యువతకు ఆదర్శం రాజీవ్ గాంధీ.

యువతకు ఆదర్శం రాజీవ్ గాంధీ

⏩ పేద ప్రజల గుండె చప్పుడు రాజీవ్ గాంధీ

⏩18 ఏళ్ల కే ఓటు హక్కు కల్పించిన వ్యక్తి రాజీవ్ గాంధీ

⏩ రాజీవ్ గాంధీ చొరవ వల్లే దేశంలో సాంకేతిక పరిజ్ఞానం

⏩ప్రజాసేవ కోసం ప్రాణ సైతం లెక్కచేయని వీరుడు రాజీవ్ గాంధీ

దుపాకి సంతోష్ కుమార్
16వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు

కాశిబుగ్గ నేటిధాత్రి

 

గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ 16వ డివిజన్ పరిధి గొర్రెకుంట క్రాస్ రోడ్డు వద్ద బుధవారం రోజున పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు ఉదయం 10.00 గంటలకు భారత రత్న,మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ 34 వ వర్దంతి సందర్భంగా 16వ డివిజన్ ఆధ్వర్యంలో కీర్తినగర్ క్రాస్ రోడ్డు వద్ద రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం 16వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు దుపాకి సంతోష్ కుమార్ మాట్లాడుతూ 1944 ఆగస్టు 20న న్యూఢిల్లీ లో జన్మించిన రాజీవ్ గాంధీ, ఢిల్లీలోని డాన్ బాస్కో స్కూల్ లో చదువుకున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు.
అతను లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు.
1968లో,సోనియా గాంధీని వివాహం చేసుకున్నాడు,
రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆధునీకరణ,ఉదారీకరణలపై దృష్టి సారించింది. కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్లు వంటి రంగాలలో అతను అనేక ముఖ్యమైన సంస్కరణలను ప్రవేశపెట్టాడు.రాజీవ్ గాంధీని భారతదేశంలో సమాచార విప్లవ పితామహుడిగా పరిగణిస్తారు.దేశంలో కంప్యూటరైజేషన్, టెలికమ్యూనికేషన్ విప్లవం ఘనత అతనికే చెందుతుందని అన్నారు. అతను విదేశీ విధానంలో చురుకైన పాత్ర పోషించాడు. శ్రీలంక, సోవియట్ యూనియన్ తో సంబంధాలను మెరుగుపరచడానికి కృషి చేశాడు.స్థానిక స్వపరిపాలన సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశారు.రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారని అన్నారు.రాజీవ్ గాంధీకి రాజకీయాలపై ఆసక్తి లేదని, అతను విమాన పైలట్‌గా పనిచేసేవారని కానీ 1980లో తన తమ్ముడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో అకాల మరణం తర్వాత, రాజీవ్ గాంధీ తన తల్లి ఇందిరా గాంధీకి మద్ధతుగా 1981లో రాజకీయాల్లోకి ప్రవేశించడం జరిగింది. తర్వాత 1983లో అతను ఉత్తరప్రదేశ్ నుండి అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు.1984 అక్టోబరు 31న ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఆమె అంగ రక్షకులచే హత్యకు గురయ్యారు.అప్పుడు 1984లో రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు.తదుపరి జనరల్‌ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి ప్రధానమంత్రిగా కొనసాగారు.1985లో ముంబైలో జరిగిన ఏఐసీసీ సర్వసభ్య సమావేశంలో రాజీవ్ గాంధీ సందేశ్ యాత్రను ప్రకటించాడు.అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ దీనిని దేశవ్యాప్తంగా నడిపింది.రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలు(పిసిసి),పార్టీ నాయకులు కలిసి ముంబై, కాశ్మీర్, కన్యాకుమారి, ఈశాన్య ప్రాంతాల నుండి నాలుగు పర్యటనలు చేశారు.మూడు నెలలకు పైగా సాగిన ఈ యాత్ర ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ముగించారు.పేద ప్రజల సంక్షేమం కోసం ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి 1991 మే 21న,రాజీవ్ గాంధీ తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ లో ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ఒక ఆత్మహత్య బాంబు దాడిలో హత్యకు గురయ్యాడు.
వారి మరణం దేశానికి తీరని లోటు అని అన్నారు.వారు చేసిన సేవలను ఎప్పటికి అను నిత్యం కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటూనే ఉంటుంది. పేద ప్రజలకు గుండె చప్పుడు గాంధీ కుటుంబమని వారు వ్యాఖ్యానించారు.దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం ఏదైనా ఉంది అంటే అది కేవలం గాంధీ కుటుంబం మాత్రమే అని కొనియాడారు.
ఈ కార్యక్రమం లో వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లెం సుధాకర్, జానపాక అధ్యక్షులు మహమ్మద్ జానీ,గరీబ్ నగర్ అధ్యక్షులు దాసారపు సారయ్య, కీర్తినగర్ అధ్యక్షులు హుజూర్,పరకాల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పిట్టల అనిల్,ప్రధాన కార్యదర్శి వల్లెం సాయికుమార్,పెద్ద జానీ,చెక్క రమేష్, గోదాసి చిన్ని,మాసూద్ అలీ,ప్రతాప్, కొమ్ముల రాజు, బిర్రు ప్రసాద్, రుద్రారపు సదా,అంకేశ్వరపు రాజు, మధుసూధన చారీ, మహిళా నాయకులు మౌనిక,నీలిమ,నూరజహాన్, కర్ణాకర్, రాజశేఖర్,అశోక్, శివ పవన్,అజీమ్,శ్రీనివాస్, మరియు 16వ డివిజన్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ.

సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ

– ఆయన వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

– కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

 

 

దేశంలో సాంకేతిక విప్లవానికి ఆజ్యం పోసి, కంప్యూటర్ యుగానికి నాంది పలికిన మహనీయుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి మండల నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ దూరదృష్టితో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృ ద్ధి, ఆర్థిక వ్యవస్థను సరళీ కృతం చేయడం, పరిశ్రమలకు రాయితీలు, పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టం చేయడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. అతిపిన్న వయసులోనే ప్రధాని పీఠాన్ని అధిరోహించి, దేశ భవిష్యత్తుకు నాడు నాటిన మొక్కలు నేడు వృక్షాలై ఫలా లుఅందిస్తున్నాయన్నారుయువతలో శక్తివంతమైన మార్పు ను కోరుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శానం కుమారస్వామి, మార పెల్లి కట్టయ్య, రమేష్, రాజేం దర్, వరదరాజు, మార్కండే య, రంగుబాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలంలో. తంగళ్ళపల్లి. ఓబులాపూర్ ఆరోగ్య ఉప కేంద్రం ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత ఆకస్మికంగా తనిఖీ చేసి తనిఖీలలోభాగంగా వ్యాధి నిరోధక టీకాలను రికార్డులను వ్యాక్స్ యొక్క కోల్డ్ చైన్ ను. పరిశీలించి సకాలంలో గర్భిణీలకు ఐదు సంవత్సరాల లోపు చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు అందించాలని. లక్ష్యాలు సాధించాలని సూచించారు. అకాల వర్షాలతో వైరస్ ప్రజలకు సుజనల్ వ్యాధులు వాటికప్పుడు అందజేయాలని విష జ్వరాలు ప్రజలకు సోకే అవకాశం ఉన్నందున దోమలు పుట్టకుండా కుట్టకుండా నివారణ జాగ్రత్తలు వహించాల్సిందిగా తెలియజేస్తూ వైద్య సిబ్బందికి తగిన సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ సంపత్ కుమార్ డాక్టర్ ఆసిఫా వైద్య సిబ్బంది హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఘనంగా హనీస్ వర్ధన్ జన్మదిన వేడుకలు.

ఘనంగా హనీస్ వర్ధన్ జన్మదిన వేడుకలు

పాల్గొన్న బిజెపి నాయకులు

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలంలోని భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపెల్లి సాయిగీత- శ్రీకాంత్ దంపతుల పుత్రుడు హనీష్ వర్ధన్ మొదటి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ పుట్టినరోజు వేడుకకు రాష్ట్ర,మండల బిజెపి నాయకులు పాల్గొని ఆశీర్వ ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సి లింగ్ మెంబర్ రాయరాకుల మొగిలి,మండల అధ్యక్షులు నరహరిశెట్టి రామకృష్ణ, సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి, బూత్ అధ్యక్షులు సుమన్ చంద్రమొగిలి, నవీన్, రవి, మురళి పాల్గొన్నారు.

రాయపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక.

రాయపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక

నేటిధాత్రి, రేగొండ..

 

 

రేగొండ మండలంలోని రాయపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశానుసారం ఎన్నుకున్నట్లు కనపర్తి ఎంపీటీసీ పరిధి ఇంఛార్జ్ బోయిన వినోద్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా గుర్రం జగన్, ఉపాధ్యక్షుడిగా దండవేన రమేష్, రాజయ్య, సాంబయ్య, ప్రధాన కార్యదర్శిగా మంద మొగిలి, క్యాతం రమేష్, అశోక్ ను ఎన్నుకున్నట్లు వినోద్ తెలిపారు. వినోద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరవేసే విధంగా చొరవ చూపాలని కోరారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో భూపాలపల్లి మరింతగా అభివృద్ధి చెందుతున్నారు. నూతనంగా ఎన్నికైన గ్రామ కమిటీ అధ్యక్షుడు సాగర్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు..ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు క్యాతం సదయ్య, పున్నం రవి, బొజ్జం రవి, తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు లబ్ధిదారులు 30 రోజుల్లో గా ప్రారంభించాలి.

ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు లబ్ధిదారులు 30 రోజుల్లో గా ప్రారంభించాలి.

జిల్లా కలెక్టర్..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో. మండలంలో. పలు గ్రామాలకు చెందిన. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు రెండో విడత కింద 500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే దసరా దీపావళి పండుగలకు నూతన గృహప్రవేశం జరుపుకోవాలని తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండలంలో ప్రజలకు రెండో విడత ఇండ్ల మంజూరు జారీచేశామని పెట్టుబడి లేని నిరుపేదలకు స్వయం మహిళ సంఘాల ద్వారా లక్ష రూపాయల రుణం మంజూరు చేశామని. ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం. లబ్ధిదారులు విడుదల విధిగా నిర్మించుకోవాలని. ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి. ఏఎంసీ చైర్మన్ స్వరూప తిరుపతిరెడ్డి. వైస్ చైర్మన్. నేరెళ్ల నర్సింగం గౌడ్. తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్. జిల్లా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

రైతులను మోసం చేస్తున్న సొసైటీ చైర్మన్లు.

రైతులను మోసం చేస్తున్న సొసైటీ చైర్మన్లు…

* ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతుల ధర్నా…

*మొలకలు వస్తున్న ధాన్యం…

*పట్టించుకోని సొసైటీ పాలకవర్గం,
అధికార యంత్రాంగం…

*ధర్నా చేయుచున్న పైతర గ్రామ రైతులు…

కొల్చారం( మెదక్ )నేటి ధాత్రి:

రైతన్నలు కష్టపడి ఆరుగాలం పండించిన పంట అమ్ముకుందామంటే అన్నమో రామచంద్రా అంటూ బోరున విలపిస్తున్నారు. ధాన్యం తూకం కొనుగోలు కాకపోవడంతో వర్షానికి తడిసి మొలకలు వస్తున్న కూడా ఇటు సొసైటీ పాలకవర్గం మరియు అధికారులు పట్టించుకోకపోవడంతో పండించిన ధాన్యం.

cheating farmers

మొలకలు రావడంతో చివరికి మాకు పురులమందే దిక్క అంటూ కొల్చారం మండలంలోని పైతర గ్రామ రైతులు మెదక్ – సంగారెడ్డి ప్రధాన రహదారిపై వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ మొలకలు వచ్చిన ధాన్యమును చూపిస్తూ రైతులు ధర్నా చేయుచున్నారు ఒకవైపు తూకం వేసిన ధాన్యము లారీలు రాకపోవడంతో సొసైటీ పాలకవర్గం నురైతులు అడుగుచుండగా లారీలు వస్తలేవు మేమేం చేయాలి అని పాలకవర్గం తప్పించుకుంటున్నారు మా రైతుల గోడును అధికార యంత్రాంగం అర్థం.

cheating farmers

చేసుకొని మేము పండించిన ధాన్యమును కొనుగోలు చేసి లారీలు పంపించి తూకం వేసిన ధాన్యమును రైస్ మిల్లర్లకు చేరవేయాలని పైతర గ్రామ రైతులు రోడ్డుపైన మొలకలు వచ్చిన ధాన్యము చూపిస్తూ అధికారులను వేడుకొనుచున్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.

తనపై ఆసత్య ఆరోపణలు చేసిన వారిపై కలెక్టర్.!

తనపై ఆసత్య ఆరోపణలు చేసిన వారిపై కలెక్టర్ కి ఫిర్యాదు ఆర్ఐ తిరుపతి

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో మంగళవారం మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగారపు రమేష్ జైపూర్ ఆర్ఐ తిరుపతిపై చేసిన ఆరోపణలు నిరాధారమైన అసత్య ఆరోపణలనీ అన్నారు.తను ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తీర్చుతూ అందరితో స్నేహపూర్వకంగా ఉంటానని,తనపై లేనిపోని ఆరోపణలు చేసి సోషల్ మీడియాలో తన పరువు పోయేలా చేశారని,దానివల్ల ఎంతో మానసిక వేదనకు గురయ్యానని,తన కుటుంబ సభ్యులు అవమాన భారంతో కృంగిపోతున్నారని అన్నారు. నేను ఎటువంటి తప్పు చేయలేదని,విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేశానని,నేను తప్పు చేసినట్లు మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిరూపిస్తే నేను అధికారులు చేపట్టే చర్యలకు సహకరిస్తానని అన్నారు.కానీ ఇలాంటి ఆధారాలు లేకుండా తనపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ని కోరడం జరిగిందని తెలిపారు.

జైపూర్ ఆర్ఐ పై వచ్చిన వార్తకి స్పందించిన తహసిల్దార్ వనజా రెడ్డి

జైపూర్ ఆర్ఐ తిరుపతి పై వచ్చిన ఆరోపణలు ఆవాస్తవమని తహసిల్దార్ వనజా రెడ్డి తన కార్యాలయంలో బుధవారం తెలియజేశారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మా పరిధిలో ఉంటే తప్పకుండా వెంటనే స్పందిస్తామని,సమస్యను పరిష్కరిస్తున్నామని అన్నారు. తాము ఏదైనా తప్పు చేసినట్లు అనిపిస్తే తమ పై అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయవచ్చునని,అందులో నిజం ఉంటే అధికారులు దర్యాప్తు నిర్వహించి చర్యలు చేపడతారని తెలిపారు.తమ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్ఐ తో పాటు మిగతా అధికారులు కూడా అంకితభావంతో పనిచేస్తున్నామని,ప్రజా సమస్యలను తీర్చడంలో ఒక అడుగు ముందే ఉన్నామని తెలియజేశారు.ఇలా సోషల్ మీడియా ద్వారా అధికారులను అపరాదులుగా చూపిస్తూ,అసత్య ఆరోపణలు,ప్రచారాలు చేస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసిన వారిపై తప్పకుండా చర్యలు చేపడతామని హెచ్చరించారు.

దశ దిన కర్మలకు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ఆర్థిక సహాయం.

దశ దిన కర్మలకు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ఆర్థిక సహాయం

బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ట్రస్ట్ సభ్యులు

మంగపేట నేటిధాత్రి

 

 

 

వాగొడ్డుగూడెం గ్రామపంచాయతీ లోగల నిరుపేద కుటుంబానికి చెందిన బుడుగుల పిచ్చయ్య ఇటీవల అనారోగ్యం తో మృతి చెందాడు. కన్నీరు మున్నీరు అవుతున్న బాధిత కుటుంబాన్ని ట్రస్ట్ సభ్యులు కలిసి పరామర్శించి,25 కేజీ ల బియ్యాన్ని మరియు ఆర్థిక సహాయంని శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగరమేష్ ఆదేశాలమేరకు ట్రస్ట్ సభ్యులు వారి కుటుంబ సభ్యులైన భార్య కాంతమ్మ, కొడుకు రమేష్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొమరం శివాజీ ,ఆలం శ్రీను, గట్టిపల్లి అర్జున్, చౌలం బాబు,గట్టిపల్లి బాలకృష్ణ మరియు గ్రామస్తులు గట్టిపల్లి సమ్మయ్య ,చౌలం నవీన్ ,చౌలం సుధాకర్, కొట్టెం రాము, బుడుగుల కృష్ణ,
పూనెం గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

ముక్తేశ్వర స్వామికి ఎమ్మెల్యే పూజలు.

‘ముక్తేశ్వర స్వామికి ఎమ్మెల్యే పూజలు’

జడ్చర్ల /నేటి ధాత్రి

 

 

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి బుధవారం నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఆరు మండలాల పాత్రికేయ బృందం 100 వాహనాలతో.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాలేశ్వరం త్రివేణి సంగమం శ్రీ సరస్వతి నదిలో స్థానం ఆచరించి.. శ్రీ ముక్తేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన అర్చకులు తీర్థ ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. భావాలతో దైవారాధన చేయాలన్నారు.

ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు.

ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

 

పాలకుర్తి నేటిధాత్రి

 

 

 

పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో భారత మాజీ ప్రధాని, యువ భారత్ శిల్పి శ్రీ రాజీవ్ గాంధీ వర్దంతిని పురస్కరించుకుని, ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు పాలకుర్తి కాంగ్రెస్ ఇంచార్జ్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ సేవలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ ఘన నివాళులు అర్పించారు..

ఈ సందర్భంగా శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ భారతదేశానికి నూతన దిశను చూపిన మహానాయకుడు. 21వ శతాబ్దం భారతానికి తగిన సాంకేతికత, ఐటీ విప్లవం, యువతలో నూతన ఆశలు నూరిపోసిన వ్యక్తి. గ్రామీణ అభివృద్ధి, విద్య, ఆరోగ్యం రంగాల్లో ఆయన దూరదృష్టితో అమలు చేసిన పథకాలు ఇవాళా కూడా దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన రాజీవ్ గాంధీ, గ్రామ పంచాయతీ వ్యవస్థను బలపరిచారు. ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఆయన కలలను సాకారం చేయడంలో ముందుండి నడుస్తోంది. పలువురు నాయకులు రాజీవ్ జీవితం, స్వప్నాలు, దేశాభివృద్ధికి చేసిన సేవలపై ప్రసంగించారు.

సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ.

సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ.

వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.

టిపిసిసి మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్.

చర్ల నేటిధాత్రి:

 

దేశంలో సాంకేతిక విప్లవానికి ఆజ్యం పోసి కంప్యూటర్ యుగానికి నాంది పలికిన మహనీయుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఆవుల విజయభాస్కర్ రెడ్డి అన్నారు. వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి మండల నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టిపిసిసి మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ దూరదృష్టితో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృ ద్ధి ఆర్థిక వ్యవస్థను సరళీ కృతం చేయడం పరిశ్రమలకు రాయితీలు పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టం చేయడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చీమలమర్రి మురళి మాట్లాడుతూ అతిపిన్న వయసులోనే దేశ ప్రధాని పీఠాన్ని అధిరోహించి దేశ భవిష్యత్తుకు నాడు నాటిన మొక్కలు నేడు వృక్షాలై ఫలాలు అందిస్తున్నాయన్నారు యువతలో శక్తివంతమైన మార్పును కోరుకున్నారని గుర్తు చేశారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ఫా శ్రీను మడకం పద్మ మరియు రామ్ కుమార్ గుండెపూడి భాస్కరరావు ఉప్పరిగూడెం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ మరియు రాజా సర్కార్ బొళ్ల వినోద్ మరియు మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ.

సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ.

వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.

టిపిసిసి మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్.

చర్ల,నేటిధాత్రి:

 

దేశంలో సాంకేతిక విప్లవానికి ఆజ్యం పోసి కంప్యూటర్ యుగానికి నాంది పలికిన మహనీయుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఆవుల విజయభాస్కర్ రెడ్డి అన్నారు. వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి మండల నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టిపిసిసి మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ దూరదృష్టితో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృ ద్ధి ఆర్థిక వ్యవస్థను సరళీ కృతం చేయడం పరిశ్రమలకు రాయితీలు పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టం చేయడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చీమలమర్రి మురళి మాట్లాడుతూ అతిపిన్న వయసులోనే దేశ ప్రధాని పీఠాన్ని అధిరోహించి దేశ భవిష్యత్తుకు నాడు నాటిన మొక్కలు నేడు వృక్షాలై ఫలాలు అందిస్తున్నాయన్నారు యువతలో శక్తివంతమైన మార్పును కోరుకున్నారని గుర్తు చేశారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ఫా శ్రీను మడకం పద్మ మరియు రామ్ కుమార్ గుండెపూడి భాస్కరరావు ఉప్పరిగూడెం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ రాజా సర్కార్ బొళ్ల వినోద్ మరియు మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కుక్క ముడి సంపత్ కు దళిత రత్న అవార్డు.

కుక్క ముడి సంపత్ కు దళిత రత్న అవార్డు

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం బస్వ రాజుపల్లి గ్రామానికి చెందిన కుక్క ముడి పోచమ్మ పోశయ్య కుమారుడు కుక్క ముడి సంపత్ వైద్య రీత్యా కొత్తగూడెం లో నివసిస్తున్నారు ఈయన గత 35 సంవత్సరాలుగా వైద్య రంగంలో విశిష్ట సేవలు పేదలకు ఉచితంగా సేవలు అందిస్తున్న భద్రాది కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలానికి కుక్కమూడి సంపత్ ను రాష్ట్ర ప్రభుత్వం దళిత రత్న అవార్డుకు ఎంపిక చేసింది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ 134వ జయంతి సందర్భంగా సోమవారం హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు జన్ను కనకరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటుక రాజు రాష్ట్ర అధ్యక్షులు ఉమ్మడి ఖమ్మం జిల్లా బాధ్యులు డాక్టర్ కోరిపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా స్థానికులు కు సుపరిచితులుగా ఉంటూ పలు రకాల సేవ కార్యక్రమాలలో ఆయన చురుకుగా పాల్గొంటున్నారు లయన్స్ క్లబ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వామ్యం వహిస్తూ పేదలకు తన వంతు సహాయం అందిస్తున్నారు డయాబెటిస్ రోగులకు ఉచితంగా రోగనిర్ధారణ పరీక్షలు ఔషధాలు ఏర్పాటు చేస్తున్నారు సంపత్ కు ఈ అవార్డు దక్కడం పట్ల బస్వ రాజు పల్లి కుటుంబ సభ్యులు స్నేహితులు గ్రామస్తులు హర్షం వ్యక్తం ఉన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిభకు దక్కిన పురస్కారం గా అభివర్ణించారు భవిష్యత్తులో ఆయనకు మరిన్ని అవార్డులు దక్కాలని కోరుకున్నారు

రెవెన్యూ అధికారి పై అసత్య ప్రచారం చేసిన.

జైపూర్ మండల రెవెన్యూ అధికారి పై అసత్య ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలి

టీఎన్జీవోఎస్ అధ్యక్షుడు గడియారం శ్రీహరి

జైపూర్,నేటి ధాత్రి:

 

 

జైపూర్ మండలంలో రెవెన్యూ ఇన్సెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న తిరుపతి పై ప్రెస్ మీట్ నిర్వహించి అకారణంగా అసత్య,నిరాధార ఆరోపణలు చేసిన మాదిగ హక్కుల దండోరా నాయకులు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం వారు ఖండించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆర్ఐ తిరుపతి పై అనవసరంగా కొందరు ఆరోపణలు చేస్తున్నారని, ఇవన్నీ నిరాధారమైనవని కేవలం కక్ష్య పూర్వకంగా చేసినవని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం జైపూర్ ఏసిపి కార్యాలయంలో పిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా టిఎన్జీవోస్ అధ్యక్షుడు గడియారం శ్రీహరి,సెక్రెటరీ రామ్మోహన్,టీఎన్జీవోఎస్ మందమర్రి యూనిట్ అధ్యక్షులు ఏ.సుమన్,కార్యదర్శి సిహెచ్.సతీష్,సభ్యులు రవిచందర్,శ్రీనివాస్,లోకుల ప్రశాంత్,అరెల్లి సత్యనారాయణ,పి.సురేష్, బాణాల ఉదయ్ కుమార్,స్వామి,అపర్ణాదేవి, కళాశిల్ప,రజిత,విజయ్, తిరుపతి,రాజన్న తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి వేడుకలు.

ఘనంగా రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి వేడుకలు

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేటిధాత్రి..

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీచిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశాన్ని
అనేక రంగాల్లో అభివృద్ధి చేసిన ధృవతార ఐటి రంగానికి పునాదులు వేసిన మార్గదర్శి, నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్భాందవుడు యువతకు 18 ఏళ్ళకే ఓటు హక్కును కల్పిస్తూ యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేలా చేసిన సంస్కరణ కర్త రాజీవ్ గాంధీ అని అన్నారు..
భారతదేశ సాంకేతిక అభివృద్ధి ఆద్యుడు, పరిపాలనలో సంస్కరణలు తెచ్చిన నాయకులు, దేశ సౌభ్రాతృత్వం కాపాడటం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహనీయులు, నవ భారత నిర్మాత, భారతరత్న దివంగత ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ
ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన పాలనాధ్యక్షులు, భారత రత్న, మాజీ ప్రధాని . రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా మహానీయుడికి ఘనంగా నివాళులు ఆర్పిస్తూ,రాజీవ్ గాంధీ ప్రతి పేద వాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అని తెలిపారు .

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నాయకులు పోలేబోయిన తిరుపతయ్య , మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు మండల నాయకులు ఎర్ర సురేష్ , పోలేబోయిన రుక్నారావు , బరపటి వెంకన్న , జట్ల సత్యం , కరకపల్లి నాగేష్ , దంచనాల రాజేంద్రప్రసాద్ , సుర సంతోష్ , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు.

భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు

మందమర్రి నేటి ధాత్రి:

భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని, ఆలయ రజతోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమర్రి పంచముఖ హనుమాన్ ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్రిదండి రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో 108 మంది పూజారుల మంత్రోచ్ఛారణ 108 కళాశాలతో వాయు పుత్రునికి అభిషేకం నిర్వహించారు.

Hanuman Jayanti

భక్తుల శ్రీరామ నామ స్మరణ నడుమ 108 కళాశాలలోని పంచామృతాలు, పండ్ల రసాలు, వివిధ జలాలు పంచామృతాలతో స్వామి వారికి జరిపించిన అభిషేకం చూసి భక్త జనులు పులకరించిపోయారు. ఈ సందర్భంగా ఐదు రోజులుగా జరుగుతున్న రామాయణ హోమం ఈరోజుతో ముగిసింది. అంతకుముందు ఆలయం పై భాగంలో సుదర్శన చక్రాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆరోగ్యాన్ని ఎప్పటికప్పు డు పరీక్షించుకోవాలి-ఎస్కే గౌస్.

ఆరోగ్యాన్ని ఎప్పటికప్పు డు పరీక్షించుకోవాలి – ఎస్కే గౌస్

ఉచిత ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం పరుచుకో వాలి

డాక్టర్ షఫీ కార్డియాలోజిస్ట్ ఎండి సర్జన్

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

శాయంపేట మండలంలోని ప్రగతి సింగారం గ్రామం ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో మెడికవర్ శరత్ ఐవిజన్ సంయుక్తంగా గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటుచేసిన అనంతరం ఎస్కే గౌస్ మాట్లా డుతూ రైతులు శారీరకంగా మానసికంగా అనేక పని ఒత్తిడి వల్ల అనారోగ్యానికి గురైనటు వంటి సందర్భాల్లో ఎన్నో కలు గుతున్నాయి మీరు ఆరోగ్యా న్ని పరిరక్షించడం కొరకై ప్రజ్వల్ రైతు ఉత్పత్తుల సంఘం ఇలాంటి కార్యక్రమాలు గ్రామ గ్రామాలలో ఏర్పాటుచేసి ఆరోగ్య పరిరక్షణ కొరకై రైతులు ఆరోగ్య పరిరక్షణ కొరకై పాటు పడుతుందని అన్నారు.ఇలాంటి ఉచిత ఆరోగ్య శిబిరాలను సద్విని యోగం చేసుకోవాలని సూచిం చారు. బుధవారం రోజు మెడికవర్ శరత్ ఐ విజన్ సహకారంతో గ్రామంలో 135 మందికి పరీక్షించగా ఇందులో 35 మందికి కంటి పరీక్షలు ఉచితంగా చేయునట్లు తెలిపారు అదేవిధంగా ఈసీజీ ద్వారా 45 మంది పరీక్షించు కోవడం జరిగింది.ఇంతటి సహాయ సహకారాలు అందిం చిన మెడికవర్ హాస్పిటల్ శరత్ ఐవిజన్ హాస్పిటల్ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో నవయుగ పాలకవర్గ సభ్యులు కర్ర ఆదిరెడ్డి గ్రామ కార్యదర్శి కిరణ్ మెడి కవర్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ ఎండి సర్జన్ , డాక్టర్ షఫీ, జనరల్ సర్జన్ డాక్టర్ జిన్నత్ రెడ్డి ,ప్రోగ్రాం కోఆర్డినేటర్ సుమంత్ ,పియు మేనేజర్ గుడమాల మానస చౌదరి, గ్రామ క్షేత్ర కార్యకర్తలు రవిచంద్ర, పోతు సునీల్,వంశీ , ప్రశాంత్  పాల్గొన్నారు.

రైతులకు అనుగుణంగా ధాన్య కొనుగోలు కేంద్రాలు.

రైతులకు అనుగుణంగా ధాన్య కొనుగోలు కేంద్రాలు పనిచేయాలి.

వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి.

నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు.

నల్లబెల్లి నేటి ధాత్రి:

ప్రభుత్వ నిబంధన ప్రకారం వడ్ల కొనుగోలను ప్రభుత్వ నిబంధన ప్రకారం కొనుగోలు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాల యజమానులు వ్యవహరించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి పేర్కొన్నారు బుధవారం మండలంలోని మేడపల్లి, రాంపూర్, ఆసరవెల్లి, గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకెపి కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్న సభ్యులకు తగు సూచనలు చేయడం జరిగింది. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాల మేరకు రైతుల వద్ద నుండి వరి ధాన్యం కొనుగోలు చేసి ప్రభుత్వానికి సహకరించాలని అదేవిధంగా ఎలాంటి అవినీతి పాల్పడకుండా రైతు పక్షాన నిలబడి రైతులకు సహకరించాలని కొనుగోలు కేంద్రాల యజమాను లను ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పిడి డిఆర్డిఏ కౌసల్య దేవి, తాసిల్దార్ ముప్పు కృష్ణ, అధికారులు, స్థానిక నాయకులు, కొనుగోలు కేంద్రాల నిర్వహకులు తదితరు లు పాల్గొన్నారు.

కుమ్మరికుంటలో అమృత్ మిత్ర కార్యక్రమం..

కుమ్మరికుంటలో అమృత్ మిత్ర కార్యక్రమం..

నర్సంపేట,నేటిధాత్రి :

 

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరికుంట చెరువు వద్ద అమృత్ మిత్ర 2.0 కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ భాస్కర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆ ప్రాంతానికి సంబంధించిన ధరణి సృష్టి మహిళా సమైక్యల సంఘాల మహిళలతో చెట్లు నాటించుట కొరకు అమృత్ మిత్ర 2.0 కిట్లను మున్సిపల్ కమిషనర్ భాస్కర్ అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ రాజేష్ సానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు, మెప్మా డిఎంసి రేణుక,ఏడీఎంసి ఎస్.కె వహీదా టీఎల్ఎఫ్ ఆర్పి లు మాధవి సిఎల్ఆర్బి సుమలతతో పాటు సంఘాల మహిళలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version