విస్డం ఉన్నత పాఠశాలలో ఉల్లాసభరితంగా ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
రాయికల్: ఆగస్టు 14, నేటి ధాత్రి:
పట్టణంలోని విస్డం ఉన్నత పాఠశాలలో ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఉల్లాసభరితంగా నిర్వహించారు. దీనిలో విద్యార్థిని విద్యార్థుల చిన్ని గోపిక కృష్ణ వేషధారణలు అందరికీ చూడముచ్చట గొలిపాయి. ఈ సందర్భంగా ఉట్టి కొట్టే కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. దీనిలో గోపిక కృష్ణులు ఆటపాటలతో ఆనందంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల కరస్పాండెంట్ డా. ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి మాట్లాడుతూ కృష్ణం వందే జగద్గురుం-మహా విష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా అవతరించారని, జీవిత సత్యాలను, కర్మ సిద్ధాంతాన్ని, భక్తి మార్గాన్ని తన భగవద్గీత ద్వారా సమాజానికి అందించిన మహా పురుషుడు శ్రీకృష్ణుడు అని అన్నారు.అటువంటి శ్రీకృష్ణుడు అందించిన గీత సారాన్ని ప్రతి ఒక్కరూ వారి మనసులో నిలుపుకొని వాటి నియమాలను పాటిస్తూ మానవ జీవితాన్ని పునీతం చేసుకోవాలన్నారు. ఈ వేడుకల్లో డైరెక్టర్ ఎద్దండి నివేద రెడ్డి , ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.