ఇందిరమ్మ ఇండ్ల పేరుతో విచ్చలవిడిగా ఇసుక రవాణా.
పట్టణాలకు తరలిస్తూసొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు
ఎలుకటి రాజయ్య మాదిగ. ఎమ్మార్పీఎస్ టీజీ జిల్లా అధ్యక్షుడు
భూపాలపల్లి నేటిధాత్రి
రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే ఇసుకను అక్రమార్కులు డంపులు చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ పీజీ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతా గరిమిళ్లపెల్లి,రామకిష్టాపూర్ ( వి)గ్రామాల్లో కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఇసుక ను ఇందిరమ్మ ఇండ్లు పేరుతో గ్రామాల్లో డంపులు ఏర్పాటు చేసి, పట్టణాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని, ఈ తతంగం అంతా రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో జరుగుతుందని అన్నారు. టేకుమట్ల మండలంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం టేకుమట్ల మండలకేంద్రంలోని చలివాగు నుండి ఇసుక తరలించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా వాటిని పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు ఇష్టారీతినా వ్యవహారిస్తూ, అక్రమార్కులకు సహకరించే విధంగా ప్రవర్తిస్తున్నారని, ఇటీవల గరిమిళ్లపెల్లి, రామకిష్టాపూర్ ( వి )గ్రామాల్లోని ఇసుక డంపులు అందుకు నిదర్శనం అని,ఈ దందా ఇలాగే కొనసాగితే భూగర్భ జలాలు అడుగంటిపోయి భవిష్యత్తులో సాగు, తాగు నీటికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇకనైనా జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టి, ఈ ప్రాంత సహజ వనరులను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని ఎలుకటి రాజయ్య డిమాండ్ చేశారు