భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు..

భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

24/7అందుబాటులో..వివిధ శాఖల అధికారులు

వరద, వర్షం ప్రభావిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు

కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 233 1495

కంట్రోల్ రూమ్ వాట్సాప్ సెల్ నెంబర్ 9398684240

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో సంబంధిత అన్ని శాఖలను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలలో లో లెవెల్ కాజ్ వే ల వద్ద అప్రమత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.రెవెన్యూ, పోలీస్, విద్యుత్, వ్యవసాయ, హెల్త్, పి.ఆర్, మిషన్ భగీరథ ఇతర శాఖల అధికారులు కంట్రోల్ రూంలో సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఈ నెల 13 వ తేదీ నుంచి 16 వ తేదీ వరకు అధికారులు అందుబాటులో ఉండి, వర్షాలు, వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు తగిన సమాచారం అందిస్తారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని, వరద ప్రభావిత ప్రజలకు సహాయం చేసేలా సేవలు అందిస్తారు. 24 గంటలు ఆయా శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కంట్రోల్ రూమ్ నెంబర్లు టోల్ ఫ్రీ నెంబర్ 1800 233 1495, వాట్సాప్ సెల్ నెంబర్ 9398684240 లను వర్షం, వరద ప్రభావిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజలకు సూచించారు. జిల్లా, మండల స్థాయి అధికారులు తమ, తమ కార్యాలయాల్లో, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. వర్షాల కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రా వద్దని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

పాఠశాలలో కంప్యూటర్ గది ప్రారంభోత్సవం.

జిల్లా పరిషత్ కథలాపూర్ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ గది ప్రారంభోత్సవం:

 

నేటిధాత్రి

 

 

 

 

తేదీ: 21-04-2025 నాడు జిల్లా పరిషత్ కథలాపూర్ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ గది ఆధునికరణ కొరకై పాఠశాల పూర్వ విద్యార్థి గుండేటి ప్రసాద్ మమత దంపతులు గారు విరాళాలు అందజేయడం జరిగినది. ఇట్టి కంప్యూటర్ గదిని వారి తల్లి గారైన గుండేటి గంగుబాయి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ ఎం అర్జున్ గారు మాట్లాడుతూ నేటి యుగంలో పిల్లలకు తప్పనిసరిగా కంప్యూటర్ విద్యపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఇట్టి కంప్యూటర్ గది ఆధుని కొరకు సహకరించిన గుండేటి రాజేంద్రప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో. బోగోరి గంగాధర్ లక్ష్మీ నర్సు, ఉపాధ్యాయులు ఎస్ వెంకటేశం, పి దరందీప్, పి శశిధర్, డి ఏడుకొండలు, జి అశోక్ ,రాజ్యలక్ష్మి, లక్ష్మి, ఉమాదేవి, నీలిమ, షాహినా, రవీందర్, సుమన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

వేసవికాలం దృష్ట్యా కంట్రోల్ రూమ్ ఏర్పాటు.!

సిరిసిల్ల పట్టణ మున్సిపల్ వేసవికాలం దృష్ట్యా కంట్రోల్ రూమ్ ఏర్పాటు

సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ తాగునీరు సమస్య లేకుండా అందించడం కోసం

ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు

సిరిసిల్ల టౌన్:( నేటిదాత్రి )

సిరిసిల్ల పట్టణంలోని ప్రజలందరికీ వచ్చే వేసవికాలం దృష్ట్యా, తాగునీరు సరఫరా కోసం సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ గదిని ఏర్పాటు చేయడం జరిగినది. సిరిసిల్ల పట్టణ ప్రజలకు తాగునీరు సమస్య రాకుండా వార్డుల వాయిసుగా ఎలాంటి సమస్య లేకుండా ఉండడం కోసం ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా టోల్ ఫ్రీ నెంబర్ 7893593330 సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version