నిరంజన్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం
ఇంటింటికి జాతీయ జెండా ఉంచడం మన కర్తవ్యం
డాక్టర్.పగడాల కాళీ ప్రసాద్ రావు
పరకాల నేటిధాత్రి
బిజెపి పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో
79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు.ముఖ్యఅతిథిగా బిజెపి పరకాల కాంటెస్ట్ ఎమ్మెల్యే డాక్టర్.పగడాల కాళీ ప్రసాద్ రావు,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,సిరంగి సంతోష్ కుమార్ పాల్గొని బస్టాండ్ కూడలి నుండి పట్టణ రహదారిపై,ఇళ్ళు ఇళ్ళు తురుగుతూ భారత్ మాతాకీ జై అనే నినాదాలతో జాతీయ జెండాలు పంపిణి చేశారు.ఈ సందర్బంగా డాక్టర్.కాళీ ప్రసాద్ రావు,సిరంగి సంతోష్ కుమార్ మాట్లాడుతూ
ప్రజలందరూ జాతీయవాదులుగా,దేశ భక్తులుగా తయారు కావాలని అలాగే ఇంటింటికి జాతీయ జెండా కలిగి యుండటం భారతీయులుగా మన కర్తవ్యమని అన్నారు.హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఇంటి పై త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగురవేయాలన్నారు.ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రారంభమైన హర్ ఘర్ తిరంగా జాతీయ ఉద్యమం,మన దేశాన్ని ఒకే తాటిపైకి తెచ్చి,ప్రతి హృదయంలో దేశభక్తి జ్వాలను మరింత నింపే ప్రయత్నం అనేకమంది స్వాతంత్ర్య సమరయోధులు తమ త్యాగం,అంకితభావంతో సాధించిన స్వేచ్ఛా భారత స్వప్నాన్ని,మన 140 కోట్ల భారతీయులు అభివృద్ధి చెందిన,శ్రేష్ఠమైన దేశంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి సంగా పురుషోత్తం, జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు మాజీ కౌన్సిలర్ జయంత్ లాల్,9 వార్డ్ మాజీ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి,నాయకులు ఎర్రం రామన్న,దగ్గు విజేందర్ రావు,కుక్కల విజయ్ కుమార్, వేముల సదారాణి, వెనిశెట్టి శారద,ఆకుల రాంబాబు,పైండ్ల రంజిత్,ఆర్పీ సంగీత,బూత్ అధ్యక్షులు మరాఠీ నరసింహారావు,వెల్దండి హేమంత్,ముత్యాల దేవేందర్, ఉడుత చిరంజీవి,సదా మధుకర్,సారంగ నరేష్, కాగితపు చంద్రమోహన్,ఏకు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.