భూసేకరణ వేగవంతం చేయండి : కలెక్టర్ ప్రావీణ్య.

భూసేకరణ వేగవంతం చేయండి : కలెక్టర్ ప్రావీణ్య,

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్జ్ భూసేకరణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఝరాసంగం మండలం చిలేపల్లి, బర్దిపూర్, చిలేపల్లి తాండ, ఎల్గోయి నిమ్జ్ పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం సేకరించిన భూములను పరిశీలించారు. నిమ్జ్ భూసేకరణ పరిధిలోకి వచ్చే వివరాల మ్యాపును ద్వారా పరిశీలించారు. ప్రభుత్వం సేకరించిన భూమి, మిగిలిన భూమి వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. భూసేకరణను వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించారు. నూతనంగా ఏర్పాటుచేసిన ఉగ్గేల్లి నుంచి బర్దిపూర్ శివారు వరకు వేసిన రోడ్డును పరిశీలించారు. వారి వెంట అదనపు కలెక్టర్ మాధురి, జహీరాబాద్ ఆర్డిఓ రామ్ రెడ్డి, తహసిల్దార్ తిరుమలరావు, సర్వేర్లు, నర్సింలు, లాల్ సింగ్, నిమ్ అధికారులు ఉన్నారు.

హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య గారికి వినతి పత్రం.!

హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య గారికి వినతి పత్రం ఇచ్చిన వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య
వర్దన్నపేట (నేటిదాత్రి ):

 

వ్యవసాయ మార్కెట్ కమిటీ వర్ధన్నపేట పరధిలోని ఐనవోలు మండలములో రైతుల సౌకర్యార్ధము మార్కెట్ సబ్ యార్డు ఏర్పాటు కొరకు 6 ఏకరముల ప్రభుత్వ భూమి కేటాయించగలరని ఈ రోజు వర్ధన్నపేట మార్కెట్ కమిటీ చైర్మెన్ శ్రీ నరుకుడు వెంకటయ్య హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య ని కలిసి కోరడం జరిగినది. గతములో ఐనవోలు తహసీల్దార్ గారు 5 ఏకరముల భూమిని గుర్తించడం జరిగినది. కానీ అట్టి భూమి మార్కెట్ సబ్ యార్డుకు కేటాయించబడలేదు. అందుకు గాను ఐనవోల్ గ్రామపంచాయతీ పాలక వర్గం వారు గ్రామ రెవిన్యూ పరిదిలో ఆరు ఏకరముల ప్రభుత్వ భూమినీ గుర్తించి తీర్మానం చేసి అప్పటి కలెక్టర్ కి కూడా దరఖాస్తులు కూడా చేయడం జరిగింది అయితే వర్ధన్నపేట ఎంఎల్ఏ కేఆర్ నాగరాజు కూడా స్థల పరిశిలిన చేసి హన్మకొండ కలెక్టర్ గారికి ఎంఎల్ఏ నాగరాజు ల్యాండ్ ఉంది సంక్షన్ ఇవ్వండి అని రేక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది.కేటాయిస్తే సబ్ యార్డు నిర్మాణం, అందులో గోదాము మరియు కవర్ షెడ్డు నిర్మాణాలు చేపట్టవచ్చునని మరియు ఇట్టి యార్డు ఏర్పాటు చేస్తే ఐనవోలు మండల రైతులకు ఎంతో మేలు జరుగుతోంది అని కలెక్టర్ గారిని ఎఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య కోరడము జరిగినది.కలెక్టర్ గారిని కలిసిన వారిలో బ్లాక్ అధ్యక్షుడు అబిడి రాజిరెడ్డి,వర్ధన్నపేట మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం, జిల్లా కాంగ్రెస్ నాయకులు పోషాల వెంకన్న గౌడ్.లు పాల్గొన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య.!

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలను అందించాలి

హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

హన్మకొండ జిల్లా, నేటిధాత్రి (మెడికల్):

హనుమకొండ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్య సేవల నిమిత్తం వచ్చే రోగులకు మెరుగైన సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు.
శుక్రవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని ఇన్ పేషంట్ వార్డును సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో కలెక్టర్ మాట్లాడారు. మెడికల్ ఆఫీసర్ కార్యాలయాన్ని సందర్శించి ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు సిబ్బంది హాజరు పట్టికను, స్టాక్ రిజిస్టర్, మెయింటెనెన్స్ రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న కొందరు సమావేశానికి హనుమకొండకు వెళ్ళగా కలెక్టర్ ఆరా తీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎన్ని ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ రావును అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన ఓఆర్ఎస్ ప్యాకెట్ల డబ్బాలను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఓఆర్ఎస్ ప్యాకెట్లను సబ్ సెంటర్ల ద్వారా పంపిణీ చేయాలన్నారు. ఆరోగ్య సేవల కోసం ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండి సేవలను అందించాలన్నారు.
ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ విక్రమ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version