నర్సంపేట మహిళ కారాగారంలో వైద్య శిబిరం…

నర్సంపేట మహిళ కారాగారంలో వైద్య శిబిరం

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని వరంగల్ జిల్లా నర్సంపేట పట్టంలోని మహిళా ప్రత్యేక కారాగారంలో ఉచిత వైద్య శిబిరం సబ్ జైలు సూపరింటెండెంట్ కె.స్రవంతి ఆధ్వర్యంలో చేపట్టారు.కారాగారంలో శిక్షలు అనుభవిస్తున్న,రిమాండ్ మహిళ ఖైదీలకు,జైలు సిబ్బందికి వైద్య పరీక్షలు, నిర్వహించారు.అలాగే రక్త పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జైలు సూపరింటెండెంట్ కె.స్రవంతి మాట్లాడుతూ కారాగారంలో ఉన్న వివిధ రకాల గల ఖైదీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.బీపీ,షుగర్,ఇతర రక్త పరీక్షలు చేసి మందులు పంపిణీ చేస్తున్నట్లు సూపరింటెండెంట్ కె.స్రవంతి తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యురాలు డాక్టర్ భావన,ల్యాబ్ టెక్నీషన్ నవీన్,సూపర్వైజర్ పుండరీబాయి,హెల్త్ సూపర్వైజర్ రామలింగయ్య,జైలు సిబ్బంది ,ఖైదీలు పాల్గొన్నారు.

మహిళ కారాగారంలో వైద్య శిబిరం..

మహిళ కారాగారంలో వైద్య శిబిరం

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని వరంగల్ జిల్లా నర్సంపేట పట్టంలోని మహిళా ప్రత్యేక కారాగారంలో సోమవారం ఉచిత వైద్య శిబిరం ఆ సబ్ జైలు సూపరింటెండెంట్ కె.స్రవంతి ఆధ్వర్యంలో చేపట్టారు.కారాగారంలో శిక్షలు అనుభవిస్తున్న,రిమాండ్ మహిళ ఖైదీలకు,జైలు సిబ్బందికి వైద్య పరీక్షలు, నిర్వహించారు.

అలాగే రక్త పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జైలు సూపరింటెండెంట్ కె.స్రవంతి మాట్లాడుతూ కారాగారంలో ఉన్న వివిధ రకాల గల ఖైదీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.బీపీ,షుగర్,ఇతర రక్త పరీక్షలు చేసి మందులు పంపిణీ చేస్తున్నట్లు సూపరింటెండెంట్ కె.స్రవంతి తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యురాలు డాక్టర్ భావన,ల్యాబ్ టెక్నీషన్ నవీన్,సూపర్వైజర్ పుండరీబాయి,హెల్త్ సూపర్వైజర్ రామలింగయ్య,జైలు సిబ్బంది ,ఖైదీలు పాల్గొన్నారు.

అజంత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్…

అజంత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం బస్వరాజుపల్లి గ్రామంలో అజంతా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు బిపి, షుగర్,గుండె పరీక్ష,కంటీ పరీక్ష చేయించి అర్హులు అయిన వారికి కళ్ళజోడు ఇవ్వడం జరిగింది.దానికి గెస్ట్ గా గణపురం స్టేషన్ ఎస్సై రేఖ అశోక్ , సర్పంచ్ సునీత- శ్రీనివాస్ గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు మిట్టపెల్లి అరవింద్ మాట్లాడుతూ ఆరోగ్యంలేని మనిషి జీవితంలో ఏదీ సాదించలేడు, మనకు రోగం బారిన పడితే తప్ప ఆరోగ్యం గురించి ఆలోచన రాదు, దాని కోసం ఎల్లవేళలా గ్రామ ప్రజలు బాగుండాలి అని ఈ నిర్ణయం అజంతా యూత్ తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అజంతా యూత్ అసోసియేషన్ ఉప అధ్యక్షులు చిన్న కుమార్, కోశాధికారి కుక్కమూడి నవీన్, ప్రధాన కార్యదర్శి మట్టెవాడ హరీష్, కార్యదర్శి మిట్టపెల్లి అశోక్, ప్రచార కార్యదర్శి కన్నూరి రంజిత్, సలహాదారులు కుర్రి రాజు,కుక్కమూడి అశోక్,కుక్కమూడి కుమార్ , రమేష్, కళ్యాణ్, నవీన్, నరేష్,సాయి, మహేష్, గణేష్,గ్రామ పెద్దలు, ఉపసర్పంచ్, వార్దుమెంబెర్స్, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

మోహన్ నాయక్ సేవలు గణనీయం.

నస్కల్ లో ..
ఉచిత వైద్య శిబిరం
మోహన్ నాయక్ సేవలు గణనీయం.

నిజాంపేట: నేటి ధాత్రి

నిరుపేదల పెన్నిధిగా డాక్టర్ మోహన్ నాయక్ నిలుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ.. పేదల గుండెల్లో నిలిచిపోతున్నాడు. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో శుక్రవారం డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామస్తులు అధిక సంఖ్యలు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా బిపి, షుగర్, ఇతర వ్యాధులకు పై వైద్యులు శాస్త్ర చికిత్సలు నిర్వహించారు. పేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్న డాక్టర్ మోహన్ నాయక్ ను గ్రామీణ ప్రాంత ప్రజలు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సిద్ధరాములు, లింగం గౌడ్, లక్ష్మా గౌడ్, శ్రీనివాస్, దేశెట్టి లింగం , గుమ్ముల అజయ్, తదితర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

రోగనిరోధక శక్తి పెంచడానికి వ్యాక్సినేషన్…

రోగనిరోధక శక్తి పెంచడానికి వ్యాక్సినేషన్

నిజాంపేట: నేటి ధాత్రి

 

పసిపిల్లలలో రోగ నిరోధక శక్తి పెంచడానికి వ్యాక్సినేషన్ టీకాలు ఉపయోగపడతాయని గ్రామ కార్యదర్శి ఆరిఫ్ అన్నారు. నిజాంపేట మండలం నగరం తండా గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో పసి పిల్లలకు టీకాలు, వ్యాక్సినేషన్ ఇచ్చారు. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు బిపి షుగర్ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం నిర్మల, అంగన్వాడి టీచర్ స్వప్న ఆశ వర్కర్లు ఉన్నారు.

మెగా మెడికల్ క్యాంప్

మెగా మెడికల్ క్యాంప్

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

 

జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ మంచిర్యాల ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ప్రాంతంలోని పీహెచ్సీ లో మెగా మెడికల్ క్యాంప్ గురువారం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో వైద్యులు ఉచితంగా బీపీ, షుగర్,టీబీ,బ్లడ్,డెంగ్యూ, మూత్ర వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చారు.తీవ్ర ఆరోగ్య ఇబ్బందులతో ఉన్న పెషేంట్స్ ని అంబులెన్స్ ద్వారా మంచిర్యాలకు తీసుకెళ్లి మెరుగైన చికిత్స అందజేశారు. ఈ కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్ పూదరి కుమార్, హెచ్ఇ అల్లాడి శ్రీనివాస్, రమేష్ సిహెచ్ఓలు రమేష్, అక్తర్,టీబి ప్రోగ్రాం సూపర్వైజర్ సాయి రెడ్డి, ఐసిటిసి మెంబెర్స్ డా.పద్మశ్రీ ఆర్ బి హెచ్ కే మెడికల్ ఆఫీసర్,డా.మమత, ఎఎన్ఎం లు రజిత,వజ్ర, సునంద,ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version