`పేరుకు ఆ నలుగురు పెద్దలు…సివిల్‌ సప్లయ్‌ మీద వాలిన గద్దలు!?

`సివిల్‌ సప్లయ్‌ని గుళ్ల గుళ్ల చేసి బొర్రలు నింపుకుంటున్నారు!?

`దశాబ్దాలుగా సివిల్‌ సప్లయ్‌ శాఖను పీల్చి పిప్పి చేస్తున్నారు.

`ఓ రకం మిల్లర్లను అణచివేసి రాజ్యమేలుతున్నారు.

`ప్రభుత్వానికి సున్నం పెడుతున్నారు!

`దశాబ్దాలుగా సివిల్‌ సప్లయ్‌ని ఊడ్చుకు తింటున్నారు.

`అధికారులతో కలిసి పంచుకుతింటున్నారు.

`నాయకులను గుప్పిట్లో పెట్టుకొని దోచుకుతింటున్నారు.

`నలుగురు నాలుగు పార్టీలు.. పాలకులెవరైనా దోస్తులు!

`మొత్తంగా నలుగురు నాలుగు దిక్కులు?

`ఎంత పెద్ద అధికారినైనా మార్చగలరు!

`సంబంధిత మంత్రులను ఏమార్చగలరు!

`మంత్రులకు కావలసింది సమకూర్చగలరు?

`సివిల్‌ సప్లయ్‌కి అందరూ పవర్‌ పుల్‌ కమీషనర్లే!

`శాఖ ప్రక్షాళన జరిగే సమయానికి అందరికీ ట్రాన్స్ఫర్లే!

`అధికారులకు ఆ నలుగురంటే ఎంతో ప్రీతి!

`అందుకే సివిల్‌ సప్లయ్‌లో అంతులేని అవినీతి.

`ఆ రిపోర్టు లన్నీ బుట్ట దాకలే!

హైదరాబాద్‌, నేటిధాత్రి:                        ఆ నలుగురు. తెలంగాణలో సివిల్‌ సప్లయ్‌ శాఖకు సంబందించినంత వరకు ఆ నలుగురే గొప్ప. అలా అనుకుంటే వాళ్లేమీ అదికారులుకాదు. మిల్లర్ల వ్యవస్ధకు పెద్దలు. దశాబ్ధ కాలంగా మిల్లర్ల వ్యవస్ధను ఏలుతున్నారు. సివిల్‌ సప్లయ్‌శాఖను గుప్పిట్లో పెట్టుకున్నారు. వాళ్లు చెప్పిందే వేదం. వాళ్లు ఆడిరది ఆట..పాడిరది పాట. సివిల్‌ సప్లయ్‌ శాఖలో వుండే అధికారులకు వాళ్లేంతో ప్రీతిపాత్రులు. దోచుకోవడానికి, దాచుకోవడానికి చూపే దారులు. అదికారులకు ఎప్పటికప్పుడు ప్రసన్నం చేసుకుంటారు. పాలకులెవరైనా సరే వారికి సంతర్పణలు సమర్పించుకుంటారు. ఈ విషయాలు చెప్పేది, చెప్పుకునేది ఎవరో కాదు..తెలంగాణలో వున్న మిలర్లు..సివిల్‌ సప్లయ్‌ శాఖలోని అదికారులు. ఈ చలవ వల్లనే అధికారులు ఉద్యోగాలు చేసుకుంటారు. వీరి చల్లని చూపులతోనే మిల్లర్లు బతుకుతుంటారు. వీళ్లను కాదని అదికారులు గీత దాటలేరు. మిల్లర్లు నోరు మెదపలేరు. సివిల్‌ సప్లయ్‌లో రైతుల నుంచి ఎవరికి వడ్లు చేరాలన్నా వీళ్ల కనికరం కావాలి. వడ్లు మాయమైనా, బియ్యం మార్కెట్‌లోకి తరలిపోయినా వీళ్లుకు తెలిసే జరగాలి. అందులో ఎప్పటికప్పుడు వాటా వీరికి వెళ్లాలి. అధికారులకు పంపకాలు చేయాలంటే వీళ్లే కావాలి. ఆ నలుగురు ఎంత అడిగితే అంత, ఎంత తెమ్మంటే అంత మిల్లర్లు ముట్టజెప్పాలి. దీంతో ఉయభకుశపోరి మాత్రం కాదు. మిల్లర్లకు కూడా మింగడానికి మెతుకు లేకుండా చేయగలరు. అంతటి సమర్ధులు. అలాగని ఈ నలుగురు ఒకే పార్టీకి చెందిన వాళ్లు కాదు. నలుగురు నాలుగు పార్టీలు. కాని చేతికున్న వేళ్లలా అందరూ కలిసి వుంటారు. పాలకులు ఎవరైనా సరే వారికి చేరువౌతారు. ఒకరితో ఒకరు కలిసి, సివిల్‌సప్లయ్‌ శాఖను గుల్ల గుల్ల చేస్తూ వుంటారు. దశాబ్ధాల తరబడి యూనియన్‌ కుర్చీలకు అతుక్కుపోయారు. మొత్తంగా సివిల్‌ సప్లయ్‌ శాఖను ఏలుతున్నారు. ఆ శాఖలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఉద్యోగులంతా ఒక రకంగా సందప బంధవులు. పంచుకునేందుకు దగ్గరైన దోస్తులు. కాని వారి అజమాయిషీ చేసేందుకు వచ్చే కమీషనర్లకు మాత్రం చిక్కరు దొరకరు. ఎంత పవర్‌ పుల్‌ కమీషనర్‌ వచ్చినా సరే వారి బండారం బైట పడే సమయానికి ఆటోమెటిక్‌గా ట్రాన్స్‌ఫర్‌ అయిపోతారు. ఇది గత పన్నెండు సంవత్సరాలుగా జరగుతోంది. కాని వీళ్ల హావా మాత్రం రోజు రోజుకూ పెరిగిపోతోంది. అదికారుల అండదండలతో వారి పెత్తనం వెలిగిపోతోంది. మిల్లర్లంందరినీ గుప్పిట్లో పెట్టుకున్నారు. వారికి ఆపదలు ఈ నలుగురే సృష్టిస్తారు. వారిని ఆపదల నుంచి వీళ్లే గట్టెక్కిస్తారు. వీరి తీరంతా విచిత్రం. ఏ పార్టీ అధికారంలోవున్నా పాలకులకు చేరువౌతారు. మిల్లింగ్‌ వ్యవస్ధ పేరుచెప్పి పబ్బం గడుపుకుంటారు. టెండర్‌ ప్యాడీ వ్యవస్ధ వెనుక వీళ్లే వుంటారు. మిల్లర్ల అసోసియేషన్‌ పెద్దలుగా అన్నీ చక్కదిద్దుతుంటారు. తమకు తాము చక్కదిద్దుకుంటారు. కోట్లకు పడగలెత్తారు..ఎంతపెద్ద వాళ్లనైనా కోట్లు పెట్టికొనేస్తుంటారు. ఎవరి నోరైనా మూయించగలరు. మొత్తానికి సివిల్‌ సప్లయ్‌ని పీల్చి పిప్పి చేస్తున్నారు. ఈ నలుగురు వల్ల అటు రైతులు మోసపోతున్నారు. ఇటు మిల్లర్లు మునుగుతున్నారు. ఈ నలుగురు మాత్రం అవినీతి చక్రవర్తులుగా మిల్లింగ్‌ రాజ్యమేలుతున్నారు. మిల్లర్ల వ్యవస్ధను భ్రష్టుపట్టిస్తున్నారు? సివిల్‌ సప్లయ్‌ని ఆగం చేస్తున్నారు. వేల కోట్ల కుంబకోణాల వెనుక వీళ్లే కనిపిస్తారు. కాని వారికి మట్టి అంటకుండా జాగ్రత్తలు చాలా బాగా తీసుకుంటారు. నాయకుల ఆశీస్సులతో వెలగిపోతుంటారు. ఆ శాఖ మంత్రి పర్యటనల కోసం ఏకంగా చార్టెడ్‌ ఫ్లైట్‌ కూడా అరెంజ్‌ చేయగలగుతున్నారు. అంటే సివిల్‌ సప్లయ్‌ పేరు మీద ఎంత సంపాదించుకుంటున్నారో? ఎంత దోచుకుంటున్నారో అర్దం చేసుకోవచ్చు. తిమ్మిని బమ్మిని చేయలగరు. పాలకులను ఎప్పటికిప్పుడు ఎలాగైనా మభ్యపెట్టగలరు. మాయా మశ్చీంద్ర వేషాలు అవలీలగా వేయగలరు. మిల్లర్ల వ్యవస్ధకు నాయకులుగా ఏనాడు ఆ వ్యవస్ధకు మేలు చేసింది లేదు. కాని ఆ మిల్లర్ల వ్యవస్ధలోనే చీలికలు తెస్తుంటారు. ఓ వర్గానికి పెద్దలుగా మొత్తం వ్యవస్ధపై పెత్తనం చేయగలరు. ఎంతటి తొండాటైనా ఆడగలరు. మిల్లర్లు సివిల్‌ సప్లైశాఖకు వేలకోట్ల బకాయిలకు కారణం వాళ్లే..మిల్లర్ల నుంచి మొండి బకాయిల పేరుతో వేధించగల సమర్ధలు వీళ్లే..అదికారులను ముందుకు తోసేది వీళ్లే..మిల్లర్లను ఇబ్బందులకు గురి చేసేది వీళ్లే..మిల్లింగ్‌ వ్యవస్ధలో ఏది జరిగినా, కనిపించేది ఈ నలుగురే! ఏ మిల్లుకు వడ్లు కేటాయించాలో..ఏ మిల్లుకు ఆపాలో..ఏ మిల్లుపై ఎంక్వైరీ జరగాలో..ఏ మిల్లు మీద పగ తీర్చుకోవాలో అంతా సిద్దం చేసేది వీళ్లే.. మిల్లర్లను వేధింపులకు గురి చేసేది వీళ్లే. అంటే వారి అనుచరులైన వారికి మిల్లులు లేకపోయినా సరే వడ్లు కేటాయించబడతాయి. బియ్యం మాయ చేయబడతాయి. అదికారుల నోళ్లు మూతపడతాయి? అంతా ఈ నలుగురు కనుసన్నల్లోనే జరగాలి. ఏం జరిగినా ఈ నలుగురికి మాత్రమే తెలిసి జరగాలి. ఇంతలా ఆ నలుగురు పాతుకుపోయారు. సివిల్‌ సప్లయ్‌ను మొత్తం భ్రష్టు పట్టించారు. తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వం కమీషనర్‌గా అకున్‌ సబర్వాల్‌ను నియమించింది. సివిల్‌ సప్లయ్‌లో జరిగే అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించమని చెప్పింది. రైతులకు ఎట్టిపరిస్దితుల్లో అన్యాయం జరగొద్దని సూచించింది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన మొండి బకాయిల వసూలుకు రంగంలో దిగమని చెప్పింది. దాంతో అకున్‌ సబర్వాల్‌ లెక్కలను ముందేసుకునే ప్రయత్నం చేశారు. మొండి బకాయిల లెక్కలు తేల్చాలనుకున్నాడు. పెండిరగ్‌ బకాయిలను వసూలుకు అంతా రంగం సిద్దంచేశారు. విజిలెన్స్‌ ఎంక్వౌరీ మొదలు పెట్టారు. ఎంతో దూకుడుగా పనులు మొదలుపెట్టారు. చూస్తుండగానే రెండేళ్లు గడిచింది. అకున్‌ సబర్వాల్‌ రిపోర్టు తయారుచేశారు. రాత్రికి రాత్రే ఆయన కమీషనర్‌ పదవి పోయింది. ఆ కుర్చీలోకి కొత్త వారు వచ్చారు. తర్వాత సివిల్‌ సప్లై కమీషనర్‌గా సివి. ఆనంద్‌ వచ్చారు. ఆయన కన్నెర్ర చేశారు. బకాయిల వసూలుకు తెర తీశారు. మిల్లింగ్‌ వ్యవస్ధను గాడిలో పెట్టాలనుకున్నారు. సవిల్‌ సప్లైశాఖలో అవినీతిని అంతం చేయాలనుకున్నారు. క్షేత్ర స్దాయి నుంచి జరిగిన లోపాలను, తప్పులను, అవకతవకలను వెలికి తీసే ప్రయత్నం బాగానే చేశారు. రిపోర్టు రెడీ చేశారు. ప్రభుత్వానికి సమర్పించారు. తర్వాత కొంత కాలానికి ఆయన కూడా ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చింది. సివిల్‌ సప్లై కమీషనర్‌గా గత 22 నెలలుగా చౌహాన్‌ విధులు నిర్వరిస్తున్నారు. అవినీతి మీద ఉక్కుపాదం మోపారు. మొండిబకాయిలు అనేకం వసూలుచేశారు. రికార్డు స్ధాయిలో వసూలుకు శ్రీకారం చుట్టారు. ఎక్కడా అవకతవకలు జరక్కుండా చేశారు. మొత్తం వ్యవస్ధను గాడిలో పెట్టే సమయానికి ఆయన కూడా తాజాగా ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. కమీషనర్‌ చౌహాన్‌ ట్రాన్స్‌ఫర్‌ కాగానే ఈ నలుగురిలో ముగ్గురు పార్టీ చేసుకున్నారని సమాచారం. మళ్లీ వాళ్లకుపాత రోజులుమరింత వస్తాయని సంబరాలు చేసుకున్నారని తెలుస్తోంది. అంటే చౌహాన్‌నే కాదు, గతంలో ఇద్దరు కమీషనర్‌లను ట్రాన్స్‌ఫర్లు చేయించారని కూడా శాఖలో చెప్పుకుంటారు. ఇలా వారు ఆడిరది ఆట పాడిరదిపాటగా శాఖను దోచుకుతింటున్నారు. పాలకులనే గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వం పేద ప్రజలకు సన్న బియ్యం ఇస్తూ పేదల కడుపు నింపుతుంటే, ఈ నలుగురు తమ పొట్టలు నింపుకునే పనిలోవున్నారు. మంత్రి ఉత్తమ్‌కు అత్యంత సన్నిహితులుగా మారి, శాఖను గుప్పిట్లో పెట్టుకున్నట్లు చెప్పుకుంటున్నారు. ఏకంగా మంత్రికి అవసరమైన సౌకర్యాల కల్పనలో ముందుంటున్నారని అంటున్నారు. ఆ మధ్య మంత్రి పర్యటన కోసం స్పెషల్‌ జెట్‌ను సమకూర్చి మంత్రి ఆశీస్సులు కూడా పొందారని అంటున్నారు. పాలకులు ఎవరైనా సరే ఈ నలురుగు మాత్రం కామన్‌గా వుంటున్నారు. వ్యవస్ధను గుప్పిట్లో పెట్టుకొని అవినీతి సాగిస్తున్నారు. కొత్తగా వచ్చిన కమీషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర కూడా ఎంతో సమర్ధవంతమైన ఐపిఎస్‌ అదికారి. ఆయననైనా పని చేయనిస్తారా? లేక ఆయనపై కూడా పాలకుల చేత ఒత్తిళ్లు తెస్తారా? అన్నది చూడాలి. ఇంతకీ ఎవరా? నలుగురు? అనేది తర్వాత కథనంలో…మీ నేటిధాత్రిలో…

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version