు రేట్లు తగ్గించినట్లు డ్రామాలు ఆడుతోంది కూడా బీజేపీనేనని విమర్శించారు. ఎన్నికలు రాగానే చారానా తగ్గించుడు, ఎన్నికలు అయిపోగానే రూపాయి పెంచుతూ.. ప్రజలను ప్లాన్డ్‌గా మోసం చేస్తున్నారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

 ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi), సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)లపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. చోటా భాయ్, బడే భాయ్ ఇద్దరిదీ ఒకే తీరని విమర్శించారు. తెలంగాణ ప్రజలను మోసగించడంలో, దోచుకోవడంలో కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) రెండు పార్టీలు దొందూ దొందేనని ఆరోపించారు. ఒక పార్టీది మోస చరిత్ర, మరొక పార్టీది ద్రోహ చరిత్ర అని ఆక్షేపించారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణకు శత్రువులే.. తెలంగాణ పాలిట శకునిలేనని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మోదీ ప్రభుత్వం గుండు సున్నా ఇచ్చిందని ఫైర్ అయ్యారు. తెలంగాణలో 8 ఎంపీలను గెలిపించారన్న కృతజ్ఞత కూడా బీజేపీకి లేదని ధ్వజమెత్తారు. ఇవాళ(ఆదివారం) జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ నేతలు హైదరాబాద్‌లో హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి హరీశ్‌రావు.

ఆ రెండు ఘటనలపై సీఎం చంద్రబాబు ఆరా..

ఆ రెండు ఘటనలపై సీఎం చంద్రబాబు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు

కురుపాం, అనంతపురం ఘటనలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ మేరకు అధికారులను అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో మంత్రి సంధ్యారాణి, అధికారులతో మాట్లాడారు ముఖ్యమంత్రి.

 కురుపాం, అనంతపురం ఘటనలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్పందించారు. ఈ మేరకు అధికారులను అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో మంత్రి సంధ్యారాణి, అధికారులతో మాట్లాడారు ముఖ్యమంత్రి. కురుపాం గిరిజన బాలికల గురుకులంలో విద్యార్థులకు అస్వస్థతపై మంత్రితో మాట్లాడారు సీఎం చంద్రబాబు. పదుల సంఖ్యలో విద్యార్థులు అనారోగ్యం పాలైన ఘటనపై అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి.

సీఎం ఆదేశాల మేరకు విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థుల వద్దకు వెళ్లి పరామర్శించనున్నారు మంత్రి సంధ్యారాణి. పార్వతీపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్‌తో పాటు గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు వెళ్తున్నట్లు సీఎంకు వివరించారు మంత్రి సంధ్యారాణి. అనంతపురంలో శిశు సంరక్షణ కేంద్రంలో పసిబిడ్డ మృతిపై మంత్రి సంధ్యారాణితో మాట్లాడారు సీఎం చంద్రబాబు. ఈ రెండు ఘటనలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

సీనియర్‌ జర్నలిస్ట్‌ టీజేఎస్‌ జార్జ్‌ కన్నుమూత…

సీనియర్‌ జర్నలిస్ట్‌ టీజేఎస్‌ జార్జ్‌ కన్నుమూత

 

సీనియర్‌ జర్నలిస్ట్‌ టీజేఎస్‌ జార్జ్‌ బెంగళూరులో శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. వయోభారం, ఆరోగ్య సమస్యలతో…

సీనియర్‌ జర్నలిస్ట్‌ టీజేఎస్‌ జార్జ్‌ బెంగళూరులో శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. వయోభారం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న జార్జ్‌(97) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బెంగళూరులో ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన కుమార్తె శిబా తెలిపారు. 1938, మే 7న కేరళలో జన్మించిన జార్జ్‌.. 1950లో ప్రీ ప్రెస్‌ జర్నల్‌ ద్వారా బొంబాయిలో పాత్రికేయ వృత్తిలో ప్రవేశించారు. సుదీర్ఘకాలం ఇండియన్‌ ఎక్స్‌ప్రె్‌సలో కొనసాగారు. సుమారు రెండున్నర దశాబ్దాలపాటు ‘పాయింట్‌ ఆఫ్‌ వ్యూ’ పేరిట కాలమ్స్‌ రాశారు. 2007లో కన్నడ రాజ్యోత్సవ పురస్కారం, 2011లో పద్మభూషణ్‌ పురస్కారం అందుకున్నారు.

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: మంత్రి ప్రభాకర్…

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: మంత్రి ప్రభాకర్

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్‌తో యువత ఉజ్వల భవిష్యత్తు నాశనం అవుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) విజ్ఞప్తి చేశారు. ఇవాళ(ఆదివారం) అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద ‘స్టాప్ సబ్స్ టెన్స్ అబ్యూస్’ రన్ జరిగింది. ఈ రన్‌ని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. యువతలో మాదకద్రవ్యాల వినియోగం పెరుగుతోందని చెప్పుకొచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్.

 అనంత ఘటన విచారణపై మంత్రి సంధ్యారాణి కీలక ఆదేశాలు….

 అనంత ఘటన విచారణపై మంత్రి సంధ్యారాణి కీలక ఆదేశాలు

అనంతపురంలో పసిబిడ్డ మృతిపై విచారణకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం ఐసీడీఎస్ శిశు గృహంలో పసికందు మృతి చెందిన ఘటనపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

అనంతపురంలో పసిబిడ్డ మృతిపై విచారణకు ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి (Minister Sandhya Rani) ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం ఐసీడీఎస్ శిశు గృహంలో పసికందు మృతి చెందిన ఘటనపై మంత్రి సంధ్యారాణి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శిశు గృహ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పసిబిడ్డ చనిపోయారనే వార్తలపై మంత్రి సమగ్ర విచారణకు ఆదేశించారు. సిబ్బంది మధ్య వివాదాల కారణంగా బిడ్డకు పాలు పట్టకపోవడమే మృతికి కారణమనే ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుకుం జారీ చేశారు మంత్రి సంధ్యారాణి.
పసిబిడ్డ మృతికి ఆనారోగ్యమే కారణమని సంబంధిత అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఈ విషయంపై పూర్తిస్థాయి విచారణ చేయాలని మంత్రి ఆదేశించారు. శిశువు మరణానికి సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యం కారణమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిజాలను వెలికి తీయాలని ఐసీడీఎస్ శాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. పిల్లల సంరక్షణలో నిర్లక్ష్యం చూపిన వారిని ఉపేక్షించబోమని మంత్రి సంధ్యారాణి వార్నింగ్ ఇచ్చారు.

 కడప జిల్లాలో అమానుషం.. కన్నతల్లిని దారుణంగా..

 కడప జిల్లాలో అమానుషం.. కన్నతల్లిని దారుణంగా..

కడప జిల్లాలోని ప్రొద్దుటూరు శ్రీరామ్ నగర్‌లో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నతల్లి లక్ష్మీదేవిని కొడుకు యశ్వంత్ రెడ్డి హత్య చేశాడు. యశ్వంత్ రెడ్డికి గత కొన్నేళ్లుగా మానసిక స్థితి సరిగా లేదు. ఈ క్రమంలో తనను తల్లి తిట్టిందని కూరగాయల కత్తితో గొంతుకోసి యశ్వంత్ రెడ్డి హత్యచేశాడు.

 కడప జిల్లాలో (Kadapa District)ని ప్రొద్దుటూరు శ్రీరామ్ నగర్‌లో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నతల్లి లక్ష్మీదేవిని కొడుకు యశ్వంత్ రెడ్డి హత్య చేశాడు. యశ్వంత్ రెడ్డికి కొన్నేళ్లుగా మానసిక స్థితి సరిగా లేదు. ఈ క్రమంలో తనను తల్లి తిట్టిందని కూరగాయల కత్తితో గొంతుకోసి యశ్వంత్ రెడ్డి హత్యచేశాడు. వంటింట్లో లక్ష్మీదేవి ఉండగా ఆమెతో గొడవ పడ్డాడు యశ్వంత్ రెడ్డి. కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేశాడు. వంటింట్లో రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని అలాగే ఈడ్చుకుంటూ ఇంటి బయట పడేశాడు యశ్వంత్ రెడ్డి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
తల్లి లక్ష్మిదేవి ఈశ్వర్‌రెడ్డి నగర్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. నిందితుడు యశ్వంత్ రెడ్డి బీటెక్ పూర్తి చేసి, ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. తల్లిని హత్య చేసే సమయంలో తండ్రి విజయ భాస్కర్‌ని గదిలో బంధించాడు యశ్వంత్ రెడ్డి. తాను దుస్తులు మార్చుకోడానికి గదిలోకి వెళ్లగా బయట నుంచి తలుపుకి గడియ పెట్టాడు. అనంతరం వంట గదిలోకి వెళ్లి తన భార్య లక్ష్మిదేవిని అత్యంత దారుణంగా తన కుమారుడు యశ్వంత్ రెడ్డి హత్య చేశారని కన్నీరు మున్నీరుగా విలపించాడు విజయ భాస్కర్‌. ఈ ఘటనపై విజయ భాస్కర్‌ పోలీసులకు సమాచారం అందజేశారు. ఫిర్యాదు మేరకు నిందితుడు యశ్వంత్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు కడప జిల్లా పోలీసులు.

సెలవుల్లో వుంటాం!..జీతాలు తీసుకుంటాం!?

-లక్షలాది ఎకరాల మాయం లో రిజిస్టార్ల మాయాజాలం

’’నేటిధాత్రి’’ చేతిలో రాష్ట్రంలోని ‘‘అవినీతి రిజిస్టార్ల’’ బండారం

-దోచుకున్నాం…దాచుకున్నాం?

-తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 42 మందికి పైగా రిజిస్ట్రార్లు సెలవుల్లో..?

-మొదటిసారి మంత్రి ‘‘పొంగులేటి’’ ఆదేశాలతో జోన్‌ ట్రాన్స్ఫర్లు!

-ట్రాన్స్‌ఫర్లు ఒప్పుకోం..కొత్త చోట కొలువులు చేయం?

-వాటిని కాపాడుకోవాలంటే స్థానికంగానే వుంటాం?

-అవినీతికి అలవాటు పడి, స్థానికంగా బలపడి.

-ఆస్థులు కూడబెట్టి, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి!

-వ్యాపారాలు, ఫంక్షన్‌ హల్స్‌ నిర్వహిస్తూ..

-అక్రమ రిజిస్ట్రేషన్లలో భూములు కొల్లగొట్టి..

-కొత్త చోట ఏసిబి దాడులు అంచనా వేసుకోలేం?

-15 ఏళ్లకు పైబడి ట్రాన్స్‌ఫర్లు లేకపోవడం రిజిస్ట్రార్లకు బలం.

-భరించలేకపోతున్న రిజిస్ట్రార్లు!

-ఇప్పుడు ట్రాన్స్‌ఫర్లు మేం ఒప్పుకోం!

-పాత చోట పెద్ద ఎత్తున అనుచరులు.

-ముళ్లెలకు ముళ్లెలు అందిన మూటలు.

-రియలర్టర్లతో భూ బంధాలు.

-వాటిని వదులుకునేందుకు సిద్ధంగా లేరు.

-ఒకప్పుడు వేలల్లో పుచ్చుకునే లంచాలు!

-గత పదేళ్లుగా లక్షల్లో, కోట్లల్లో పెరిగిన ఆదాయాలు!

-అక్రమ రిజిస్ట్రేషన్లలో లంచాలుగా సొమ్ముకు బదులు భూ సంతర్పణలు.

-బినామీల పేరుతో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు.

-‘‘ఆదిలాబాద్‌’’ లో పెద్ద ఎత్తున అటవీ భూముల అన్యాక్రాంతంలో భాగస్వాములు.

-కరీంనగర్‌లో వక్ఫ్‌ భూముల మాయంలో రిజిస్ట్రార్ల సహకారాలు.

-వరంగల్‌ లో ఏడాదిగా చిట్స్‌ రిజిస్ట్రార్‌ లేకుండా పోవడం.

-‘‘ఖమ్మం’’లో వాగులు, వంకలు అటవీ భూముల రిజిస్ట్రేషన్లు!

-రంగారెడ్డి జిల్లాలో ‘‘కోట్లల్లో’’ లంచాలు?

-గత పదేళ్లుగా ‘‘నేటిధాత్రి’’ సాగిస్తున్న అక్షర పోరాటం.

-ఫలితంగా ఎంతో మంది రిజిస్ట్రార్ల సస్పెన్షన్లు!

-అయినా మార్పు రాని యంత్రాంగం.

హైదరాబాద్‌, నేటిధాత్రి:                        కొంత మంది రిజిస్ట్రార్లు జీవితానికి అరగనంత తిన్నారు. తరతరాలు తరగనంత సంపాదించుకున్నారు. లంచాలు మింగి రంది లేకుంటానే వున్నారు. అయినా ఇంకా వారికి లంచాల ఆకలి తీరలేదు. సంపాదన ఇంకా సరిపోవడం లేదు. కోట్లు కూడబెట్టుకున్నా, ఇంకా ఆశ చావలేదు. ఇది జనాల్లో రిజిస్ట్రేషన్‌ శాఖపై వున్న అభిప్రాయం. తెలంగాణ వ్యాప్తంగా వున్న 140 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో పని చేసే రిజిస్ట్రార్ల దగ్గర నుంచి అందులో పనిచేసే ఏ ఉద్యోగులు సుద్దపూసలు కాదన్న సత్యం అందరూ చెబుతుంటున్నారు. వారిలో కూడా కొందరు మంచి వాళ్లుండొచ్చు. కాని వారిని ఎవరూ గుర్తించరు. శరీరంలో చాలా భాగం చెడిపోయినప్పుడు, బాగున్న అవయవం చేసేదేమీవుండదు. అలా తింటున్నా, కూర్చున్నా, నిద్రలో కూడా లంచం, లంచం అనే మాటతోనే కొందరు కాలం గడిపే ఉద్యోగులు అనేకం వున్నారు. వారిని మారమంటే మారు. మార్చాలని చూసినా మారరు. ఎందుకంటే లంచానికి అలవాటు పడిన ప్రాణం రూపాయి తీసుకోకుండా వుండే పరిస్ధితి వుండదు. వ్యవస్ధ కళ్లిపోయిందంటే ఇలాంటి ఉద్యోగులే కారణం. ఎంతో మంది ప్రజల వద్ద దోచుకున్నారు. దాచుకున్నారు. ఇంకా చాలడం లేదు. అంతే కాదు వారి గొంతెమ్మ కోరికలు అంతా ఇంతా కాదు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే ట్రాన్స్‌ఫర్‌కు ఎప్పుడూ సిద్దంగా వుండాలి. అది కలెక్టర్‌ దగ్గర నుంచి జూనియర్‌ అసిస్టెంట్‌ వరకు ఎవరైనా ఒక్కటే. కాని తెలంగాణలో రిజిస్రేషన్‌ శాఖలో సుమారు 15 సంవత్సరాలుగా ట్రాన్స్‌ఫర్లు లేని వాళ్లు ఎంతో మంది వున్నారు. అంతకాన్న ఎక్కువ కాలం కూడా ఒకే చోట, ఒకే సీట్లో కూర్చున్న వారు కూడా వున్నారు. వారికి ప్రమోషన్లు వచ్చినా అవసరం లేదని అక్కడే తిష్ట వేసుకొని వున్నవాళ్లున్నారు. కారణం కేవలం లంచం. సహజంగా ఉద్యోగులు ప్రమోషన్లు వస్తే ఎంతో సంతోషిస్తారు. జీతం పెరగుతుందని ఆనందపడతారు. హోదా పెరుగుతుందని సంబరపడతుంటారు. ప్రమోషన్ల కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తుంటారు. తమ పరపతి పెరుగుతుందని కలలుకంటారు. కాని రిజిస్ట్రేషన్‌ శాఖలో సబ్‌ రిజిస్ట్రార్‌ కుర్చీ మాత్రమే చాలనుకుంటారు. ఆ కుర్చీ విడిచిపెట్టేందుకు అసలే ఒప్పుకోరు. ఒక వేళ ప్రభుత్వం వారిని ట్రాన్స్‌ఫర్‌ చేసినా మళ్లీ ఏదో రకంగా పైరవీ చేసుకొని అదే కుర్చీలో కూర్చున్న వారు కూడా వున్నారు. అంతే కాదు ఏసిబికి పట్టుబడి, కొంత కాలానికి మళ్లీ కొలువు తెచ్చుకొని, అదే కుర్చీలో అతుక్కుపోయిన వారు కూడా వున్నారు. ఇదీ స్ధూలంగా కొంత మంది రిజిస్ట్రార్ల బాగోతం. ఇదంతా ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు చాలా మంది రిజిస్ట్రార్లు చోటు కదలకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. ట్రాన్స్‌ఫర్లు అనేవి లేకుండా తిష్టవేసుకొని కూర్చున్నారు. అయితే ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రివెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి రిజిస్ట్రేషన్‌ శాఖలో మార్పులు తీసుకురావాలని చూశారు. రిజిస్ట్రేషన్‌ శాఖలో అవినీతి లేకుండా చేయాలని అనుకున్నారు. దాంతో ఆయన జోన్‌ ట్రాన్స్‌ఫర్లు చేశారు. ఇది రిజిస్ట్రేషన్‌ శాఖలో చాలా మంది ఉద్యోగులకు నచ్చలేదు. దాంతో కొంత మంది సీనియర్లు ఏక కాలంలో సెలవులు పెట్టినట్లు సమాచారం. మా ట్రాన్స్‌ఫర్లు రద్దు చేయకుంటే మేం సెలువుల్లోనే వుంటాం…కొలువులు మాత్రం చేయం. ట్రాన్ష్‌ఫర్లు అసలే ఒప్పుకోం. జీతాలు తీసుకుంటాం.. ట్రాన్స్‌ఫర్‌ చేసిన చోటకు వెళ్లమని భీష్మించుకొని కూర్చున్నారు. ఎందుకంటే ఇంత కాలం అవినీతికి అలవాటు పడి బాగా సంపాదించుకున్నారు. చాలా వరకు అక్కడే స్ధిరపడిపోయారు. స్దిర చరాస్ధులు సంపాదించుకున్నారు. సమీపంలో వుండే బంధువులను బినామీలుగా చేసుకున్నారు. ప్రతి రిజిస్ట్రార్‌ కొంత మంది అనుచరులను ఏర్పాటు చేసుకున్నారు. అందులో బంధువులుంటారు. తనకు అత్యంత నమ్మకస్తులుంటారు. వారి పేర్ల మీద ఆస్ధులు కూడబెట్టారు. వారి పేర్ల మీద ఆస్ధులు పెట్టుకున్నారు. పైగా ఎక్కడైతే అంత కాలం కొలువు చేస్తున్నారో అక్కడ వ్యాపారాలు కూడా మొదలు పెట్టిన వారున్నారు. పెద్దపెద్ద ఫంక్షన్‌హాల్స్‌ కూడా నిర్మాణాలు చేసుకున్నారు. పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు జోన్‌ మార్పులంటే జిల్లాలు దాటాల్సి వస్తుంది. పాత జిల్లాలకు వెళ్లాల్సి వస్తుంది. రోజూ వెళ్లలేరు. అక్కడే వుండలేరు. కుటుంబాలను అక్కడికి తీసుకెళ్లలేరు. కుటుంబాలను వదిలేసి కొలువులు చేయాల్సిన చోట వుండలేరు. తెలంగాణ రాకముందు సహజంగా రిజిస్ట్రార్లు లంచాలు తీసుకునే వారు. అది కూడా వేలల్లో వుండేవి. కాని తెలంగాణ వచ్చిన తర్వాత వేల రూపాయలు దాటిపోయాయి. లక్షలకు చేరుకున్నాయి. ఎప్పుడైతే తెలంగాణలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయో? అప్పుడు రిజిస్ట్రార్ల ఆశలకు రెక్కలొచ్చాయి. లంచాలు తీసుకోకుండా ఏకంగా భూములను రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం మొదలు పెట్టారు. ఇచ్చే లంచాల స్ధానంలో భూములను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. అలా అక్రమ రిజిస్ట్రేషన్లను చేస్తూ, అందులోనూ తమకు కొంత భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. అయితే అవి ఆ రిజిస్ట్రార్లకు చెందిన అనుచరులు, బంధువుల పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేసి వున్నాయి. ఒక్కసారి అక్కడి నుంచి కదిలిలే ఇక ఆ భూములు, ఆస్ధులు దక్కకపోవచ్చన్న భయం వారిలో పట్టుకున్నది. దాంతో కొంత మంది రిజిస్ట్రార్లు సెలవులు పెట్టారు. ఇంట్లోనే వుంటున్నారు. సుమారు 15 సంవత్సరాలుగా ట్రాన్స్‌ఫర్లు లేకపోవడం వారికి వరంగా మారింది. గతంలో తిష్టవేసుకున్న ప్రాంతాల్లో వారికి పెద్దఎత్తున అనుచర గణం వుంటుంది. పైగా స్దానికంగా వున్న రియల్టర్లతో భూ బందాలున్నాయి. పాత స్థలాలపై రిజిస్ట్రార్లకు పూర్తి అవగాహన వుంటుంది. రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చేవారు ఎలాంటి భూముల రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటన్నారన్నదానిపై పూర్తి పట్టు వుంటుంది. దాంతో ఆ భూముల విషయంలో ఎంత వరకు లంచం తీసుకోవచ్చు. ఎంత వరకు భూములను లంచంగా అడగొచ్చన్నదానిని గురించి నిర్ణయం తీసుకోగలరు. అదేకొత్త ప్రాంతానికి వెళ్తే పుణ్యకాలం ముగిసిపోతుంది. పైగా కొత్త ప్రాంతంలో ఎప్పుడు ఏసిబి దాడులు ఎక్కడి నుంచి జరుగుతాయో తెలియదు. అక్కడ అనుచర గణం తయారు చేసుకోవాలంటే చాలా కాలం పడుతుంది. వారిని ఎంత వరకు నమ్మలో కూడ నమ్మకం కుదిరేందుకు చాలా సమయం పడుతుంది. ఎప్పుడూ భయం గుప్పిట్లో కొలువులు చేయాల్సి వుంటుంది. దానికన్నా సెలవు పెట్టి హాయిగా వుండడమే మేలనుకుంటున్నారు. ఇలా ఉద్యోగులు తీసుకున్న నిర్ణయం వల్ల శాఖలో పనులు పెండిరగ్‌ల పడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ధరణి వచ్చిన తర్వాత లక్షలాది ఎకరాలు మాయం కావడానికి ప్రదాన కారణం రిజిస్ట్రార్లే కావడం గమనార్హం. ఆదిలాబాద్‌ జిల్లాలో పెద్దఎత్తున వేలాది ఎకరాల అటవీ భూములను సీటు ముక్కల్లా అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారు. కరీంనగర్‌ జిల్లాలో వున్న వక్ఫ్‌ భూములు అన్యాక్రాంతం కావడం లో రిజిస్ట్రార్ల పాత్ర పెద్దది. వరంగల్‌ జిల్లాలో చిట్స్‌ రిజిస్ట్రార్‌ లేక ఎంతో మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో అనేక చిట్‌ పండ్‌ కంపనీలు బిచాన ఎత్తేయడం వల్ల ఎంతో మంది ప్రజలు నష్టపోయారు. వారు తమ గోడును వినిపించుకునేందుకు ఏడాది కాలంగా రిజిస్ట్రార్‌ లేడు. ఇలా ట్రాన్ష్‌ఫర్‌ను తిరస్కరించి కొలువుల్లో చేరకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా ఉద్యోగులు సంతోషంగానే వున్నారు. ఖమ్మం జిల్లాలో వాగులు, వంకలు కూడా కొందరు రియల్టర్లు వదల్లేదు. ఆ భూములను కూడా అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారు. కోట్లు కూడబెట్టుకున్నారు. ఆస్దులు పోగేసుకున్నారు. నేటిధాత్రి గత పదేళ్ల కాలంగా అక్రమ రిజిస్ట్రేషన్లు, లంచాల రిజిస్ట్రార్లపై అక్షరపోరాటం సాగిస్తూనే వుంది. ఎంతోమంది అవినీతిత సబ్‌ రిజిస్ట్రార్లను ఇంటికి పంపడంలో నేటి దాత్రి పోరాటం ఫలించింది. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఏసిబికి ఎంతో మంది పట్టుబడుతున్నా, కొందరు రిజిస్ట్రార్లు తమ అవినీతిని ఆపడంలేదు. వారి అక్రమ సంపాదన ఆగడం లేదు. అలాంటి రిజిస్ట్రార్ల అవినీతి బాగోతమంతా నేటి దాత్రి చేతిలో వుంది. వారిపై వరస కథనాలు త్వరలోనే నేటిదాత్రి బైటపెడుతుంది. వారి బంగారం బట్టబయలు చేస్తుంది. త్వరలో వరుస కధనాలు అందిస్తుంది. ప్రభుత్వానికే సవాలు విసురుతున్న వారి వివరాలు త్వరలోనే…మీ నేటిధాత్రిలో…

`పేరుకు ఆ నలుగురు పెద్దలు…సివిల్‌ సప్లయ్‌ మీద వాలిన గద్దలు!?

`సివిల్‌ సప్లయ్‌ని గుళ్ల గుళ్ల చేసి బొర్రలు నింపుకుంటున్నారు!?

`దశాబ్దాలుగా సివిల్‌ సప్లయ్‌ శాఖను పీల్చి పిప్పి చేస్తున్నారు.

`ఓ రకం మిల్లర్లను అణచివేసి రాజ్యమేలుతున్నారు.

`ప్రభుత్వానికి సున్నం పెడుతున్నారు!

`దశాబ్దాలుగా సివిల్‌ సప్లయ్‌ని ఊడ్చుకు తింటున్నారు.

`అధికారులతో కలిసి పంచుకుతింటున్నారు.

`నాయకులను గుప్పిట్లో పెట్టుకొని దోచుకుతింటున్నారు.

`నలుగురు నాలుగు పార్టీలు.. పాలకులెవరైనా దోస్తులు!

`మొత్తంగా నలుగురు నాలుగు దిక్కులు?

`ఎంత పెద్ద అధికారినైనా మార్చగలరు!

`సంబంధిత మంత్రులను ఏమార్చగలరు!

`మంత్రులకు కావలసింది సమకూర్చగలరు?

`సివిల్‌ సప్లయ్‌కి అందరూ పవర్‌ పుల్‌ కమీషనర్లే!

`శాఖ ప్రక్షాళన జరిగే సమయానికి అందరికీ ట్రాన్స్ఫర్లే!

`అధికారులకు ఆ నలుగురంటే ఎంతో ప్రీతి!

`అందుకే సివిల్‌ సప్లయ్‌లో అంతులేని అవినీతి.

`ఆ రిపోర్టు లన్నీ బుట్ట దాకలే!

హైదరాబాద్‌, నేటిధాత్రి:                        ఆ నలుగురు. తెలంగాణలో సివిల్‌ సప్లయ్‌ శాఖకు సంబందించినంత వరకు ఆ నలుగురే గొప్ప. అలా అనుకుంటే వాళ్లేమీ అదికారులుకాదు. మిల్లర్ల వ్యవస్ధకు పెద్దలు. దశాబ్ధ కాలంగా మిల్లర్ల వ్యవస్ధను ఏలుతున్నారు. సివిల్‌ సప్లయ్‌శాఖను గుప్పిట్లో పెట్టుకున్నారు. వాళ్లు చెప్పిందే వేదం. వాళ్లు ఆడిరది ఆట..పాడిరది పాట. సివిల్‌ సప్లయ్‌ శాఖలో వుండే అధికారులకు వాళ్లేంతో ప్రీతిపాత్రులు. దోచుకోవడానికి, దాచుకోవడానికి చూపే దారులు. అదికారులకు ఎప్పటికప్పుడు ప్రసన్నం చేసుకుంటారు. పాలకులెవరైనా సరే వారికి సంతర్పణలు సమర్పించుకుంటారు. ఈ విషయాలు చెప్పేది, చెప్పుకునేది ఎవరో కాదు..తెలంగాణలో వున్న మిలర్లు..సివిల్‌ సప్లయ్‌ శాఖలోని అదికారులు. ఈ చలవ వల్లనే అధికారులు ఉద్యోగాలు చేసుకుంటారు. వీరి చల్లని చూపులతోనే మిల్లర్లు బతుకుతుంటారు. వీళ్లను కాదని అదికారులు గీత దాటలేరు. మిల్లర్లు నోరు మెదపలేరు. సివిల్‌ సప్లయ్‌లో రైతుల నుంచి ఎవరికి వడ్లు చేరాలన్నా వీళ్ల కనికరం కావాలి. వడ్లు మాయమైనా, బియ్యం మార్కెట్‌లోకి తరలిపోయినా వీళ్లుకు తెలిసే జరగాలి. అందులో ఎప్పటికప్పుడు వాటా వీరికి వెళ్లాలి. అధికారులకు పంపకాలు చేయాలంటే వీళ్లే కావాలి. ఆ నలుగురు ఎంత అడిగితే అంత, ఎంత తెమ్మంటే అంత మిల్లర్లు ముట్టజెప్పాలి. దీంతో ఉయభకుశపోరి మాత్రం కాదు. మిల్లర్లకు కూడా మింగడానికి మెతుకు లేకుండా చేయగలరు. అంతటి సమర్ధులు. అలాగని ఈ నలుగురు ఒకే పార్టీకి చెందిన వాళ్లు కాదు. నలుగురు నాలుగు పార్టీలు. కాని చేతికున్న వేళ్లలా అందరూ కలిసి వుంటారు. పాలకులు ఎవరైనా సరే వారికి చేరువౌతారు. ఒకరితో ఒకరు కలిసి, సివిల్‌సప్లయ్‌ శాఖను గుల్ల గుల్ల చేస్తూ వుంటారు. దశాబ్ధాల తరబడి యూనియన్‌ కుర్చీలకు అతుక్కుపోయారు. మొత్తంగా సివిల్‌ సప్లయ్‌ శాఖను ఏలుతున్నారు. ఆ శాఖలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఉద్యోగులంతా ఒక రకంగా సందప బంధవులు. పంచుకునేందుకు దగ్గరైన దోస్తులు. కాని వారి అజమాయిషీ చేసేందుకు వచ్చే కమీషనర్లకు మాత్రం చిక్కరు దొరకరు. ఎంత పవర్‌ పుల్‌ కమీషనర్‌ వచ్చినా సరే వారి బండారం బైట పడే సమయానికి ఆటోమెటిక్‌గా ట్రాన్స్‌ఫర్‌ అయిపోతారు. ఇది గత పన్నెండు సంవత్సరాలుగా జరగుతోంది. కాని వీళ్ల హావా మాత్రం రోజు రోజుకూ పెరిగిపోతోంది. అదికారుల అండదండలతో వారి పెత్తనం వెలిగిపోతోంది. మిల్లర్లంందరినీ గుప్పిట్లో పెట్టుకున్నారు. వారికి ఆపదలు ఈ నలుగురే సృష్టిస్తారు. వారిని ఆపదల నుంచి వీళ్లే గట్టెక్కిస్తారు. వీరి తీరంతా విచిత్రం. ఏ పార్టీ అధికారంలోవున్నా పాలకులకు చేరువౌతారు. మిల్లింగ్‌ వ్యవస్ధ పేరుచెప్పి పబ్బం గడుపుకుంటారు. టెండర్‌ ప్యాడీ వ్యవస్ధ వెనుక వీళ్లే వుంటారు. మిల్లర్ల అసోసియేషన్‌ పెద్దలుగా అన్నీ చక్కదిద్దుతుంటారు. తమకు తాము చక్కదిద్దుకుంటారు. కోట్లకు పడగలెత్తారు..ఎంతపెద్ద వాళ్లనైనా కోట్లు పెట్టికొనేస్తుంటారు. ఎవరి నోరైనా మూయించగలరు. మొత్తానికి సివిల్‌ సప్లయ్‌ని పీల్చి పిప్పి చేస్తున్నారు. ఈ నలుగురు వల్ల అటు రైతులు మోసపోతున్నారు. ఇటు మిల్లర్లు మునుగుతున్నారు. ఈ నలుగురు మాత్రం అవినీతి చక్రవర్తులుగా మిల్లింగ్‌ రాజ్యమేలుతున్నారు. మిల్లర్ల వ్యవస్ధను భ్రష్టుపట్టిస్తున్నారు? సివిల్‌ సప్లయ్‌ని ఆగం చేస్తున్నారు. వేల కోట్ల కుంబకోణాల వెనుక వీళ్లే కనిపిస్తారు. కాని వారికి మట్టి అంటకుండా జాగ్రత్తలు చాలా బాగా తీసుకుంటారు. నాయకుల ఆశీస్సులతో వెలగిపోతుంటారు. ఆ శాఖ మంత్రి పర్యటనల కోసం ఏకంగా చార్టెడ్‌ ఫ్లైట్‌ కూడా అరెంజ్‌ చేయగలగుతున్నారు. అంటే సివిల్‌ సప్లయ్‌ పేరు మీద ఎంత సంపాదించుకుంటున్నారో? ఎంత దోచుకుంటున్నారో అర్దం చేసుకోవచ్చు. తిమ్మిని బమ్మిని చేయలగరు. పాలకులను ఎప్పటికిప్పుడు ఎలాగైనా మభ్యపెట్టగలరు. మాయా మశ్చీంద్ర వేషాలు అవలీలగా వేయగలరు. మిల్లర్ల వ్యవస్ధకు నాయకులుగా ఏనాడు ఆ వ్యవస్ధకు మేలు చేసింది లేదు. కాని ఆ మిల్లర్ల వ్యవస్ధలోనే చీలికలు తెస్తుంటారు. ఓ వర్గానికి పెద్దలుగా మొత్తం వ్యవస్ధపై పెత్తనం చేయగలరు. ఎంతటి తొండాటైనా ఆడగలరు. మిల్లర్లు సివిల్‌ సప్లైశాఖకు వేలకోట్ల బకాయిలకు కారణం వాళ్లే..మిల్లర్ల నుంచి మొండి బకాయిల పేరుతో వేధించగల సమర్ధలు వీళ్లే..అదికారులను ముందుకు తోసేది వీళ్లే..మిల్లర్లను ఇబ్బందులకు గురి చేసేది వీళ్లే..మిల్లింగ్‌ వ్యవస్ధలో ఏది జరిగినా, కనిపించేది ఈ నలుగురే! ఏ మిల్లుకు వడ్లు కేటాయించాలో..ఏ మిల్లుకు ఆపాలో..ఏ మిల్లుపై ఎంక్వైరీ జరగాలో..ఏ మిల్లు మీద పగ తీర్చుకోవాలో అంతా సిద్దం చేసేది వీళ్లే.. మిల్లర్లను వేధింపులకు గురి చేసేది వీళ్లే. అంటే వారి అనుచరులైన వారికి మిల్లులు లేకపోయినా సరే వడ్లు కేటాయించబడతాయి. బియ్యం మాయ చేయబడతాయి. అదికారుల నోళ్లు మూతపడతాయి? అంతా ఈ నలుగురు కనుసన్నల్లోనే జరగాలి. ఏం జరిగినా ఈ నలుగురికి మాత్రమే తెలిసి జరగాలి. ఇంతలా ఆ నలుగురు పాతుకుపోయారు. సివిల్‌ సప్లయ్‌ను మొత్తం భ్రష్టు పట్టించారు. తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వం కమీషనర్‌గా అకున్‌ సబర్వాల్‌ను నియమించింది. సివిల్‌ సప్లయ్‌లో జరిగే అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించమని చెప్పింది. రైతులకు ఎట్టిపరిస్దితుల్లో అన్యాయం జరగొద్దని సూచించింది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన మొండి బకాయిల వసూలుకు రంగంలో దిగమని చెప్పింది. దాంతో అకున్‌ సబర్వాల్‌ లెక్కలను ముందేసుకునే ప్రయత్నం చేశారు. మొండి బకాయిల లెక్కలు తేల్చాలనుకున్నాడు. పెండిరగ్‌ బకాయిలను వసూలుకు అంతా రంగం సిద్దంచేశారు. విజిలెన్స్‌ ఎంక్వౌరీ మొదలు పెట్టారు. ఎంతో దూకుడుగా పనులు మొదలుపెట్టారు. చూస్తుండగానే రెండేళ్లు గడిచింది. అకున్‌ సబర్వాల్‌ రిపోర్టు తయారుచేశారు. రాత్రికి రాత్రే ఆయన కమీషనర్‌ పదవి పోయింది. ఆ కుర్చీలోకి కొత్త వారు వచ్చారు. తర్వాత సివిల్‌ సప్లై కమీషనర్‌గా సివి. ఆనంద్‌ వచ్చారు. ఆయన కన్నెర్ర చేశారు. బకాయిల వసూలుకు తెర తీశారు. మిల్లింగ్‌ వ్యవస్ధను గాడిలో పెట్టాలనుకున్నారు. సవిల్‌ సప్లైశాఖలో అవినీతిని అంతం చేయాలనుకున్నారు. క్షేత్ర స్దాయి నుంచి జరిగిన లోపాలను, తప్పులను, అవకతవకలను వెలికి తీసే ప్రయత్నం బాగానే చేశారు. రిపోర్టు రెడీ చేశారు. ప్రభుత్వానికి సమర్పించారు. తర్వాత కొంత కాలానికి ఆయన కూడా ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చింది. సివిల్‌ సప్లై కమీషనర్‌గా గత 22 నెలలుగా చౌహాన్‌ విధులు నిర్వరిస్తున్నారు. అవినీతి మీద ఉక్కుపాదం మోపారు. మొండిబకాయిలు అనేకం వసూలుచేశారు. రికార్డు స్ధాయిలో వసూలుకు శ్రీకారం చుట్టారు. ఎక్కడా అవకతవకలు జరక్కుండా చేశారు. మొత్తం వ్యవస్ధను గాడిలో పెట్టే సమయానికి ఆయన కూడా తాజాగా ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. కమీషనర్‌ చౌహాన్‌ ట్రాన్స్‌ఫర్‌ కాగానే ఈ నలుగురిలో ముగ్గురు పార్టీ చేసుకున్నారని సమాచారం. మళ్లీ వాళ్లకుపాత రోజులుమరింత వస్తాయని సంబరాలు చేసుకున్నారని తెలుస్తోంది. అంటే చౌహాన్‌నే కాదు, గతంలో ఇద్దరు కమీషనర్‌లను ట్రాన్స్‌ఫర్లు చేయించారని కూడా శాఖలో చెప్పుకుంటారు. ఇలా వారు ఆడిరది ఆట పాడిరదిపాటగా శాఖను దోచుకుతింటున్నారు. పాలకులనే గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వం పేద ప్రజలకు సన్న బియ్యం ఇస్తూ పేదల కడుపు నింపుతుంటే, ఈ నలుగురు తమ పొట్టలు నింపుకునే పనిలోవున్నారు. మంత్రి ఉత్తమ్‌కు అత్యంత సన్నిహితులుగా మారి, శాఖను గుప్పిట్లో పెట్టుకున్నట్లు చెప్పుకుంటున్నారు. ఏకంగా మంత్రికి అవసరమైన సౌకర్యాల కల్పనలో ముందుంటున్నారని అంటున్నారు. ఆ మధ్య మంత్రి పర్యటన కోసం స్పెషల్‌ జెట్‌ను సమకూర్చి మంత్రి ఆశీస్సులు కూడా పొందారని అంటున్నారు. పాలకులు ఎవరైనా సరే ఈ నలురుగు మాత్రం కామన్‌గా వుంటున్నారు. వ్యవస్ధను గుప్పిట్లో పెట్టుకొని అవినీతి సాగిస్తున్నారు. కొత్తగా వచ్చిన కమీషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర కూడా ఎంతో సమర్ధవంతమైన ఐపిఎస్‌ అదికారి. ఆయననైనా పని చేయనిస్తారా? లేక ఆయనపై కూడా పాలకుల చేత ఒత్తిళ్లు తెస్తారా? అన్నది చూడాలి. ఇంతకీ ఎవరా? నలుగురు? అనేది తర్వాత కథనంలో…మీ నేటిధాత్రిలో…

రామకృష్ణాపూర్ లో వైభవంగా దుర్గాదేవి శోభాయాత్ర…

రామకృష్ణాపూర్ లో వైభవంగా దుర్గాదేవి శోభాయాత్ర…

మహిళలు, యువతులు అద్భుతమైన నృత్యాలు..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

శరన్నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న దుర్గాదేవి విగ్రహాలను శనివారం నిమజ్జనం చేసేందుకు రామకృష్ణాపూర్ పట్టణంలోనీ దుర్గామాతలకు శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయా మండపాల నిర్వాహకులు దుర్గమాత విగ్రహాలను అందంగా అలంకరించి పట్టణంలో శోభా యాత్ర నిర్వహించారు. మహిళలు, యువతులు నృత్యాలు చేశారు. పట్టణంలోని ప్రధాన వీదుల గుండా భాజ భజంత్రీలతో, డప్పు చప్పుల్ల మధ్య నృత్యాలు చేస్తూ ఊరేగింపు చేశారు. మహిళలు మంగళ హరతులతో ఆమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.శరన్నవరాత్రుల సందర్భంగా సిహెచ్పి, బీజోన్ సెంటర్, ఏజోన్, రామాలయం, రాజీవ్ చౌక్, సూపర్ బజార్, సాయిబాబా మందిరం ల వద్ద ఏర్పాటు చేసిన దుర్గాదేవి విగ్రహాలకు శోభాయాత్ర కన్నుల పండువగా చేపట్టారు. చివరి రోజు దుర్గామాత విగ్రహాల నిమజ్జనాన్ని ఆనందోత్సవాల మధ్య భాజాభజంత్రీలతో శోభాయాత్ర నిర్వహించారు.మహిళలు దాండియా, కోలాటం ఆడారు. అనంతరం భక్తులు సమీప గోదావరి నది వద్దకు దుర్గామాత నిమజ్జనానికై తరలి వెళ్లారు.

ముగిసిన దేవీ శరన్నవరాత్రులు…

ముగిసిన దేవీ శరన్నవరాత్రులు

బాలానగర్ /నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని చిన్నరేవల్లి గ్రామంలో దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగగా..శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా అమ్మవారి వస్త్రాలను, పూర్ణ కలశమును వేలంపాట నిర్వహించారు. పూర్ణ కలశాన్ని సింగిల్ విండో మాజీ చైర్మన్ బత్తుల వెంకటరామ గౌడ్ వేలంపాటలో పాల్గొని కలశాన్ని రూ.51 వేలకు దక్కించుకున్నారు. అమ్మవారిని ప్రతిమను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు.

బిజెపి నాయకుని పరామర్శించిన రాష్ట్ర అధ్యక్షుడు…

బిజెపి నాయకుని పరామర్శించిన రాష్ట్ర అధ్యక్షుడు

నిజాంపేట: నేటి ధాత్రి

గత 15 రోజుల నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బిజెపి నాయకుడు కలకుచ్చిగారి రాజీరెడ్డిని బిజెపి రాష్ట్ర నాయకులు రామచంద్రరావు పరామర్శించారు. మనోధైర్యాన్ని కలిగి ఉండాలని ఎల్లవేళలా తోడుంటానని హామీ ఇచ్చారు. ఆయనతోపాటు డివిజన్ అధ్యక్షుడు అజయ్ రెడ్డి, సీనియర్ నాయకులు మాచర్ల శ్రీనివాస్, మల్లికార్జున గౌడ్,, తూప్రాన్ లక్ష్మణ్, మంద విజయ, వినయ్, కరుణశ్రీ, సుజాత, అనురాధ, ఉష, గణేష్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, సాయి సూర్య కాలనీ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు, రాజేందర్ సాయి సూర్య తదితరులు ఉన్నారు.

error: Content is protected !!
Exit mobile version