గ్రామాభివృద్ధిలో సర్పంచ్ పాత్ర కీలకం…

గ్రామాభివృద్ధిలో సర్పంచ్ పాత్ర కీలకం…

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల మేడపల్లి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా గ్రామ నూతన సర్పంచ్ కొల్లూరు అరుణ ఆదేశాల మేరకు ఉప సర్పంచ్ మజహర్ అహ్మద్, గ్రామ కార్యదర్శి కాంచన రాథోడ్ నేతృత్వంలో గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నూతన సర్పంచ్ గ్రామ అభివృద్ధికి అధికారుల సమన్వయంతో పనులను చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, నీటి సమస్య, వీధి దీపాలు తదితర సమస్యలపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అదేవిధంగా దశలవారీగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రతి లబ్దిదారులకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అందే విధంగా చూడాలని పేర్కొన్నారు. నూతన సర్పంచ్ గ్రామ సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేశారు.పారిశుధ్య పనులపై గ్రామస్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బంటు శేఖర్, సిహెచ్ నిర్మలా లక్ష్మణ్, స్వప్న దిలీప్, రాములు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు

ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటా…

ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటా

పావుశెట్టి సునీల్ 7వ వార్డు అభ్యర్థి

పరకాల,నేటిధాత్రి

https://youtu.be/i0vGPu1YW4s?si=VEMl1XTexUQ7bDT4

పట్టణంలోని 7వ వార్డులో పావుశెట్టి సునీల్ విస్తృత ప్రచారం నినాదాలతో ఉత్సాహంగా సాగింది.ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు.తాగునీరు,డ్రైనేజీ, రోడ్ల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తానన్నారు.వార్డు అభివృద్ధికి సమిష్టిగా పని చేస్తామని తెలిపారు.
ప్రజల మద్దతే తన బలమని ఎన్నికల్లో విజయం సాధిస్తామనే నమ్మకం వ్యక్తం చేశారు.ప్రచారంలో నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో విచ్చలవిడిగా ఇసుక రవాణా.

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో విచ్చలవిడిగా ఇసుక రవాణా.

పట్టణాలకు తరలిస్తూసొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు

ఎలుకటి రాజయ్య మాదిగ. ఎమ్మార్పీఎస్ టీజీ జిల్లా అధ్యక్షుడు

భూపాలపల్లి నేటిధాత్రి

రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే ఇసుకను అక్రమార్కులు డంపులు చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ పీజీ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతా గరిమిళ్లపెల్లి,రామకిష్టాపూర్ ( వి)గ్రామాల్లో కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఇసుక ను ఇందిరమ్మ ఇండ్లు పేరుతో గ్రామాల్లో డంపులు ఏర్పాటు చేసి, పట్టణాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని, ఈ తతంగం అంతా రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో జరుగుతుందని అన్నారు. టేకుమట్ల మండలంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం టేకుమట్ల మండలకేంద్రంలోని చలివాగు నుండి ఇసుక తరలించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా వాటిని పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు ఇష్టారీతినా వ్యవహారిస్తూ, అక్రమార్కులకు సహకరించే విధంగా ప్రవర్తిస్తున్నారని, ఇటీవల గరిమిళ్లపెల్లి, రామకిష్టాపూర్ ( వి )గ్రామాల్లోని ఇసుక డంపులు అందుకు నిదర్శనం అని,ఈ దందా ఇలాగే కొనసాగితే భూగర్భ జలాలు అడుగంటిపోయి భవిష్యత్తులో సాగు, తాగు నీటికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇకనైనా జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టి, ఈ ప్రాంత సహజ వనరులను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని ఎలుకటి రాజయ్య డిమాండ్ చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version