దాహం వేయకపోయినా నీళ్లు తాగుతున్నారా? ఇది తెలుసుకోండి.!
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నీరు చాలా అవసరం. కానీ, అవసరానికి మించి నీరు తాగడం కూడా శరీరానికి మంచిది కాదని మీకు తెలుసా?
దాహం లేకపోయినా నీరు తాగడం వల్ల శరీరానికి హాని ఉండదు, పైగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తాయి. అయితే, అతిగా నీళ్లు తాగడం వల్ల ఎలక్ట్రోలైట్ అసమతుల్యత వంటి సమస్యలు రావచ్చు, కానీ ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఎక్కువ నీరు తాగడం వల్ల కొంతమందికి తలనొప్పి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.దాహం శరీరం డీహైడ్రేషన్‌కు గురైందని సూచించిస్తుంది, ఈ సంకేతం కనిపించే ముందు నీరు తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవచ్చు. వేడి వాతావరణంలో లేదా ఎక్కువ వ్యాయామం చేసిన తర్వాత ఎక్కువ నీరు తాగడం మంచిది. శరీరం హైడ్రేట్‌గా ఉందో లేదో తెలుసుకోవడానికి, మీ మూత్రం రంగును చూడండి. అది లేత రంగులో ఉంటే, మీరు బాగా హైడ్రేట్ అయ్యారని అర్థం.
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి?
రోజుకు ఎంత నీరు తాగాలి అనేది వ్యక్తుల లింగం, వయస్సు, బరువు, శారీరక శ్రమపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, ప్రతి వ్యక్తి రోజుకు 2.5 నుండి 3 లీటర్ల నీరు తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, మీకు ఎక్కువగా చెమట పడుతుంటే, దీని కంటే కొంచెం ఎక్కువ నీరు తాగడం మీకు మంచిది.
