స్కాలర్ షిప్ దరఖాస్తుల ఆహ్వానం
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, 2025-26 సంవత్సరానికి దివ్యాంగ విద్యార్థుల కోసం స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. శాఖ అధికారి లలితా కుమారి తెలిపిన వివరాల ప్రకారం, ప్రీ మెట్రిక్ (9, 10 తరగతులు), పోస్ట్ మెట్రిక్ (11, 12 తరగతులు), డిగ్రీ, పీజీ, డిప్లొమా వంటి కోర్సులలో చదువుతున్న విద్యార్థులు ఈనెల 31 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
