పురాణాలు, చరిత్ర ఆధారంగా వీరమల్లు పాత్ర..

పురాణాలు, చరిత్ర ఆధారంగా వీరమల్లు పాత్ర

పవన్‌ కల్యాణ్‌ యోధుడిగా కనిపించిన చిత్రం హరిహర వీరమల్లు’. ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో హీరో పాత్రలు ఎలా క్రియేట్‌ చేశారు. దాని వెనకున్న కథను దర్శకుడు వివరించారు.ఉత్కంఠభరితమైన తుది పోరుకు వేదిక అది..కలెక్షన్లు ఎందుకు చెప్పడం లేదు?

ఏపీ భవన్‌లో ప్రత్యేక షో!పవన్‌ కల్యాణ్‌ యోధుడిగా కనిపించిన చిత్రం హరిహర వీరమల్లు’. తొలుత క్రిష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తదుపరి నిర్మాత ఎ.ఎం.రత్నం కుమారుడు జ్యోతికృష్ణ పూర్తి చేశారు. ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో హీరో పాత్రలు ఎలా క్రియేట్‌ చేశారు. దాని వెనకున్న కథను దర్శకుడు వివరించారు.

ఈ సందర్భంగా జ్యోతికృష్ణ మాట్లాడుతూ ‘మొఘల్‌ చక్రవర్తులు హిందువులను ఇబ్బందికి గురిచేస్తూ, దేవాలయాలు నాశనం చేసిన చారిత్రక కథాంశంతో రూపొందిన సినిమా ఇది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన వస్తోంది. వీరమల్లు చిన్నప్పటి నుంచి ఓ గుడిలో పెరిగాడు. అందువల్ల వేద జ్ఞానాన్ని సంపాదించుకుని శక్తివంతమైన వ్యక్తిగా ఎదిగాడు. వేద గ్రంథాలను నాశనం చేసినప్పుడు ‘హరి హర వీరమల్లు’ బలంగా నిలబడ్డాడు. మొఘల్‌ చక్రవర్తుల ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. వేదాలలోని జ్ఞానాన్ని అంతా సంపాదించుకుని తనే ఒక వేద పండితుడిగా మారటంతో వాటిని నాశనం చేయడానికి వీలు లేకుండా పోయింది. అదే సెకెండాఫ్‌లో చూపించాం. వేద జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని వాస్తు శాస్త్రంలో  భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం వంటి పంచభూతాలను అవగతం చేసుకుని  ధర్మ సంబంధమైన జీవన విధానాన్ని నిర్మించటంలో తన వంతు పాత్రను పోషించాడు. అతని దూరదృష్టి, నైపుణ్యం మరెవరితోనూ పోల్చలేవివి. అందుకు చాలా ఉదాహరణలు సినిమాలో అంతర్భాగంగా కనిపిస్తాయి. సినిమాలో గుల్ఫమ్‌ ఖాన్‌ (కబీర్‌ దుహాన్‌ సింగ్‌)ను కొండపై జరిగే ప్రమాదం నుంచి కాపాడతాడు. అలాగే వరుణ యాగాన్ని అడ్డుకోవాలని చూసే వారి నుంచి   రక్షించి వరుణ దేవుడు కరుణించేలా చేస్తాడు. తోడేళ్లు దాడి చేయడానికి వచ్చినప్పుడు వాటితో మానసికమైన సంభాషణ చేసి తన తోటి వారికి ప్రమాదం జరగకుండా చూస్తాడు. అలాగే అయోధ్య నుంచి రాముడు లంకకు పయనిస్తున్న సమయంలో ఆయన ప్రయాణం అనేక ప్రాంతాల్లో సాగింది. అందుచేత రామాయణ కథకు ఆ ప్రాంతాలకు విడదీయరాని సంబంఽధం కలిగి ఉంది.  శ్రీరాముడి ప్రయాణంలో చిత్రకూట, పంచవటి, క్రౌంచ అరణ్యం, మతంగ ఆశ్రమం, బునిశ్యమూక పర్వతం వంటి ప్రసిద్థ ప్రాంతాల్లో ఆయన అడుగులు పడ్డాయి. అవన్నీ ఆధ్యాత్మిక ప్రాంతాలుగా, మరచిపోలేని మైలురాళ్లుగా వందల ఏళ్లు గడిచిన ఇప్పటికీ ప్రజల నుంచి పూజలు అందుకుంటున్నాయి. అలాగే హరి హర వీరమల్లు సినిమాలో తన ప్రయాణాన్ని గోల్కొండ నుంచి ఢిల్లీ వరకు సాగించారు. దక్షిణ భారతం నుంచి ఉత్తర భారతం వరకు సాగిన ఈ ప్రయాణంలో కథానాయకుడు వేద తత్వాలతో ప్రజలకు మంచి పనులు చేయటాన్ని గమనించవచ్చు. ఇతిహాసాన్ని, చరిత్రను మిళితం చేసి వీరమల్లు పాత్ర సనాతన ధర్మాన్ని ఎలా రక్షించాడనేది ఈ సినిమాలో చూపించాం. సినిమా చివర్లో.. వీరమల్లు, ఔరంగజేబు పాత్రలు కలుసుకోవడం అనేది అసాధారణంగా జరుగుతుంది. ప్రకృతి సృష్టించిన విపత్తులో ఇద్దరు కలుసుకుంటారు. ఇదే ఉత్కంఠభరితమైన తుది పోరుకు వేదిక అనాలి. అందుకనే క్లైమాక్స్‌ను ఓ క్లిప్‌ హ్యాంగర్‌లా తెరకెక్కించాం. ఇది రాబోయే భాగానికి కొనసాగింపుగా ఉంటుందనే అర్థానిస్తుంది’ అన్నారు.
కలెక్షన్లు ఎందుకు చెప్పడం లేదు..
సినిమా విడుదల రోజే సాయంత్రానికి ఎంత కలెక్ట్‌ చేసిందో పోస్టర్‌ విడుదల చేసి చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్‌. హరిహర వీరమల్లు సినిమా ప్రీమియర్స్‌ నుంచి ఇప్పటి దాకా ఎంత వసూలు చేసిందన్నది చిత్ర బృందం ప్రస్తావించలేదు. కలెక్షన్స్‌ పోస్టర్‌ ఎందుకు రిలీజ్‌ చేయలేదని దర్శకుడిని ప్రశ్నించగా జ్యోతికృష్ణ స్పందించారు. ‘మనం నిజాయతీగా కలెక్షన్స్‌ గురించి చెప్పినా.. కరెక్టా, కాదా అని చాలామంది చర్చిస్తుంటారు. విమర్శలు చేస్తుంటారు. కలెక్షన్స్‌ గురించి ఓ అంచనా అందరికీ ఉంటుంది. ట్రేడ్‌ ఎనలిస్ట్‌లు చెబుతూనే ఉంటారు. అందుకే ఒకప్పటిలాగా ‘విజయవంతంగా సినిమా ఆడుతోంది’ అని పోస్టర్ల ద్వారా చెబుతున్నాం. కలెక్షన్లకు సంబంధించి ప్రస్తుతానికి ప్రొడక్షన్‌ హౌస్‌ నుంచి ఎలాంటి పోస్టర్‌ రాలేదని చెప్పారు.
ఏపీ భవన్‌లో ప్రత్యేక షో..
హరిహర వీరమల్లు చిత్రాన్ని  ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆడిటోరియంలో శనివారం రాత్రి ఓ షో ప్రదర్శించగా అధికారులు, ఉద్యోగుల నుంచి మంచి స్పందన దక్కింది. ఆదివారం సాయంత్రం మరో షో వేయనున్నారు.

కన్నప్ప కల్పితం కాదు మన చరిత్ర.

కన్నప్ప కల్పితం కాదు మన చరిత్ర…

 

కన్నప్ప అనే శివ భక్తుడు ఉండేవాడు ఇప్పటికీ ఆయనను ఆరాధిస్తుంటారు కన్నప్ప సినిమా కథ కల్పితం కాదు అది మన చరిత్ర.

మన మధ్యలో జీవించిన ఓ వ్యక్తి కథ’ అని అన్నారు హీరో మంచు విష్ణు…

కన్నప్ప అనే శివ భక్తుడు ఉండేవాడు. ఇప్పటికీ ఆయనను ఆరాధిస్తుంటారు. ‘కన్నప్ప’ సినిమా కథ కల్పితం కాదు.. అది మన చరిత్ర. మన మధ్యలో జీవించిన ఓ వ్యక్తి కథ’ అని అన్నారు హీరో మంచు విష్ణు.

ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కన్నప్ప’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించింది. కార్యక్రమంలో మంచు విష్ణు మాట్లాడుతూ ‘ఈ సినిమాకు ఇప్పటి వరకు లక్షకు పైగా టికెట్లు తెగాయి.

ఇదంతా శివ లీల అనిపిస్తోంది. కుటుంబమంతా కలసి ఈ చిత్రాన్ని హాయిగా చూడాలని కోరుకుంటున్నాను. అందుకే నేను టికెట్‌ రేట్లు పెంచలేదు. ఏపీలో కొన్ని చోట్ల మాత్రమే పెంచాం. నా నలుగురు పిల్లలు ఈ చిత్రంలో నటించారు.

ఓ తండ్రిగా నా పిల్లల్ని తెరపై చూడటం ఆనందంగా ఉంది. దేవుడు, భక్తుడికి మధ్యలో ఎవరూ ఉండాల్సిన పని లేదు. మూఢ నమ్మకాలు అవసరం లేదు. దేవుడి మీద మనసారా భక్తి ఉంటే చాలు అని చెప్పాలని అనుకున్నాం.

ఈ చిత్రంలో మోహన్‌లాల్‌ పాత్ర ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది’ అని అన్నారు.
చిత్ర దర్శకుడు ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘‘కన్నప్ప’ చరిత్రను నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీశాం’ అని చెప్పారు. నటుడు శివ బాలాజీ మాట్లాడుతూ ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి.
ఒట్టేసి చెబుతున్నా అద్భుతంగా ఉంటుంది అని అన్నారు నటుడు కౌశల్‌ మాట్లాడుతూ ‘ప్రస్తుత తరమంతా ‘కన్నప్ప’ చిత్రాన్ని చూడాలి’ అని కోరారు.

కులగణన దేశ చరిత్రలో మైలురాయి.!

కులగణన దేశ చరిత్రలో మైలురాయి

-ఉనికి కోసమే ప్రతిపక్షాల రాజకీయ నాటకాలు

-విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ నేత చేవ్వ శేషగిరి యాదవ్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టడం దేశ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని బిజెపి నేత చేవ్వ శేషగిరి యాదవ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1931లో చివరిసారి బ్రిటిష్ ప్రభుత్వం కులగణన చేపట్టిందని, 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కులగణనపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ సిఫారసు చేసిన బీసీ కమిషన్ ను కాంగ్రెస్ పార్లమెంట్ లో చర్చకు తీసుకురాకుండా తిరస్కరించిన చరిత్ర మర్చిపోవద్దన్నారు. నెహ్రూ నుండి ఇందిరా, రాజీవ్ గాంధీ వరకు కాంగ్రెస్ నాయకులు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నారని ఆరోపించారు. కులగణన విషయంలో తెలంగాణ మోడల్ రాహుల్ గాంధీ అని రేవంత్ రెడ్డి మాట్లాడడం మొసలి కన్నీరేనన్నారు. తెలంగాణలో 12 శాతం ముస్లింలు ఉండగా..10 శాతం ఓబీసీలుగా చూపించి బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ మాదిరిగా కాకుండా..పాలనలో అనుభవం కలిగిన గొప్ప నాయకుడిగా ప్రధాని మోడీ పారదర్శకంగా జనాభా లెక్కలతో పాటు కులగణన చేపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆదివాసీలను కించపరిచే విధంగా మాట్లాడితే.!

ఆదివాసీలను కించపరిచే విధంగా మాట్లాడితే నీ సినిమా చరిత్రను తొక్కిపడేస్తాం

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),

నేటిధాత్రి:

ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో
గుండాల మండల కేంద్రంలో
అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ గుండాల మండల అధ్యక్షులు పూనెం రమణబాబు మాట్లాడుతూ
ఆదివాసీల చరిత్రను విమర్శిస్తే నీ సినిమా చరిత్రను తలకిందులుగా పాతాళానికి తొక్కవలసి ఉంటుంది ఖబర్దార్ ఔరంగజేబు విజయ దేవరకొండ నీకు ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాల గురించి ఏమి తెలుసు ఈ ప్రపంచానికి ఐక్యతను సమైక్యతను సంస్కృతిని సాంప్రదాయాలను నేర్పింది ఆదివాసీలే ఆయుర్వేద మూలికల వైద్యంతోనే సైన్స్ రంగాన్ని పునాది వేసింది ఆదివాసీలే అంతెందుకు నువ్వు కూడా నీ అభివృద్ధి చెందిన జాతని చెప్పుకునే నువ్వు కూడా ఆదిమానవుల మూలాల నుంచే అభివృద్ధి చెందిన అని చెప్పుకునే అప్పర్ క్యాస్ట్ గా వచ్చావు నీ మూలాలు మర్చిపోయి నిన్ను నువ్వే విమర్శించుకునే స్థాయికి ఎదిగా ఉంటే నువ్వు అభివృద్ధి చెందినట్లు అభివృద్ధి అనే ముసుగు వేసుకున్నట్టు తెలుసుకో ముందు.
500 సంవత్సరాల క్రితం సేన్స్ లేకుండా ట్రావెల్స్ కొట్టుకున్నారని మీరు అన్నారు.ఓకే కానీ నాడు సెన్స్ లేకుండా కొట్టుకున్న ఆధిపత్యం గుంపు మేలు కోసం తగల లాభాల కోసం కొట్టుకున్నారు. డ్రైవర్స్ కానీ సైన్సు స్పేస్ రంగాలు అభివృద్ధి చెందిన ఈ కాలంలో దేశాలు దేశాలు ఎందుకు కొట్టుకుంటున్నాయో దాన్ని మీరు వివరించగలరా ఆఫ్ చేయగలరా
అది చేతగాని మీకు 500 సంవత్సరాల నాటి ఆదివాసీల ఐక్యతను చరిత్రను గురించి మాట్లాడే అర్హత లేదు నీకు తక్షణమే క్షమాపణ చెప్పాలి లేకుంటే నీ దిష్టిబొమ్మలను ప్రతి వాడలొ తగలబెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుండాల మండల కార్యదర్శి గొగ్గెలా సుధాకర్, జబ్బా సుదర్శన్,ప్రశాంత్, సంపత్ ,రామ్మూర్తి,చింటూ తదితరులు పాల్గొన్నారు.

వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ.

వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ

అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూములు ఇండ్లు వెంటనే ఇవ్వాలి

సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

భారతదేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన ఏకైక పార్టీ సిపిఐ అని, పేద ప్రజల హక్కుల కోసం సమస్యల కోసం ఉద్యమిస్తున్న సిపిఐ పార్టీని రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు గెలిపించాలని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వెంటనే ఇవ్వాలని సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం సీతారాంపూర్ శాఖ మహాసభ కటికారెడ్డి బుచ్చన్న యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ భారత దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని సుదీర్ఘ చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐకి ఉందని, సిపిఐ శతజయంతి ఉత్సవాలను సిపిఐ శ్రేణులు ప్రతి శాఖలో ఘనంగా నిర్వహించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో గ్యాస్ సబ్సిడీ, ఉచిత కరెంట్ అర్హులైన వారిలో కొందరికి ఇంకా అందడం లేదనీ, గత బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో నగర శివారు చింతకుంటలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు వెంటనే ఇవ్వాలని లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ఆరులైన పేదల చేత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్దకు వెళ్తామని, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లను మంజూరు చేయాలని, నగరంలో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయి ఉన్నాయని ప్రభుత్వం వెంటనే స్థానిక ఎన్నికలు నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈసమావేశంలో సిపిఐ నాయకులు ఎర్రం యాదగిరి, కంపెళ్ళి కొమురయ్య, కాల్వల శ్రీనివాస్, రాకం భాస్కర్, నందమల్ల యేసు బాబు, కాల్వ మల్లేశం, జే.బుచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.

చరిత్రకారులను మరుగుపెట్టే చరిత్ర ఇంకా కొనసాగుతోంది.

చరిత్రకారులను మరుగుపెట్టే చరిత్ర ఇంకా కొనసాగుతోంది…
– చదువుకు కారణమైనోళ్ల గురించి తెలియకపోవడం దురదృష్టకరమే
– సావిత్రీబాయి పూలే మహిళాలోకానికే ఆదర్శనమని చాటాలే
– త్వరలో సావిత్రీబాయిపూలే విగ్రహం ఏర్పాటు చేస్తం
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

మంథని :- నేటి ధాత్రి

అట్టడుగువర్గాల కోసం త్యాగాలు చేసిన చరిత్రకారులను మరుగుపెట్టే చరిత్ర ఇంకా దేశంలో కొనసాగుతోందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. చదువులతల్లి సావిత్రీబాయి పూలే వర్థంతి సందర్బంగా సోమవారం మంథని పట్టణంలోని రాజగృహాలో సావిత్రీబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఆయన నివాళులు అర్పించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు అక్షరజ్ఞానం నేర్పిన సావిత్రీబాయి పూలే మహిళాలోకానికి ఆదర్శమనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని, అయితే ఆమె గురించి సమాజానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఆనాడు అణగారిన వర్గాలతో పాటు బ్రాహ్మణమహిళలను చదువుకు దూరంగా ఉంచిన సందర్బంలో మహాత్మాజ్యోతిరావుపూలే తన సతీమణి సావిత్రీబాయికి చదువు నేర్పించి మహిళలకు అక్షరాలు నేర్పించేలా ప్రోత్సాహం అందించారన్నారు. ఆనాడే మహిళల కోసం పాఠశాలను స్థాపించిన సావిత్రీబాయి పూలే చరిత్ర గురించి చెప్పాల్సిన బాధ్యత బీసీ, ఎస్సీ సమాజంపై ఉందన్నారు. ఆడవాళ్లు చదువుకోలేని సమయంలో వారికి అక్షరాలు నేర్పించారని, ఆనాడు ఆమె నేర్పించిన అక్షరజ్ఞానంతోనే ఈనాడు ఎంతో మంది ప్రయోజకలు అయ్యారని ఆయన గుర్తు చేశారు. చదువు రావడానికి, చదువుకోవడానికి కారణమైన సావిత్రీబాయి పూలే గురించి తెలియకపోవడం దురదృష్ణకరమని, సావిత్రీబాయి చరిత్ర గురించి ప్రతి ఒక్కరు భుజాన వేసుకుని గర్వంగా చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మంథని నియోజకవర్గంలో అనేక మంది మహనీయుల చరిత్ర తెలిసేలా విగ్రహాలు ఆవిష్కరించుకోవడం జరిగిందని, త్వరలోనే పుట్ట లింగమ్మ చారిటబుల్‌ ట్రస్టు ద్వారా మంథనిలో సావిత్రీబాయి పూలే విగ్రహాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తామని ఆయన ఈ సందర్బంగా తెలిపారు ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు

ఛత్రపతి శివాజీ మహారాజ్…

జహీరాబాద్. నేటి ధాత్రి:

భరత జాతి ముద్దుబిడ్డ.. వీరత్వం, పరాక్రమానికి ప్రతీకగా భావించే ఛత్రపతి శివాజీ మహారాజా జయంతి ఈరోజే. ఈ సందర్భంగా శివాజీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం…

భారతదేశ చరిత్రలో గొప్ప యోధులు, సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేర్లలో ఛత్రపతి శివాజీ పేరుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆయన పేరు ఉంటే హిందూ మతం ఉత్సాహంతో ఉప్పొంగిపోతుంది. చిన్నతనంలోనే మొఘలుల దాడులలో హిందూ మతం అంతరించి పోతుందని, వారితో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేసిన వేళ శివాజీ మహారాజు మండే నిప్పు కణికలా దూసుకొచ్చాడు. మొగల్ రాజులతో ఎంతో వీరోచితంగా పోరాడాడు. అందుకే హిందూమతాన్ని కాపాడిన ఘనత ఒక్క మరాఠా మహారాజు శివాజీకే దక్కుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే ఆ యోధుడి జన్మదినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా ఒక వేడుకలా జరుపుకుంటారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఒక పండుగలా నిర్వహిస్తారు. చరిత్రను పరిశీలిస్తే, 1674లో శివాజీకి చక్రవర్తిగా పట్టాభిషేకం జరిగింది. అంతటి గొప్ప వీరయోధుడి 394వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన పుట్టినప్పటి నుంచి వీర మరణం పొందే వరకు ఎలాంటి విజయాలు సాధించారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

శివాజీ జననం..

క్రీస్తు శకం 1630లో ఫిబ్రవరి 19వ తేదీన మహారాష్ట్ర పూణే జిల్లాలో ఉన్న జనార్‌లోని శివనీర్ కోటలో జిజియాబాయ్, షహాజీ దంపతులకు శివాజీ జన్మించారు. ఆయన తల్లి క్షత్రియ వంశీయురాలు. శివాజీ పుట్టకముందే పుట్టిన వారంతా చనిపోవడంతో, ఆమె శివపార్వతులను పూజించగా శివాజీ క్షేమంగా ఉన్నాడు. దీంతో ఆయనకు శివాజీ అనే పేరు పెట్టారు.

తల్లిదండ్రుల నుంచి..

శివాజీ మహారాజ్ కన్న తల్లి దగ్గరే పరమత సహనం, మహిళల పట్ల గౌరవంగా ఉండటం నేర్చుకున్నాడు. అతి చిన్న వయసులోనే తను పుట్టిన భూమికి మేలు చేయాలని, ప్రజలతో ఎలా నడుచుకోవాలో శివాజీకి జిజియబాయి పూస గుచ్చినట్టు వివరించారు. మరోవైపు తన తండ్రి పూణేలో జాగీరుగా ఉండేవారు. తన తండ్రి దగ్గర నుంచి యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. రాజనీతి మెళకువలు నేర్చుకుంటూ.. తన తండ్రి ఓటముల గురించి అధ్యయనం చేసేవాడు. అప్పుడే సరికొత్త యుద్ధ తంత్రాలను నేర్చుకున్నాడు.

కత్తి పట్టిన తొలిరోజుల్లోనే..

శివాజీ 17వ ఏటలోనే కత్తి పట్టాడు. అంతేకాదు వెయ్యి మంది సైన్యంతో వెళ్లి బీజాపూర్‌కు చెందిన తోర్నా కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత మూడేళ్లలోపే రాజ్‌ఘడ్, కొండన ప్రాంతాలను ఛేజిక్కుంచుకుని పూణే ప్రాంతాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు.

గెరిల్లా యుద్ధ రూపకర్త..

‘‘ఓటమి తప్పదు అనిపిస్తే యుద్ధం నుంచి తప్పుకోవాలి.. అనుకూల సమయాన్ని చూసి దాడి చేసి గెలవాలి’’ ఈ సూత్రాన్ని శివాజీ ఎక్కువగా నమ్మేవారట. ఇదే శివాజీ పాటించే యుద్ధ తంత్రం. దీన్నే గెరిల్లా యుద్ధం అంటారు.

అన్ని మతాలను సమానంగా..

శివాజీ మహారాజు ముస్లిముల దురాక్రమణను వ్యతిరేకించినప్పటికీ, తన రాజ్యంలో లౌకికవాదాన్ని పాటించారు. అన్ని మతాల వారినీ సమానంగా ఆదరించారు. ఇతర మతాల వారిని కూడా గౌరవించారు. అంతేకాదు హిందువుగా మారిన ఓ వ్యక్తికి తన కుమార్తెను ఇచ్చి వివాహం కూడా జరిపించారట.

తన సైన్యంలో..

ఛత్రపతి శివాజీ స్నేహితుల్లో చాలా మంది మహమ్మదీయులు ఉన్నారు. తన సైనిక వ్యవస్థలో కూడా ఎందరో ముస్లింలకు సముచిత స్థానం కల్పించారు.

ఆధునిక యుద్ధ తంత్రాలు..

శివాజీ యుద్ధ తంత్రాలు శత్రువులకు అస్సలు అంతుబట్టని విధంగా ఉండేవట. తిరుగులేని యుద్ధ వ్యూహాలను అనుసరించడమే శివాజీ అసమాన ప్రతిభకు నిదర్శనం. పటిష్టమైన సైన్యంతో పాటు నిఘా వ్యవస్థను కూడా కలిగి ఉండటమే కాకుండా, ఆధునిక యుద్ధ తంత్రాలను ఉపయోగించాడట.

బలమైన నావికా దళం..

శివాజీ మహారాజ్ పటిష్టమైన నావికా దళం మరాఠాలకు మరింత బలాన్ని పెంచింది. ఇందుకు శివాజీ వేసిన బలమైన పునాదులే కారణం. విదేశీ దండయాత్రల నుంచి కాపాడటానికి అవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆ కాలంలో ఏ రాజులకు ఇలాంటి ఆలోచనలు రాకపోవడం గమనార్హం.

అఫ్జల్ ఖాన్‌తో సమావేశం..

యుద్ధంలో భయంకరమైన అఫ్జల్‌ఖాన్ ముందుగానే శివాజీ యుద్ధ తంత్రాలను, గెరిల్లా యుద్ధం గురించి తెలుసుకుని.. శివాజీని రెచ్చగొట్టేందుకు, తనకు ఎంతో ఇష్టమైన దుర్గా మాత దేవాలయాన్ని కూలగొట్టాడట. అదే సమయంలో శివాజీ కుట్రలను పసిగట్టి తనను సమావేశానికి ఆహ్వానిస్తాడు.

మరాఠా యోధుడిగా..

అదే సమయంలో శివాజీ మహారాజ్ ముందుగానే తన ఉక్కు కవచాన్ని వేసుకుని, చేతికి పులి గోర్లు ధరించి అక్కడికి వెళ్తాడు. అందులో శివాజీ, అప్జల్ ఖాన్ కేవలం అంగరక్షకులతో మాత్రమే హాలులోకి వెళ్తారు. అక్కడ అప్జల్‌ఖాన్ శివాజీని కత్తితో పొడించేందుకు ప్రయత్నించగా.. తన పులి గోర్లతో శివాజీ అఫ్జల్ ఖాన్‌ను ఖతం చేస్తాడు. అందుకే ఆయనను మరాఠా యోధుడు, ఛత్రపతి శివాజీ మహారాజుగా పిలుస్తారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version