కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

పేదింటి ఆడబిడ్డలకు వరప్రదాయిని కళ్యాణలక్ష్మి

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే దొంతి

నర్సంపేట,నేటి ధాత్రి:

పేదింటి ఆడబిడ్డలకు వరప్రదాయిని కళ్యాణలక్ష్మి పథకం అని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.
ప్రజా ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో సిటిజెన్ క్లబ్ లో నర్సంపేట డివిజన్ పరిధిలోని నర్సంపేట నల్లబెల్లి,దుగ్గొండి,ఖానాపురం,చెన్నారావుపేట,నెక్కొండ మండలాలతో పాటు నర్సంపేట పట్టణం సంబంధించిన 305 మంది లబ్ధిదారులకు రూ. 3 కోట్ల 5 లక్షల విలువైన కళ్యాణ లక్ష్మీ ,షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు.రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి అధ్యక్షతన కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది.
పేద ప్రజలకు అండగా ఉంటూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందజేస్తుందని లక్ష్యమని తెలిపారు.కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అర్హులు ఎటువంటి దళారులకు నమ్మవద్దని తెలిపారు.పెళ్లి చేసిన ఇంటికి ఆర్ధిక సహాయం అందించాలని ప్రభుత్వ నిర్ణయమని చెప్పారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్,వైస్ చైర్మన్ హరిబాబు,ఎమ్మర్వోలు రవిచంద్రారెడ్డి,రెవెన్యూ ఇన్స్పెక్టర్స్,అధికారులు,సర్పంచ్ లు,
ప్రజా ప్రతినిధులు,అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

నూతన తహసిల్దార్‌గా సి. భాస్కర్ బాధ్యతలు

బాధ్యతలు స్వీకరించిన నూతన తహసిల్దార్ సి.భాస్కర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల నూతన తహసిల్దార్ సి.భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన తహసిల్దార్ తిరుమల్రావు బదలీపై ఆందోల్-జోగిపేట్ ఆర్డీఓ కార్యాలయానికి వెళ్ళగా కంగ్రి మండల తహసిల్దార్ బాధ్యతలు నిర్వహించిన సి. భాస్కర్ బదలీపై ఝరాసంగం తహసిల్దార్ గా వచ్చారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ మండల ప్రజల సమస్యలతో రెవెన్యూ కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎప్పడికప్పుడు ప్రతి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కార్యాలయానికి వచ్చే రైతులు ప్రజలను ఎలాంటి సమస్యలైనా పరిష్కరించి పనిచేస్తా మన్నారు,

తాసిల్దార్ కార్యాలయంలో కలెక్టర్ అకస్మాత్తుగా తనిఖీలు..

తాసిల్దార్ కార్యాలయంలో కలెక్టర్ అకస్మాత్తుగా తనిఖీలు

భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

కలెక్టర్ సత్య శారద దేవి

#నెక్కొండ, నేటి ధాత్రి:

మండలంలోని తాసిల్దార్ కార్యాలయాన్ని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవి అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయంలోని భూ భారతి రెవెన్యూ చట్టానికి సంబంధించిన ఫైళ్లను పరిశీలించారు. అనంతరం తాసిల్దార్ రాజ్ కుమార్ ను మండల వ్యాప్తంగా వచ్చిన ఫైళ్ళ వివరాలు అడిగి తెలుసుకుని రెండు రోజులలో భూ సమస్యల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులతో సిబ్బంది వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత దరఖాస్తులను ఎప్పటికప్పుడు కలెక్టర్ కార్యాలయానికి చేరవేయాలని అన్నారు. ఏమాత్రం అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని సిబ్బంది టీములుగా విడిపోయి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎప్పటికప్పుడు నివేదికను పంపించాలని అన్నారు.

నెక్కొండ సర్వేయర్ పై ఆగ్రహం

మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించిన వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి నెక్కొండ సర్వేయర్ కుశాల్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేయర్ భూభారతి దరఖాస్తులపై వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించక రెవెన్యూ కార్యాలయంలో ఏం చేస్తున్నావ్ అంటూ చురకలంటించారు. ఎక్కువ శాతం భూ సమస్యలు సర్వేయర్లు వెళ్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, వరంగల్ ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, నర్సంపేట డి ఏ ఓ శ్రీనివాస్, వరంగల్ డీఏవో ఫణి కుమార్, రెవెన్యూ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version